ఇండియావైడ్ పవన్ కళ్యాణ్ నెంబర్ ఎంతంటే?
పవర్ స్టార్ పవన్ కళ్యాన్ కథానాయకుడిగా హరీష్ శంకర్ దర్శకత్వంలో `ఉస్తాబ్ భగత్ సింగ్` ప్రకటించిన సంగతి తెలిసిందే
పవర్ స్టార్ పవన్ కళ్యాన్ కథానాయకుడిగా హరీష్ శంకర్ దర్శకత్వంలో `ఉస్తాబ్ భగత్ సింగ్` ప్రకటించిన సంగతి తెలిసిందే. తొలుత ఈ సినిమా టైటిల్ `భవదీయుడు భగంత్ సింగ్` గా నిర్ణయించిన సంగతి తెలిసిందే. కానీ అభ్యంతరాలు వ్యక్తమవ్వడంతో `ఉస్తాద్ భగత్ సింగ్` గా మార్చారు. ఈ సినిమా ప్రకటనొచ్చి చాలా కాలమవుతోంది. కానీ ఇంతవరకూ షూటింగ్ జరగలేదు. పీకే రాజకీయాల్లో బిజీగా ఉండటంతో సాధ్యపడలేదు.
ఇది ఎప్పుడు పూర్తవుతుంది? ఎప్పుడు రిలీజ్ అవుతుంది? అన్నది ఇప్పట్లో చెప్పడం కష్టమైనది. అయితే భగత్ సింగ్ టైటిల్ తో ఇండియాలో వస్తోన్న ఆరవ సినిమా ఇదేనని తెలుస్తోంది. గతంలో ఇదే టైటిల్ తో ఆరు సినిమాలు రిలీజ్ అయినట్లు తెలుస్తోంది. అందులో ఒకటి 2002 లో రిలీజ్ అయింది. అదే `దిలెజెంబ్ ఆఫ్ భగత్ సింగ్`. ఈ సినిమా అప్పట్లో ఏకంగా జాతీయ అవార్డుల్నే దక్కించుకుంది.
ఉత్తమ చిత్రం, ఉత్తమ నటుడు విభాగంలో రెండు అవార్డులు అందుకుంది. అయితే ఈసినిమా తీసిన నిర్మాత మాత్రం బాగా నష్టపోయాడు. అప్పట్లోనే ఈసినిమాకి 27 కోట్లు ఖర్చుచేసారు. కానీ బాక్సాఫీస్ వద్ద కేవలం 5 కోట్లు మాత్రమే తెచ్చింది. దీంతో 22 కోట్లు నష్టంగా మిగిలింది. అయితే అలా నష్టపోవడానికి ఓ ప్రత్యేక కారణాన్ని కూడా నిర్మాత రమేష్ తరణి తెలిపారు.
`అప్పట్లో మాసినిమా సరిగ్గా ఆడలేదు. ఎందుకంటే అప్పుడు భగత సింగ్ మీద మాది కాక మరో నాలుగు సినిమాలొచ్చాయి. అందులో ఒకటి మా సినిమా కంటే ముందు రిలీజ్ అయింది. అది పోయింది. ఆ తర్వాత మాది విడుదలైంది. మాదీ కూడా అదే వరుసలో నిలిచింది. అదే సమయంలో మార్చి 1931 షాహిదీ సినిమా రిలీజ్ అయింది. అది ప్రధాన కారణమైంది. మరో సినిమా అగిపోయింది. రామానాంద్ సాగర్ తీసిన భగత్ సింగ్ మాత్రం నేరుగా దూరదర్శన్ లో రిలీజ్ అయింది. కానీ పెద్దగా ఆడలేదు` అని తెలిపారు. దీంతో హరీష్ -పవన్ భగత్ సింగ్ పై ఆసక్తి నెలకొంది.