గాంధీ బ‌యోపిక్ లో రియ‌ల్ వైఫ్!

కస్తూర్బా పాత్ర కోసం మ‌రో న‌టిని తీసుకోవ‌డం కంటే ప్రతీగ్ గాంధీ భార్య అయితేనే నూరుశాతం న్యాయం చేస్తుంద‌ని ఆమెనే ఎంపిక చేసుకున్నారు.

Update: 2024-04-11 06:33 GMT

స్వాతంత్య్ర‌ స‌మ‌ర‌యోధుడు మ‌హ‌త్మాగాంధీ జీవితంపై ఇప్ప‌టివ‌ర‌కూ ప‌లు చిత్రాలు తెర‌కెక్కిన‌ సంగ‌తి తెలిసిందే. బాలీవుడ్ స‌హా ద‌క్షిణాది ప‌రిశ్ర‌మ‌లో ప‌లు చిత్రాలు తెర‌కెక్కాయి. అయితే వాటిలో గాంధీ జీవితానికి సంబంధించి కొన్ని అంశాల్నే తీసుకుని తెర‌కెక్క‌కించారు. పూర్తి స్థాయిలో మ‌హాత్ముడి జీవితంపై చిత్రాలు ఇప్ప‌టివ‌ర‌కూ తెర‌కెక్క‌లేదు. ఈ నేప‌థ్యంలో తాజాగా గాంధీపై హిందీలో ఓ వెబ్ సిరీస్ రూపొందుతున్న సంగ‌తి తెలిసిందే. ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు హ‌న్స‌ల్ మెహ‌తా ఈ వెబ్ సిరీస్ కి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. గాంధీ పాత్ర‌లో గుజ‌రాతీ న‌టుడు ప్ర‌తీక్ గాంధీ న‌టిస్తున్నాడు.

 

భార‌త స్వాతంత్య్ర‌ పోరాట కాలం నాటి ప‌రిస్థితుల్ని క‌ళ్ల‌కు క‌ట్ట‌డానికి హ‌న్స‌ల్ రెడీ అవుతున్నారు. గాంధీ జీవితంపై ప్ర‌చురింప‌బ‌డిన ప‌లు పుస్త‌కాల్ని..ఆ కాలం నాటి ఆధారాల్సి బేస్ చేసుకుని పూర్తి స్థాయిలో గాంధీ క‌థ‌ని తెర‌కెక్కిస్తున్నారు.

అయితే వీటిలో ప్ర‌ధానంగా ప్ర‌ముఖ ర‌చ‌యిత రామ‌చంద్ర గుహ రాసిన 'గాంధీ బిఫోర్ ఇండియా'..'గాంధీ ది ఇయర్స్ ద‌ట్ ఛేంజ్ ది వ‌ర‌ల్డ్' ర‌చ‌న‌ల్ని మెయిన్ గా తీసుకుంటున్న‌ట్లు స‌మాచారం. ఈ క‌థ కోసం హ‌న్స‌ల్ మోహ‌తా చాలా రీసెర్చ్ చేసారు. దేశ పౌరుడిగా ఓ బాధ్య‌త ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు.

వెబ్ సిరీస్ ప్రారంభానికి ముందే ప్ర‌త్యేకంగా ఓటీమ్ ని ఏర్పాటు చేసుకుని క‌థ‌పై చాలా గ్రౌండ్ వ‌ర్క్ చేసారు. గాంధీ గురించి ప్ర‌పంచానికి తెలియ‌ని ఎన్నో విష‌యాలు గ్ర‌హించారు. అయితే ఇందులో గాంధీ భార్య క‌స్తూర్బా గాంధీ పాత్ర కూడా కీల‌క‌మ‌ని ఈ రీసెర్చ్ లో తేలింది. తొలుత ఆ పాత్ర‌ని పెట్టాలా? లేదా? అన్న డైలామా తెర‌పైకి వ‌చ్చింది. కానీ త‌న టీమ్ క‌స్తూర్బా పాత్ర ఉండాల‌ని బలంగా కోర‌డంతో ఆ పాత్ర‌ని సిద్దం చేసారు. అయితే ఆ పాత్ర‌లో ఎవ‌రు న‌టిస్తారు? అన్న‌ది ఇంత కాలం స‌స్పెన్స్ గా మారింది. తాజాగా ఆ స‌స్పెన్స్ కి తెర ప‌డింది.

కస్తూర్బా పాత్ర కోసం మ‌రో న‌టిని తీసుకోవ‌డం కంటే ప్రతీగ్ గాంధీ భార్య అయితేనే నూరుశాతం న్యాయం చేస్తుంద‌ని ఆమెనే ఎంపిక చేసుకున్నారు. ఆమె పేరు భామిని ఓజా. ఆమె కూడా బాలీవుడ్ లో న‌టిగా కొన సాగుతున్నారు. ఆమె పాత్ర సినిమాలో ఎంతో కీల‌కంగా ఉంటుంద‌ని తెలుస్తోంది. గాంధీ గురించి ఇంత వ‌ర‌కూ ఎవ‌రూ చూపించ‌ని వాస్త‌వాలు చెప్పే ప్ర‌య‌త్నం చేస్తామ‌న్నారు. మ‌హ‌త్ముడికి గొప్ప నివాళిగా ఈ సిరీస్ ని తీర్దిదిద్దుతామ‌న్నారు.

Tags:    

Similar News