పెదకాపు.. కంటెంట్ ఏదో స్ట్రాంగ్ గా ఉందే..

ఈ సినిమా విడుదల తేదీ మరి కొద్ది రోజులే ఉన్న నేపథ్యంలో ట్రైలర్ రిలీజ్ కు డేట్ ఖరారు చేశారు మేకర్స్.

Update: 2023-09-09 07:21 GMT

నారప్ప లాంటి సూపర్ హిట్ యాక్షన్ చిత్రం తర్వాత దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల తెరకెక్కిస్తున్న సినిమా పెద కాపు 1 . కొత్త బంగారు లోకం, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, బ్రహ్మెత్సవం వంటి సాఫ్ట్ సినిమాల తర్వాత గేర్ మార్చి శ్రీకాంత్ అడ్డాల యాక్షన్ బాట పట్టిన సంగతి తెలిసిందే. ఇప్పుడు పెద్ద కాపుతో రానున్నారు. ఈ సినిమా విడుదల తేదీ మరి కొద్ది రోజులే ఉన్న నేపథ్యంలో ట్రైలర్ రిలీజ్ కు డేట్ ఖరారు చేశారు మేకర్స్.


భగవంతుడే లోకమంతా నిండి ఉన్నప్పుడు, భగవంతుడే అంతా తానై ఉన్నప్పుడు, ఇక ధర్మం ఏంటి? అధర్మం ఏంటి? పుణ్యం ఏంటి? పాపం ఏంటి? మరి మనిషి అనుభవం మాట, సామాన్యుడికి తగిలే దెబ్బల మాట, వాటి సంగతేంటి? సామాన్యుడిగా మనిషి ఎప్పుడు దుఃఖం నుంచి సుఖంలోకి, చీకటిలో నుంచి వెలుగులోకి రావాలనే అనుకుంటాడు, ఎదగాలని తపన పడతాను, అలా ఎదగాలనుకునే వాడికి ఎదగనివ్వనోడికి, తన దారినా తాను పోయేవాడికి, ఆ దారే మూసేసి తొక్కేయ్యాలనుకునే వాడికి మధ్య యుద్ధం తప్పదు. సెప్టెంబర్ 29న చూద్దాం అంటూ ఓ వీడియోను పోస్ట్ చేశారు. ట్రైలర్ ను సెప్టెంబర్ 11న విడుదల చేస్తున్నట్లు అనౌన్స్ చేశారు.

'అఖండ' లాంటి బ్లాక్ బస్టర్ చిత్రాన్ని నిర్మించిన మిర్యాల రవీందర్ రెడ్డి.. ఈ 'పెదకాపు 1' సినిమాని నిర్మిస్తున్నారు. మిర్యాల సత్యనారాయణ సమర్పణలో ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. ‘ఓ సామాన్యుడి సంతకం ఈ సినిమా ట్యాగ్ లైన్. మిర్యాల రవీందర్ రెడ్డి మేనల్లుడు విరాట్ కర్ణ ఈ సినిమాతో సిల్వర్ స్క్రీన్ కు హీరోగా పరిచయం అవుతున్నారు.

టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ తోనే ఈ సినిమా చాలా ఇంటెన్స్ గా ఉండబోతుందని అర్థమైంది. టీజర్ కు కూడా మంచి రెస్పాన్ వచ్చింది. రెండు వర్గాల మధ్య కులాల కోసం, ఆధిపత్యం కోసం జరిగే కొట్లాటలో ఎదురుతిరిగిన ఓ యువకుడి కథ అనే అని.. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు చూస్తుంటే అర్థమవుతోంది.

ఇప్పుడు సెప్టెంబర్ 11న ట్రైలర్ రిలీజ్ ద్వారా ఈ సినిమా అసలు కథేంటో మరింత స్పష్టత వచ్చే అవకాశముంది. అఖండ రిలీజైన సెప్టెంబర్ 29న ఈ పెద కాపు చిత్రాన్ని థియేటర్లలో రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమాకు మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే విడుదలై సాంగ్స్ కూడా ఆకట్టుకున్నాయి. ప్రముఖ స్టంట్ మాస్టర్ పీటర్ హెయిన్స్.. ఫైట్స్ కంపోస్ట్ చేశారు. చోటా కె నాయుడు సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరించారు. మార్తాండ్ కే వెంకటేశ్ ఎడిటింగ్ చేశారు. రాజు సందరం కొరియోగ్రఫీ చేశారు.

Tags:    

Similar News