విజయవాడలో వీరమల్లు బ్లూమ్యాట్ సెట్!
ఏపీలో అకాల వరదతో ఒక్కసారిగా పవన్ కళ్యాణ్ సినిమా షెడ్యూల్ వాయిదా పడింది.
ఏపీలో అకాల వరదతో ఒక్కసారిగా పవన్ కళ్యాణ్ సినిమా షెడ్యూల్ వాయిదా పడింది. లేదంటే? ఇప్పటికే పీకే డీసీఎమ్ అనే పదవిని పక్కన బెట్టి నటుడు అనే కోణంలో బిజీ అయ్యేవారు. పరిస్థితి ఇప్పుడు అదుపులోకి రావడంతో పీకే మళ్లీ సమాయత్తం అవుతున్నట్లు తెలుస్తోంది. అయితే ముందుగా హరి హర వీరమల్లు షూటింగ్ కే హాజరయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే కొద్ది భాగం షూటింగ్ పూర్తిచేసుకున్న వీరమల్లు బ్యాలెన్స్ షూట్ కూడా ముగించే పనిలో నిమగ్నమైంది.
దీనిలో భాగాంగా విజయవాడ పరసరాల్లో ప్రత్యేకంగా బ్లూమ్యాట్ సెట్ ని సిద్దం చేస్తున్నారుట. ఇప్పటికే సెట్ నిర్మాణం ముగింపు దశకు వచ్చిందట. ఈనెల మూడవ వారం నుంచే ఇతర తారగాణంపై షూటింగ్ నిర్వహిం చాలని ప్లాన్ చేస్తున్నారుట. ఈ షూట్ మొదలైన కొద్ది రోజుల్లోనే పవన్ కళ్యాణ్ కూడా సెట్స్ కి వెళ్లడం మొదలు పెడతారని సమాచారం. ఈ నేపథ్యంలో పవన్ పాత్రకు సంబంధించి ఇంట్రెస్టింగ్ అప్ టేట్ లీకైంది.
ఆయన పాత్రకు సంబంధించిన షూట్ కేవలం 20 రోజులు మాత్రమే పెండింగ్ ఉందిట. 20 రోజుల పాటు నిర్వారామంగా పీకే హాజరైతే వీరమల్లు నుంచి ఆయన రిలీవ్ అయిపోవచ్చని దర్శకుడు జ్యోతి కృష్ణ భరోసా ఇచ్చారుట. దీంతో పవన్ కూడా సానుకూలంగా స్పందించి అంతకు తగ్గ ఏర్పాట్లు చేసుకుని రెడీగా ఉండమని సూచించారుట. దీంతో వీరమల్లుపై ఓ క్లారిటీ దొరికినట్లు అయింది.
పవన్ ఈ సినిమాకు కనీనం రెండు నెలలైనా సమయం కేటాయించాల్సి ఉటుందని తొలుత ప్రచారంలోకి వచ్చింది. కానీ తాజా అప్ డేట్ ప్రకారం అంత అవసరం లేదని..షూటింగ్ కూడా ముగింపు దశకు చేరుకున్నట్లు తెలుస్తోంది. షూటింగ్ పూర్తయిన వరకూ వేగంగా పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా ఎప్పటికప్పుడు పూర్తిచేస్తున్నారు. ప్రత్యేకంగా సీజీకి సమయం కేటాయించకుండా దొరికిన సమయాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు. ఆ లెక్కన చూసుకుంటే సినిమా వచ్చే ఏడాది ప్రధమార్దం లోపు రిలీజ్ ఖాయమనే అంచనాలు పెరుగుతున్నాయి.