31 లోనూ 21 ఏళ్ల బ్యూటీలాగే పాయల్ మెరుపులు!
ఆ విషయం పక్కనబెడితే తాజాగా పాయల్ తొలిసారి కెరీర్ లో మొదటి కెమెరా ముందుకొచ్చి ఫోజులిచ్చిన ఫోటో షూట్ ని అభిమానులతో పంచుకుంది. ఆ పాత సంగతులు గుర్తు చేసుకుని మురిసిపోయింది.
'ఆర్ ఎక్స్ 100' విజయంతో మెరుపులా దూసుకొచ్చిన పాయల్ రాజ్ పుత్ గురించి చెప్పాల్సిన పనిలేదు. అమ్మడు తొలి సినిమాతోనే కుర్రాళ్ల మనసులు దొచింది. కానీ అటుపై నటించిన సినిమాలేవి పాయల్ ని స్టార్ గా నిలబెట్టలేకపోయాయి. చేసిన ప్రయత్నాల్ని విఫలమయ్యాయి. చివరికి పక్క భాషల్లో సైతం అదృష్టాన్ని పరీక్షించుకుంది. అక్కడా అదే పరిస్థితి. ఒకటి రెండు సినిమాలతోనే నిష్క్రమించాల్సిన పరిస్థితి.
దీంతో లాభం లేదనుకున్న అమ్మడు మళ్లీ హైదబాద్ కి కంబ్యాక్ అయింది. ఇక్కడ నుంచే పనులన్నీ మొదలు పెట్టింది. ఈ క్రమంలోనే అవకాశాలు ఉంటే తనకివ్వమని అడిగింది. 'మంగళవారం' చిత్రంలో కూడా అజయ్ భూపతి అలాగే అవకాశం కల్పించాడు. అతడే హీరోయిన్ గా పరిచయం చేయడంతో అదే చనువుతో అడగం..ఆయన కాదనలేకపోవడం..ఆ సినిమా మంచి విజయం సాధించడం అన్నీ జరిగిపో యాయి.
కానీ పాయల్ మాత్రం బిజీ అవ్వలేదు. చాలా గ్యాప్ తర్వాత 'మంగళవారం'తో విజయం దక్కినా అవకాశాల పరంగా వెనుకబడే ఉంది. మంగళవారం సినిమాలో కాస్త హద్దు దాటి నటించినా! నటిగా మార్కలు వేయించుకుంది తప్ప...కొత్త ఛాన్సులకు మాత్రం ఆ సినిమా మార్గాన్ని చూపలేదు. అయినా పాయల్ ప్రయత్నాలు మాత్రం ఆగలేదు. నిరంతరం ఛాన్సులు అడుగుతూనే ఉంది.
ఇటీవలే 'కాంతార-2' లో కూడా ఛాన్స్ ఇవ్వండని అడిగిన సంగతి తెలిసిందే. ఆ విషయం పక్కనబెడితే తాజాగా పాయల్ తొలిసారి కెరీర్ లో మొదటి కెమెరా ముందుకొచ్చి ఫోజులిచ్చిన ఫోటో షూట్ ని అభిమానులతో పంచుకుంది. ఆ పాత సంగతులు గుర్తు చేసుకుని మురిసిపోయింది. 21 ఏళ్లకే మోడలింగ్ లోకి వచ్చిందిట. ఇదే నా తొలి ఫోటో షూట్ అంటూ సిగ్గుపడిపోయింది. ఓ మ్యాగజైన్ కోసం పాయల్ ఈ షూట్లో పాల్గొన్నట్లు తెలిపింది.
ఆరేంజ్ అండ్ క్రీమ్ కలర్ కాంబినేషన్ డిజైన్ దుస్తుల్లో కనిపిస్తుంది. అయితే పాయల్ అందం విషయంలో పెద్ద మార్పులేమి కనిపించలేదు. అప్పుడెలా ఉందో? ఇప్పటికీ అలాగే ఉంది. ఫిట్ నెస్ విషయంలో ఎంతో కేరింగ్ తీసుకుంటుందని తెలుస్తోంది. 31 ఏళ్ల వయసులోనూ 21 ఏళ్ల అమ్మాయిలాగే కనిపిస్తోంది.