2002 లోనే 10 కోట్ల ఆఫర్..

ఇదే సమయంలో గుడుంబా శంకర్ దర్శకుడు వీరశంకర్ ఇంటర్వ్యూ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Update: 2023-09-02 08:30 GMT

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇండియాలోనే హైయెస్ట్ రెమ్యునరేషన్ తీసుకునే టాప్ 10 స్టార్ హీరోలలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కచ్చితంగా ఉంటాడు. యూత్ లో ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ పవన్ కళ్యాణ్ కి ఈ స్థాయి బ్రాండ్ రావడానికి కారణం అని చెప్పొచ్చు. అయితే సినిమాలో గొప్ప నటుడిగా పవన్ కళ్యాణ్ సంపాదించుకున్న క్రేజ్ కంటే వ్యక్తిగతంగా అతని వ్యక్తిత్వంతోనే అభిమాన గణం సొంతం చేసుకున్నారు.

రాజకీయాలలోకి వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ ని అభిమానించే వారి సంఖ్య ఇంకా పెరిగిందని చెప్పొచ్చు. ప్రస్తుతం రోజుకి రెండు కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటున్న ఏకైక నటుడు కూడా పవన్ కళ్యాణ్ అని చెప్పాలి. మెగాస్టార్ బ్రదర్ గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన పవన్ కళ్యాణ్ వరుస సక్సెస్ లతో స్టార్ గా మారిపోయాడు. పవన్ కళ్యాణ్ బర్త్ డే సందర్భంగా 2004లో ఆయన చేసిన గుడుంబా శంకర్ రీరిలీజ్ అయ్యింది.

ఇదే సమయంలో గుడుంబా శంకర్ దర్శకుడు వీరశంకర్ ఇంటర్వ్యూ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అందులో వీర శంకర్ పవన్ కళ్యాణ్ ని ఉద్దేశించి చేసిన కామెంట్స్ ఇప్పుడు ఫ్యాన్స్ కి ఇంటరెస్ట్ క్రియేట్ చేశాయి. 2002లో పవన్ కళ్యాణ్ కి 10 కోట్లు రెమ్యునరేషన్ ఇస్తామని ప్రొడ్యూసర్స్ ఆఫర్ చేసేవారని అన్నారు. అప్పటికి సూపర్ స్టార్ రజినీకాంత్ కి కూడా ఆ స్థాయిలో రెమ్యునరేషన్ లేదని తెలిపారు.

అయితే పవన్ కళ్యాణ్ మాత్రం రెమ్యునరేషన్ గురించి ఎప్పుడూ ఆలోచించేవారు కాదని, ఇష్టానుసారంగా సినిమాలు కమిటయ్యేవాడు కాదు. నిత్యం ఆధ్యాత్మిక చింతనలో ఉండేవారు. అలాగే సెలక్టివ్ గానే మూవీస్ చేస్తూ ఉండేవాడు. మొదటి నుంచి అతని వ్యక్తిత్వం చాలా భిన్నంగా ఉండేది. అనవసరమైన విషయాల గురించి ఆలోచించకుండా పుస్తకాలు చదువుకుంటూ, ధ్యానం చేసుకుంటూ గడిపేవారు.

అందుకే పవన్ కళ్యాణ్ ఇప్పటికి కూడా ఓ రకమైన పవర్ కనిపిస్తూ ఉంటుందని వీరశంకర్ ఇంటర్వ్యూలో చెప్పడం విశేషం. ఈ వీడియో ప్రస్తుతం ట్విట్టర్ (ఎక్స్)లో వైరల్ అవుతోంది. పవన్ కళ్యాణ్ పుట్టినరోజు కావడంతో పవన్ అభిమానులు ఈ వీడియోని ట్రెండ్ చేస్తున్నారు.

Tags:    

Similar News