నిద్ర పట్టక..జైలు గదిలో పచార్లు!
రేణుకాస్వామి హత్య కేసులో ఏ1గా పవిత్ర గౌడ్ అభియోగం ఎదుర్కోంటున్న సంగతి తెలిసిందే.
రేణుకాస్వామి హత్య కేసులో ఏ1గా పవిత్ర గౌడ్ అభియోగం ఎదుర్కోంటున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే కేసులో 15 మందికి పైగా అరెస్ట్ అవ్వగా, పవిత్ర గౌడ్ ప్రధాన నిందుతారిలిగా ఉంది. గురువారమే పవిత్రని పరప్పన అగ్రహారం కారాగారానికి తరలించారు. ఆమెకి ఖైదీ నెంబర్ -6024ని అధికారులు కేటాయించారు. మరి జైలులో ఆమె జీవితం ఎలా ఉంది? నాలుగు గోడల చిన్న గదిలో ఎలాంటి అనుభవానికి లోనవుతుంది? అంటే ఆమె తీవ్ర మనో, మానసిక వేదనకి గురవుతున్నట్లు కనిపిస్తుంది. రాత్రి పూట నిద్రపోవడం లేదు.
పడుకున్నా కళ్లు మూతలు పడకపోవడంతో లేచి ఆ చిన్న గదిలోనే పచార్లు చేసారు. శుక్రవారం తెల్లవారు జామున ఐదు గంటలకే లేచి పరిసరాల్లో వాకింగ్ చేసారు. ఆపై టిఫిన్ చేసి, కాఫీ తీసుకున్నారు. పవిత్రతో పాటు మరో తొమ్మిది మందిని ఏసీఎంఎం న్యాయస్థానం 14 రోజుల పాటు జ్యూడీషియల్ కస్టడీకి అప్పగిం చింది. విలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్న పవిత్ర కారాగారంలో ఒంటరిగా మారింది.
ఇంకా ఈ కేసులో ఎన్నో కొత్త విషయాలు కూడా వెలుగులోకి వస్తోన్న సంగతి తెలిసిందే. కన్నడ నటుడు దర్శన్ కేసులో ఏ 2 గా ఉన్నాడు. ఆయన భార్య విజయలక్ష్మి కి కూడా ఈ హత్య గురించి తెలియడంతో ఆమెకి కూడా పోలీసులు నోటీసులు ఇచ్చి విచారిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ కేసు గాక అటవీశాఖ కూడా భార్యా భర్తలిద్దరిపై మరో కేసు కూడా ఫైల్ చేసింది.
రేణుకాస్వామి హత్య కేసులో ఇప్పటివరకూ 17 మందిని అరెస్ట్ చేసారు. 28 ప్రదేశాల్లో మహజరు చేసిన అధికారులు 139కి పైగా సాక్ష్యాలను సేకరించారు. ఈ సంఘటనతో నేరుగా సంబంధం లేకపోయినా నిందుతలకు కొందరు సహాయపడేందుకు ప్రయత్నించారు. సాక్ష్యాధారాలను నాశనం చేసేందుకు రసహ్యసంగా సహకరించారని అధికారులు అలా ఎవరెవర్ని సహకరించింది తెలుసుకునేందుకు నటుడు దర్శన్ తో పాటు మరో ముగ్గుర్ని తీవ్రంగా విచారిస్తున్నారు.