తండ్రి స్పూర్తితో శ్రీకాంత్ అడ్డాల పెదకాపు!
పైగా ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా తెరకెక్కిస్తుండటంతో! ఈ కథలో బలం లేకుండా ఇంతటి సాహసం చేస్తారా? అన్నది అంతకంతకు హైప్ తీసుకొస్తుంది
శ్రీకాంత్ అడ్డాల తెరకెక్కించిన 'పెదకాపు' చిత్రంపై భారీ అంచనాలు నెలకొంటున్న సంగతి తెలిసిందే. ఇందులో హీరో కొత్త వాడైనా! శ్రీకాంత్ కి ఇలాంటి జానర్ కొత్తదే అయినా ప్రచార చిత్రాలు..స్టోరీ సినిమాపై మంచి అంచనాలు తీసుకొచ్చాయి. టైటిల్ కూడా ఓ సామాజిక వర్గానికి చెందినట్లుగా ఉండటంతో ! ఇందులో రాజకీయ అంశాలు ఏవైనా ఉన్నాయా? అన్న అంశం ఆసక్తిగా మారింది.
పైగా ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా తెరకెక్కిస్తుండటంతో! ఈ కథలో బలం లేకుండా ఇంతటి సాహసం చేస్తారా? అన్నది అంతకంతకు హైప్ తీసుకొస్తుంది. ఈ నేపథ్యంలో అసలు ఈ కథకి ఎలా అంకురార్పణ జరిగింది? అన్న విషయాన్ని దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల రివీల్ చేసారు. 1982 లో రామారావు గారు పార్టీ స్థాపించినప్పుడు మా నాన్న ఊర్లో రాజకీయాల్లో చాలా క్రియాశీలకంగా ఉండేవారు.
ఒక కొత్త పార్టీ వస్తుందంటే? జీవితాల్లో ఏదో కొత్త మార్పు వస్తుందని ఆశ అందరిలో ఉంటుంది. ముఖ్యంగా యువతపై ఆ ప్రభావం ఉంటుంది. ఆ మార్పును ఆరోజుల్లో నేను దగ్గరుండి చూసాను. నాకు అప్పుడే ఎంతో ఆసక్తిగా అనిపించింది. ఆ రోజుల్లో దాదాపు 294 మంది కొత్త వాళ్లను ఎంపిక చేసి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు. అప్పుడొచ్చిన రాజకీయ సమీకరణాల నేపథ్యంలోనే కొన్ని సంఘటనల ఆధారంగా ఈ కథ సిద్దం చేసా అన్నారు.
అలాగే కథకు సంబంధించిన కొన్ని కీలకమైన క్లూస్ ఇచ్చారు. 'అదో నదీ ఒడ్డున ఉన్న గ్రామం. కులాల మధ్య సమరంలో నిత్యం అక్కడ ఎన్నో ప్రాణాలు పోతుంటాయి. పెదకాపులతో జరిగే ఆధిపత్యపోరుని అక్కడి పెద్ద మనుషులు(ఆడుకాలం నరేన్-శ్రీకాంత్ అడ్డాల) శాశిస్తు ఉంటారు. అయితే అణిచివేత తప్ప మరో ఉన్నతి ఎరుగని కులానికి చెందిన ఓ యువకుడు(విరాట్ కర్ణ) ఈ వ్యవస్థకు తిరగబడతాడు. అక్కడి నుంచి గొడవలు కొత్త మలుపు తీసుకుంటాయి. ఊచకోతతో మొదలై ఆ ఊళ్ళో కొనఊపిరి తీసుకున్న ప్రతి ఆడబిడ్డ కన్నీటికి బదులు చెప్పాలని తెగబడతాయి. ఆ మలుపులే అసలు స్టోరీ' అన్నారు.