ఆ పాత్ర పేరులో కూడా సుకుమార్ మార్క్..!

ఒక చిన్న పాత్ర పేరు సినిమాలో అలా ఎందుకు పెట్టారో తెలిస్తే దర్శకుడి మేధస్సుకి హ్యాట్సాఫ్ అనేస్తారు.

Update: 2024-12-19 08:30 GMT

ఒక సినిమా ప్రేక్షకులను మెప్పించడంలో కేవలం కొన్ని అంశాలు బాగుంటే చాలని కొందరు అనుకుంటారు. ఐతే అలా ప్రేక్షకులను మెప్పించే సినిమాను బాగా అబ్జర్వ్ చేస్తే ఆ సినిమాలో ప్రతి సన్నివెశం, ప్రతి సందర్భం, ప్రతి పాత్ర కదలిక, ప్రతి పాత్ర పేరు ఇలా అన్ని సినిమాకు అనుగుణంగా సందర్భానికి తగినట్టుగా ఉంటాయి. సినిమా స్టోరీ డిస్కషన్ టైం లోనే దీనిపై దర్శకులు చాలా సీరియస్ గా వర్క్ చేస్తారు. ముఖ్యంగా పాత్రలు వాటి పేర్లు విషయంలో చాలా జాగ్రత్త పడతారు. ఒక చిన్న పాత్ర పేరు సినిమాలో అలా ఎందుకు పెట్టారో తెలిస్తే దర్శకుడి మేధస్సుకి హ్యాట్సాఫ్ అనేస్తారు.

అలాంటి సందర్భాలు చాలానే ఉన్నా ప్రస్తుతం సూపర్ హిట్ సినిమా పుష్ప 2 సినిమాలో మరోసారి సుకుమార్ క్రియేటివిటీ ఏంటన్నది వెల్లడైంది. పుష్ప 1 సూపర్ హిట్ కాగా పుష్ప 2 పై అంచనాలు భారీగా ఉన్నాయి. ఐతే సుకుమార్ రెండో పార్ట్ ని అంచనాలకు మించి ఉండేలా చేయడంతో ఆడియన్స్ ఫిదా అయ్యారు. ఐతే ఈ సినిమాలో సుకుమార్ ప్రతి పాత్రని చాలా క్లవర్ గా ఎంతో జాగ్రత్తగా రాసుకున్నాడు.

పుష్ప 2 లో పుష్ప రాజ్ ఫ్యామిలీని తన అన్నయ్య ఫ్యామిలీతో కలిపే అన్న కూతురు కావేరి పాత్ర ఒకటి ఉందని తెలిసిందే. కావేరిని కాపాడే క్రమంలోనే పుష్ప రాజ్ పూనకాల ఎపిసోడ్ ఫ్యాన్స్ ని అలరిస్తుంది. ఐతే సినిమాలో ఆ పాత్ర చేసిన పావని కరణం తన పేరు వెనక ఉన్న బ్యాక్ స్టోరీని రీసెంట్ ఇంటర్వ్యూలో చెప్పారు. సినిమా సెట్ లో తన ఒరిజినల్ పేరుతోనే అందరు పిలిచారు. ఐతే సుకుమార్ వచ్చి నీ పేరేంటమ్మా అంటే పావని అన్నాను. పాత్ర పేరు అంటే పావనినే అన్నారు. ఐతే అప్పుడు నీ పేరు పావని కాదు కావేరి అన్నారు.

కావేరి నది ఎలాగైతే తమిళనాడు, కర్ణాటకని కలుపుతుందో మీ ఫ్యామిలీ, పుష్ప రాజ్ ఫ్యామిలీని కలుపుతావ్ అంటూ సుకుమార్ చెప్పారట. ఒక చిన్న పాత్ర పేరుకి ఇంత అర్ధం ఉండేలా చూస్తున్నారు కాబట్టే ఆయన అంత గొప్ప దర్శకుడు అయ్యాడంటూ పావని కరణం చెప్పుకొచ్చింది. నిజంగానే అది నిజం.. సినిమాలో ప్రతి చిన్న పాత్రకి తన మార్క్ స్పెషాలిటీ ఉండేలా చేయడమే కాకుండా ప్రతి పాత్రకు ఒక డెఫినేషన్ ఉండేలా చేస్తాడు కాబట్టే సుకుమార్ ఆ రేంజ్ లో ఉన్నాడని అనుకుంటున్నారు.

Tags:    

Similar News