తండ్రితో లిప్ కిస్.. 30 ఏళ్ల తర్వాత స్పందించిన పూజా..!
ఈ సందర్భంగా తను హీరోయిన్ గా చేస్తున్న టైం లో తండ్రి మహేష్ భట్ తో లిప్ కిస్ వివాదం పై స్పందించారు.
బాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ మహేష్ భట్ ఆయన తనయురాలు పూజా భట్ ల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మహేష్ భట్ నిర్మాతగా ఎంత సక్సెస్ అయ్యారో ఆయన వారసత్వాన్ని కొనసాగిస్తూ పూజా భట్ కూడా సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ అయ్యారు. మొదట్లో పూజా హీరోయిన్ గా ప్రయత్నించారు. 17 ఏళ్లకే హీరోయిన్ గా మారిన ఆమె అప్పట్లో స్టార్ క్రేజ్ తెచ్చుకున్నారు. అయితే పదేళ్లు హీరోయిన్ గా చేసిన పూజా భట్ హీరోయిన్ గా కెరీర్ కు ఫుల్ స్టాప్ పెట్టేసి నిర్మాతగా కొనసాగారు.
రీసెంట్ గా ఆమె మళ్లీ తెరంగేట్రం చేశారు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పూజా భట్ మెప్పిస్తున్నారు. ఈ సందర్భంగా తను హీరోయిన్ గా చేస్తున్న టైం లో తండ్రి మహేష్ భట్ తో లిప్ కిస్ వివాదం పై స్పందించారు.
తండ్రితో లిప్ కిస్ ఏంటని అప్పట్లో అందరు తనని కామెంట్ చేశారని. అయితే తల్లిదండ్రులకు తమ పిల్లలు ఎప్పుడూ చిన్న పిల్లలే అని అలా తండ్రితో లిప్ కిస్ జరిగింది తప్ప మరే కారణం కాదు. అయితే ఆ విషయంలో తనపై చాలా విమర్శలు వచ్చాయి.
వాటిని ఏవి తను పట్టించుకోలేదని ఈ విషయంపై షారుఖ్ ఖాన్ కూడా తనకు సపోర్ట్ గా నిలిచారని అన్నారు పూజా భట్. బాలీవుడ్ సినిమాల్లో బోల్డ్ కంటెంట్ తో సినిమాలు చేయాలంటే అది భట్ ఫ్యామిలీనే అనేలా బ్రాండ్ ఏర్పరచుకున్నారు. నిర్మాతగా సూపర్ హిట్స్ కొట్టిన పూజా సెకండ్ ఇన్నింగ్స్ లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా సత్తా చాటాలని చూస్తున్నారు.
సెలబ్రిటీస్ గురించి ఎక్కడ ఏ చిన్న విషయం దొరికినా సరే దాన్ని చాలా పెద్దది చేయడం ఎప్పటి నుంచో ఉంది. అప్పట్లో ఈ సోషల్ మీడియా లేదు కాబట్టి సపోయింది ఒకవేళ ఇప్పుడైతే మాత్రం సోషల్ మీడియా ట్రోలింగ్స్ చాలా దారుణంగా ఉండేదని చెప్పొచ్చు.
మొత్తానికి తండ్రి మహేష్ భట్ తో పూజా లిప్ కిస్ గురించి 30 ఏళ్ల తర్వాత ప్రస్తావించి అందరిని ఆశ్చర్యపరచింది పూజా భట్. సడక్ 2, బాంబే బేగంస్, చుప్ రివెంజ్ ఆఫ్ ది ఆర్టిస్ట్ సినిమాలతో పాటుగా ఈ ఇయర్ హిందీ బిగ్ బాస్ ఓటీటీ లో కంటెస్టెంట్ గా వెళ్లి టాప్ 5 లో నిలిచారు పూజా భట్. బిగ్ బాస్ వల్ల ఆమెకు మరిన్ని అవకాశాలు వచ్చేలా ఉన్నాయి.