పవన్‌ కి తండ్రిగా 'సోగ్గాడు' శోభన్ బాబు..!

పవన్‌ కళ్యాణ్ హీరోగా నటించిన సుస్వాగతం పాతికేళ్ల క్రితం ప్రేక్షకుల ముందుకు వచ్చింది

Update: 2024-03-06 23:30 GMT

పవన్‌ కళ్యాణ్ హీరోగా నటించిన సుస్వాగతం పాతికేళ్ల క్రితం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ సినిమా పవన్ కళ్యాణ్ కెరీర్‌ లోని సూపర్‌ హిట్ చిత్రాల్లో ఒకటి అనడంలో సందేహం లేదు. ఆ సినిమాలో పవన్‌ లుక్ మరియు ఆయన నటనకు అప్పట్లో ఎంతో మంది ఫ్యాన్స్ అయ్యారు. పవన్‌ యాక్టింగ్‌ పరంగా కుమ్మేశాడు అనే టాక్‌ వచ్చింది.

ఆ సినిమా లో పవన్‌ తండ్రి పాత్రను రఘువరన్ పోషించిన విషయం తెల్సిందే. తండ్రి కొడుకుల సెంటిమెంట్‌ సీన్స్ మరియు రఘువరన్ సన్నివేశాలు సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి. సినిమాలో తండ్రి పాత్ర అత్యంత కీలకం కావడంతో మొదట ఆ పాత్రకు గాను శోభన్‌ బాబు ను నటింపజేయాలని భావించారట.

సోగ్గాడు శోభన్ బాబు ను సుస్వాగతం సినిమాలో పవన్‌ కళ్యాణ్ కి తండ్రి పాత్రలో నటించేందుకు సంప్రదించిన సమయంలో ఆయన నిర్మొహమాటంగా నో చెప్పారట. కథ రాసుకున్న సమయంలోనే ఆ పాత్రకు శోభన్ బాబు అయితే బాగుంటాడని రచయిత భావించారని, అయినా కూడా ఆయన నో చెప్పారట.

శోభన్ బాబు సినిమాలు చేసినంత కాలం హీరోగానే చేశారు. ఆయన ముసలి వయసుకు వచ్చిన తర్వాత సినిమాలను చేయకుండా ఉన్నాడు. అంతే కాని తండ్రి పాత్రలో, తాత పాత్రలో నటించలేదు. ఆ సిద్ధాంతంతోనే పవన్‌ కళ్యాణ్ సినిమాలో శోభన్‌ బాబు నటించేందుకు నిరాకరించినట్లు చెబుతూ ఉంటారు.

ఒక వేళ సుస్వాగతం సినిమాలో పవన్‌ కి తండ్రి పాత్రలో రఘువరన్ కాకుండా శోభన్ బాబు నటించి ఉంటే కచ్చితంగా మరింత భారీ విజయాన్ని సొంతం చేసుకునేది అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

సోగ్గాడు సెకండ్‌ ఇన్నింగ్స్ మొదలు పెట్టి సినిమాలు చేస్తే బాగుండేదని ఇప్పటికి కొందరు అంటూ ఉంటారు. 2008లో శోభన్‌ బాబు మృతి చెందారు. ఆయన చివరగా 1996 లో హలో గురూ లో నటించాడు. ఆ తర్వాత వెండి తెరపై కనిపించలేదు.

Tags:    

Similar News