ప్రియుడికి పుట్టిన రోజు శుభాకాంక్షలు

తాజాగా మరోసారి సోషల్ మీడియా ద్వారా షేర్ చేసిన ఫోటో వైరల్‌ అవుతోంది.

Update: 2025-02-11 00:30 GMT

'ఆర్‌ఎక్స్‌ 100' సినిమాతో పాన్ టాలీవుడ్‌లో మంచి గుర్తింపు దక్కించుకున్న ముద్దుగుమ్మ పాయల్‌ రాజ్‌పూత్‌. తక్కువ సమయంలోనే టాలీవుడ్‌లో ఎక్కువ సినిమాలు చేసింది. నెగటివ్‌ షేడ్స్ ఉన్న పాత్రలో నటించడం ద్వారా నటిగా తన సత్తా చాటింది. ఆకట్టుకునే అందంతో పాటు నటనలో మంచి ప్రతిభ ఉన్న ముద్దుగుమ్మ పాయల్‌ రాజ్‌పూత్‌ ఐటెం సాంగ్స్‌తోనూ మెప్పించింది. తెలుగులోనే కాకుండా ఇతర భాషల్లోనూ సినిమాలు చేసేందుకు ఎప్పుడూ సిద్ధంగా ఉండే పాయల్‌ రాజ్‌ పూత్‌ సోషల్‌ మీడియా ద్వారా రెగ్యులర్‌గా తన అందమైన ఫోటోలను షేర్‌ చేస్తూ ఉంటుంది. తాజాగా మరోసారి సోషల్ మీడియా ద్వారా షేర్ చేసిన ఫోటో వైరల్‌ అవుతోంది.


ఈసారి పాయల్ తన అందాల ఆరబోత ఫోటోలు కాకుండా ప్రియుడితో ఉన్న ఫోటోను షేర్‌ చేసింది. పాయల్‌ గత కొంత కాలంగా సౌరభ్‌ ధింగ్రాతో రిలేషన్‌లో ఉంది. ఇంతకు ముందే పాయల్‌ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది. కానీ ఫోటోలు షేరింగ్‌ విషయంలో ఆచితూచి వ్యవహరించింది. కానీ ఈసారి మాత్రం పాయల్‌ రాజ్‌ పూత్ ఏకంగా సౌరభ్‌తో తీసుకున్న క్లోజ్‌ ఫోటోను షేర్‌ చేసింది. అంతే కాకుండా కాస్త డెప్త్‌తో కూడిన మెసేజ్‌ను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయడం ద్వారా ఇద్దరి మధ్య ఏ స్థాయి ప్రేమ సాగుతోందో అర్థం అవుతోంది.


ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ ఫోటోను షేర్ చేసిన పాయల్‌ రాజ్‌పూత్‌.. నువ్వు నా ప్రపంచం. నీకు పుట్టిన రోజు శుభాకాంక్షలు. నీ దయ, మద్దతు లభించడం గొప్ప అదృష్టం. నాకు నువ్వు లభించడం ఆశీర్వాదం. నీతో పాటు ఉండి, నీ మార్గదర్శకత్వంలో, ప్రేమను పొందడంకు నేను కృతజ్ఞురాలిని. ఈ రోజు చాలా ప్రత్యేకమైన రోజు. నీకు ఆనందం, ఆరోగ్యం, విజయం దక్కాలని కోరుకుంటున్నాను. హ్యాపీ బర్త్‌డే సౌరభ్‌ అంటూ పోస్ట్‌ చేసింది. సౌరభ్ పై తనకు ఉన్న ప్రేమ, అభిమానంను చక్కగా పాయల్‌ వివరించిందంటూ సోషల్ మీడియా ద్వారా కామెంట్స్ వస్తున్నాయి.


పాయల్‌ అభిమానులతో పాటు, నెటిజన్స్ సౌరభ్‌ ధింగ్రాకు శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రస్తుతం సినిమాలతో బిజీగా ఉన్న కారణంగా పాయల్‌ రాజ్‌పూత్‌ పెళ్లిని వాయిదా వేస్తూ వస్తుంది. ఈ ఏడాదిలో వీరి వివాహం జరిగే అవకాశాలు ఉన్నాయంటూ ఇండస్ట్రీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. త్వరలోనే ఆ విషయాన్ని వీరిద్దరూ అధికారికంగా ప్రకటిస్తారేమో చూడాలి. పెళ్లి తర్వాత కూడా సినిమాల్లో నటిస్తున్న వారు ఉన్నారు. కనుక పాయల్‌ పెళ్లికి రెడీ అవ్వచ్చు అంటున్నారు. పెళ్లి తర్వాత కూడా సినిమాల్లో ఈమె బిజీ అయ్యే అవకాశాలు ఉన్నాయి.

Tags:    

Similar News