షారూఖ్ కంటే ఎక్కువ డబ్బు ఆఫర్ చేసారు!
కోలా బ్రాండ్‌ను ప్రమోట్ చేయడానికి బాలీవుడ్ స్టార్ షారుఖ్ ఖాన్ కంటే ఎక్కువ డబ్బును నాకు ఆఫర్ చేసినప్పటికీ నేను తిరస్కరించానని జనసేనాని అన్నారు.
డబ్బు కోసం ఏదైనా చేయడం వేరు. విలువలకు కట్టుబడి డబ్బును త్యజించడం వేరు! అలాంటి విలువలు తనకు ఉన్నాయని పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అన్నారు. బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్‌తో పోలిస్తే తనకు పెద్ద మొత్తంలో డబ్బు ఆఫర్ చేసినట్లు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. పవన్ కళ్యాణ్ టాలీవుడ్ టాప్ స్టార్.. రాజకీయ నాయకుడు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న పవన్ కళ్యాణ్ తేదేపా- భాజపా అలయెన్స్ తో పని చేస్తున్న సంగతి తెలిసిందే. వైఎస్ జగన్ నేతృత్వంలోని ప్రభుత్వాన్ని పడగొట్టి కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో టీడీపీ, జనసేన, బీజేపీల మధ్య పొత్తు విజయం సాధిస్తుందని తాజా ఈవెంట్లో విశ్వాసం వ్యక్తం చేశారు.
మీడియాతో సమావేశంలో వాణిజ్య ప్రకటనల ద్వారా వచ్చే ఆదాయాన్ని తాను త్యజించిన విషయాన్ని గుర్తు చేసారు. డబ్బు సంపాదనే కావాలని అనుకోలేదని ఆయన అన్నారు. 20 సంవత్సరాల క్రితం కోలా బ్రాండ్‌కు మద్దతు ఇచ్చానని .. అయితే కూల్ డ్రింకుల వల్ల ఆరోగ్యంపై కలిగే ప్రతికూల ప్రభావం గురించి తెలుసుకున్న తర్వాత అలా చేయడం మానేశానని అన్నారు.
కోలా బ్రాండ్‌ను ప్రమోట్ చేయడానికి బాలీవుడ్ స్టార్ షారుఖ్ ఖాన్ కంటే ఎక్కువ డబ్బును నాకు ఆఫర్ చేసినప్పటికీ నేను తిరస్కరించానని జనసేనాని అన్నారు. నేను నా వ్యవస్థ కోసం తప్పు చేయను. ఒకవేళ డబ్బుకు మాత్రమే ప్రాధాన్యత ఇవ్వాలనుకుంటే, నేను అనేక కమర్షియల్ బ్రాండ్‌లకు బహిరంగంగా మద్దతు ఇచ్చేవాడిని అని అన్నారు. దానివల్ల ఎక్కువ ఆర్థిక వనరులను కూడగట్టుకోగలను కదా! అని అన్నారు.
ప్రస్తుతం పొత్తులో భాగంగా ఆంధ్రప్రదేశ్‌లోని 21 అసెంబ్లీ స్థానాలు, 2 లోక్‌సభ స్థానాల్లో జనసేన పోటీ చేస్తోంది. మరోవైపు పవన్ కళ్యాణ్ మూడు సినిమాల్లో నటిస్తున్నారు. హరి హర వీర మల్లు పార్ట్ 1, OG, ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రీకరణ దశలో ఉన్నాయి. ఎన్నికలు ముగిసిన తర్వాత ఈ సినిమాలను పూర్తి చేసి విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం పవన్ పూర్తి స్థాయిలో ఎన్నికల ప్రచారంలో నిమగ్నమై ఉన్నారు.