మనవరాలిని పవన్ ఇలా ముద్దాడుతున్నాడే!
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రమాణస్వీకారోత్సవాన్ని మెగా కోడలు ఉపాసన కొణిదెల మిస్ అయిన సంగతి తెలిసిందే
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రమాణస్వీకారోత్సవాన్ని మెగా కోడలు ఉపాసన కొణిదెల మిస్ అయిన సంగతి తెలిసిందే. నిన్నటి రోజున కార్యక్రమానికి చిరంజీవి, రామ్ చరణ్, సురేఖ హాజరయ్యారు గానీ ఉపాసన మాత్రం హాజరు కాలేదు. దీంతో ఆ కార్యక్రమాన్ని ఉపాసన అందరిలో టీవీలోనే చూసి ఉండొచ్చు. లేదంటే ఆమె బిజీ షెడ్యూల్ కారణంగా అందుబాటులోనూ ఉండకపోవచ్చు.
ఆ సంగతి పక్కనబెడితే తాజాగా ఇన్ స్టాలో ఉపాసన చరణ్, పవన్ తో ఉన్న ఓ ఫోటోని షేర్ చేసారు. అందులో పవన్ కళ్యాణ్ అమ్మ ఉపాసన ఒడిలో ఉన్న చిన్నారి క్లీంకార చూస్తూ వేళ్లతో టచ్ చేస్తున్నారు. అది చూసి ఉపాసన ఎంతో మురిసిపోతున్నారు. నవ్వుతూ చిన్న మామగారికి పాపాయిని చూపిస్తున్నారు. పక్కనే రామ్ చరణ్ కూడా నుంచి ఉన్నాడు. ఈ ఫోటోని నెట్టింట షేర్ చేస్తో ఇంట్రెస్టింగ్ పోస్ట్ కి పెట్టారు ఉపాసన.
నిన్న జరిగిన ప్రమాణస్వీకారోత్సవాన్ని ఉద్దేశిస్తూ ఉపాసన ఇలా రాసుకొచ్చారు. `నా దేశస్థుల గురించి నేను చాలా గర్వపడుతున్నాను. తమ కుటుంబాలు ఆర్థిక స్థిరత్వాన్ని సాధించడం అన్నింటికంటే ప్రాధాన్యత అని వారు నిరూపించారు. మన ఎన్నికైన ప్రభుత్వం భారత ప్రజలకు న్యాయం చేస్తుందని విశ్వసి స్తున్నాను. మాలో అమ్మానాన్నలకు మాలో గణనీయమైన మార్పును అందించినందుకు అభినందనలు` అని పోస్ట్ చేసారు.
ప్రస్తుతం ఈ పోస్ట్ , ఫోటో నెట్టింట వైరల్ గా మారింది. పవన్ ని అబ్బాయ్ తో కోడలితో చూసి అభిమానులు మురిసిపోతున్నారు. పవన్, రామ్ చరణ్ ఎప్పటికప్పుడు కలుస్తుంటారు. కానీ ఉపాసన పెద్దగా పవన్ తో కనిపించరు. ఇది రేర్ మూవ్ మెంట్ అనే చెప్పాలి.