ఓటీటీలో ఆ మూడింటిందే హ‌వా!

'యానిమ‌ల్'..'స‌లార్' చిత్రాలు బాక్సాఫీస్ ఎలాంటి సంచ‌ల‌నాలు న‌మోదు చేసాయో చెప్పాల్సిన ప‌నిలేదు

Update: 2024-02-20 23:30 GMT

'యానిమ‌ల్'..'స‌లార్' చిత్రాలు బాక్సాఫీస్ ఎలాంటి సంచ‌ల‌నాలు న‌మోదు చేసాయో చెప్పాల్సిన ప‌నిలేదు. ఒకేసారి రిలీజ్ కాక‌పోయినా బాక్సాఫీస్ వ‌ద్ద వ‌సూళ్ల ప‌రంగా పోటాపోటీగా నిలిచాయి. 900 కోట్లు..700 కోట్లు వ‌సూళ్ల‌తో రెండు సినిమాలు బాక్సాఫీస్ ని షేక్ చేసాయి. తాజాగా ఈ సినిమాలు ఓటీటీలో దుమారం రేపుతున్నాయి. నెట్ ప్లిక్స్ లో రిలీజ్ అయిన 'యానిమ‌ల్' మొద‌టి స్థానంలో నిల‌వ‌గా.. హాట్ స్టార్ లో అందుబాటులో ఉన్న 'స‌లార్' రెండ‌వ స్థానంలో నిలిచింది.

జ‌న‌వ‌రి 26 నుంచి 'యానిమ‌ల్'.. జనవరి 12 నుంచి స‌లార్ హాట్ స్టార్ లోనూ రెండు యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్లు అందుబాటులో ఉన్నాయి. ఈ రెండు సినిమాల‌కు ఓటీటీ ఆడియ‌న్స్ నుంచి భారీ ఎత్తున రెస్పాన్స్ ల‌భిస్తుంది. థియేట‌ర్ ని మంచి గొప్ప రెస్పాన్స్ ఓటీటీలోనూ ద‌క్కుతుంది. యానిమ‌ల్ హిందీ సినిమా అయినా తెలుగులోనూ అందుబాటులో ఉండ‌టంతో ఇక్క‌డ బుల్లి తెర ఆడియ‌న్స్ ర‌ణ‌బీర్ సినిమాకి పెద్ద పీట వేస్తున్నారు.

ఈ ర‌కంగా ఓటీటీ ద్వారా కూడా ర‌ణ‌బీర్ తెలుగు ఆడియ‌న్స్ కి మ‌రింత ద‌గ్గ‌ర‌వుతున్నాడు అన‌డానికి ఇదొక సంకేతం. భారీ ఎత్తున కొత్త సబ్ స్క్రిప్ష‌న్స్ పెరుగుతున్నాయి. గ‌తంలో ఈ రేంజ్ లో రెస్పాన్స్ రాజ‌మౌళి సినిమాలు బాహుబ‌లి...ఆర్ ఆర్ ఆర్ చిత్రాల‌కు ద‌క్కింది. ఆ త‌ర్వాత మ‌రో తెలుగు సినిమాకి ఆ రేంజ్ లో స్పంద‌న రావ‌డం అన్న‌ది ఇదే మొద‌టిసారి. ఇక సంక్రాంతి కానుక‌గా రిలీజ్ అయిన 'గుంటూరు కారం' కూడా ఓటీటీలో బాగానే ఆడేస్తుంది. మూడ‌వ స్థానంలో ఆ సినిమానే క‌నిపిస్తుంది.

ఈ నెల 9వ తేదీ నుంచి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది. థియేట‌ర్ రిలీజ్ లో తొలుత నెగిటివ్ టాక్ వ‌చ్చినా త‌ర్వాత పిక్ అయిన సంగ‌తి తెలిసిందే. ఇప్పుడా పాజిటివ్ టాక్ ఓటీటీకి బాగానే వ‌ర్కౌట్ అవుతుంది. మ‌హేష్ పెర్పార్మెన్స్ ని ఓటీటీ ఆడియ‌న్స్ బాగానే ఎంజాయ్ చేస్తున్నారు. ఇంకా ఇత‌ర భాష‌ల సినిమాలు వీటికి పోటీగా ఉన్న‌ప్ప‌టికీ ఈ మూడు చిత్రాల ముందు అవి తేలిపోతున్నాయి. ర‌ణ‌బీర్..ప్ర‌భాస్..మ‌హేష్ ల ఫ్యాన్స్ బేస్ ఈ చిత్రాల‌కు ఓటీటీలో బాగా క‌లిసొస్తుంది.

Tags:    

Similar News