హీరోయిన్ గా రాజేష్ రోష‌న్ కుమార్తె!

ఆయ‌న ముద్దుల కుమార్తె ప‌ష్మీనా రోష‌న్ 'ఇష్క్ విష్క్' సీక్వెల్ గా తెర‌కెక్కిస్తున్న 'ఇష్క్ విష్క్ రీబౌండ్' తో లాంచ్ అవుతుంది.

Update: 2023-08-21 11:08 GMT

బాలీవుడ్ లో వార‌సురాళ్లు ఎంట్రీ జోరందుకున్న సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే జాన్వీక‌పూర్..సారా అలీఖాన్ లాంటి భామ‌లు రాణిస్తున్నారు. ఈనేప‌థ్యంలో సుహానాఖాన్.. శ్రీదేవి చిన్న కుమార్తె ఖుషీ 'ది ఆర్చిస్' తెరంగేట్రం చేస్తున్నారు. అలాగే ర‌వీనా టాండ‌న్ డాట‌ర్ రాషా కూడా ఓ యాక్ష‌న్ అడ్వెంచ‌ర్ చిత్రంతో లాంచ్ అవుతుంది. ఇందులో అజ‌య్ దేవ‌గ‌ణ్ సోద‌రుడు కుమారుడు అమ‌న్ దేవ‌గ‌ణ్ హీరోగా న‌టిస్తు న్నాడు.

మ‌రోవైపు స‌ల్మాన్ ఖాన్ మేన‌కోడ‌లు అలీజే అగ్నిహోత్రి సుమేంద్ర ఫ‌ది సినిమాతో లాంచ్ అవుతుంది. ఇలా ఇంత మంది వార‌సులు బాలీవుడ్ తెరంగేట్రంతో క‌ళ‌క‌ళాలుడుతోంది. ఈ నేప‌థ్యంలో తాజాగా బాలీవుడ్ ప్ర‌ఖ్యాత సంగీత ద‌ర్శ‌కుడు రాజేష్ రోష‌న్ కుమార్తె కూడా మ్యాక‌ప్ వేసుకుంటుంది. ఆయ‌న ముద్దుల కుమార్తె ప‌ష్మీనా రోష‌న్ 'ఇష్క్ విష్క్' సీక్వెల్ గా తెర‌కెక్కిస్తున్న 'ఇష్క్ విష్క్ రీబౌండ్' తో లాంచ్ అవుతుంది.

ఇందులో రోహిత్ స‌రాఫ్ కి జంట‌గా న‌టిస్తోంది. ఈ రొమాంటిక్ కామెడీ ఎంట‌ర్ టైన‌ర్ ని నిపుణ్ ధ‌ర్మ‌కారి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. త్వ‌ర‌లోనే సినిమా మొద‌లు కానుంది. రోష‌న్ కుటుంబం నుంచి హీరోయిన్ ప‌రిచ‌య‌వ్వ‌డంతో అభిమానులు సంతోషం వ్య‌క్తం చేస్తున్నారు. రాకేష్ రోష‌న్ వారుసుడిగా బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన హృతిక్ రోష‌న్ ఎంత పెద్ద స్టార్ అన్న‌ది చెప్పాల్సిన ప‌నిలేదు. తండ్రి అగ్ర ద‌ర్శ‌క-నిర్మాత అయినా హృతిక్ రోష‌న్ ఎదిగిన వైనం ఎంతో మందికి స్పూర్తి.

న‌టుడిగా త‌న‌కంటూ ప్ర‌త్యేక‌మైన ఇమేజ్ ని సొంతం చేసుకున్నాడు. తండ్రి ఇమేజ్ ప‌కుండా స్టార్ గా ఎదిగిన న‌టుడాయ‌న‌. ఇప్పుడ‌దే కుటుంబం నుంచి వార‌సురాలు ఎంట్రీ ఇవ్వ‌డం విశేషం. రాజేష్ రోష‌న్ బాలీవుడ్ లో పెద్ద మ్యూజిక్ డైరెక్ట‌ర్ . హృతిక్ సినిమాల‌కు ఎక్కువ‌గా ఆయ‌నే సంగీతం అందిస్తుంటారు. హృతిక్ తో ప‌ష్మీనా సెల్పీలు ఇన్ స్టాలో పోస్ట్ చేసిన సంద‌ర్భాలు కోకొల్ల‌లు.

Tags:    

Similar News