బంగారు అంచు ఎర్ర కోకలో పూజా హెగ్డే కెవ్వు కేక
ఈ దీపావళిలో సాంప్రదాయబద్ధమైన దుస్తుల్లో కనిపించిన పూజా హెగ్డే హెడ్ టర్నర్ గా మారింది.
దీపావళి శుభసాయంత్రం మెరుపులు మిరుమిట్లకు, ధేధీప్యమానమైన కాంతులకు వేదిక అయింది. ముఖ్యంగా సెలబ్రిటీల ఇంట ప్రత్యేక శోభ సంతరించుకుంది. ఈసారి పలువురు అందాల కథానాయికలు తమ కుటుంబ సభ్యులతో కలిసి దీపావళిని సెలబ్రేట్ చేసుకున్నారు. ప్రతి ఒక్కరి ఇంటా మెరిసే దివ్వెలు, పండుగ విందు సువాసనలు, సాంప్రదాయ వస్త్రాల శోభతో సందడి కనిపించింది. ఈ దీపావళిలో సాంప్రదాయబద్ధమైన దుస్తుల్లో కనిపించిన పూజా హెగ్డే హెడ్ టర్నర్ గా మారింది.
దీపావళి సందర్భంగా పూజా హెగ్డే ఎంపిక చేసుకున్న టాప్ 5 డిజైనర్ దుస్తులకు సంబంధించిన వివరాలు అందరినీ ఆకర్షిస్తున్నాయి. ఐవరీ లెహంగా లు, భారీ ఎంబ్రాయిడరీ .. సీక్విన్స్ వర్క్‌తో అలంకరించబడిన సున్నితమైన దుస్తులలో పూజా కనిపించింది. అందమైన చీర కట్టులోను మైమరిపించింది. పూజా బంగారు అంచు ఎర్ర కోకలో మెరుపులు మెరిపించింది. ఈ చీరకు కాంబినేషన్ గా భారీగా ఎంబ్రాయిడరీ చేసిన బ్లౌజ్ ని ధరించింది.
ముఖ్యంగా పూజ హెగ్డే తన తల్లి తండ్రులతో కలిసి ఫోటోలు దిగింది. అలాగే తన తమ్ముడు, అతని భార్య ఇద్దరితో ఉన్న ఫోటో కూడా షేర్ చేసింది. దీపావళి పిండి వంటలు, తమ ఇంట్లో లైట్స్ తో ఉన్న డెకరేషన్, కి సంబందించిన ఫోటోలు షేర్ చేసింది. ప్రస్తుతం ఇవన్నీ ఇంటర్నెట్ లో వైరల్ గా మారాయి. పూజాతో పాటు చాలామంది టాలీవుడ్ కథానాయికలు తమ దీపావళి సెలెబ్రేషన్స్ కి సంబందించిన ఫొటోలను షేర్ చేశారు. అల్లు అర్జున్, రష్మిక మందన, నిహారిక కొణిదెల, వరుణ్ తేజ్, విజయ్ దేవరకొండ తదితరుల దీపావళి సెలబ్రేషన్స్ కి సంబంధించిన ఫోటోలు వైరల్ అయ్యాయి.
కెరీర్ మ్యాటర్ కి వస్తే.. పూజా హెగ్డే ప్రస్తుతం తెలుగు, తమిళంలో నటిస్తూనే హిందీ చిత్రసీమలో క్రేజీ అవకాశాలు అందుకుంటోంది. ఇటీవల షాహిద్, వరుణ్ ధావన్ లాంటి స్టార్ల సరసన అవకాశం దక్కించుకుంది. షాహిద్ కపూర్‌తో కలిసి నటించిన దేవా యాక్షన్ థ్రిల్లర్‌లో పూజా హెగ్డే కనిపించనుంది. అంతే కాకుండా దళపతి విజయ్ రాజకీయాల్లోకి రాకముందు ప్రకటించిన దళపతి 69, అలాగే సూర్య 44 వంటి ప్రతిష్టాత్మక పాన్ ఇండియా ప్రాజెక్ట్‌లలో కూడా కనిపిస్తుంది.