పూజా వెంట పడుతున్న టైర్ 2 హీరోస్..!

టైర్ 2 హీరోలైనా సరే చేయాలని ఫిక్స్ అయిన పూజా హెగ్దేకి ఎలాంటి ఛాన్స్ లు వస్తాయో చూడాలి.

Update: 2023-08-14 15:30 GMT

నిన్న మొన్నటి దాకా తెలుగులో సూపర్ ఫాంలో ఉన్న పూజా హెగ్దే కాస్త ఇప్పుడు ఇక్కడ ఆఫర్లు లేకపోవడంతో డీలా పడుతుంది. మహేష్ గుంటూరు కారం లో మొదట తననే హీరోయిన్ గా ఫిక్స్ చేసి కొంత పార్ట్ షూటింగ్ కూడా చేయగా కొన్ని కారణాల వల్ల సినిమా నుంచి ఆమె ఎగ్జిట్ అయ్యింది. ఆ సినిమా నుంచి పూజా బయటకు వెళ్లడానికి కారణాలు ఏంటన్నది పర్ఫెక్ట్ గా ఎవరు చెప్పలేకపోతున్నారు. ఇదిలా ఉంటే చేతిలో ఉన్న ఒక్క సినిమా కూడా మిస్ అవడంతో టాలీవుడ్ లో ఖాళీ అయిపోయింది పూజా.

బాలీవుడ్ లో ఒకటి రెండు ఆఫర్లు లైన్ లో ఉన్నా సరే తనకు స్టార్ డం తెచ్చిపెట్టిన తెలుగులో అవకాశాల కోసం ఎదురుచూస్తుంది పూజా బేబీ. అయితే స్టార్ హీరోలు ప్రస్తుతం చేస్తున్న సినిమాలకు ఆల్రెడీ హీరోయిన్స్ ఫిక్స్ అయ్యారు. ఇప్పటికిప్పుడు పూజా కోసం హీరోయిన్స్ ని మార్చలేని పరిస్థితి. అందుకే అమ్మడిని తమ నెక్స్ట్ సినిమా కోసం వెయిటింగ్ లో పెట్టారు. అయితే పూజా ఓకే అంటే చాలు ఆమెతో రొమాన్స్ చేసేందుకు రెడీ అంటున్నారు టైర్ 2 హీరోలు. ఎప్పుడెప్పుడు స్టార్ హీరోయిన్స్ తో సినిమా చేయాలా అన్న ఆలోచనతో ఉండే టైర్ 2 హీరోలు తమ సినిమాలో స్టార్ హీరోయిన్ ఉంటే వచ్చే మైలేజ్ ని గుర్తించి వారితో నటించాలని అనుకుంటారు.

అంతేకాదు స్టార్ హీరోల సినిమాల్లో అయినా హీరోయిన్స్ ని కొన్నిసార్లు కేవలం పాటల వరకే తీసుకుంటారు కానీ టైర్ 2 హీరోల సినిమాల్లో మాత్రం హీరోయిన్ పాత్రలకు వెయిట్ ఎక్కువ ఉంటుంది. కొన్ని సినిమాలు అయితే హీరోయిన్స్ మీదే కథ మొత్తం నడుస్తుంది కూడా. అలాంటి టైర్ 2 హీరోల సినిమా ఛాన్స్ వస్తే ఎవరు మాత్రం కాదంటారు చెప్పండి. ప్రస్తుతం పూజా ముందుకు కూడా రెండు మూడు ఇలాంటి సినిమా ఆఫర్లే వచ్చాయట. వాటిలో ఏది ఓకే చేయాలి ఏది వద్దనాలి అనే డిస్కషన్స్ లో ఉంది పూజా హెగ్దే.

నటిగా ఎన్ని మార్కులు సంపాదించింది అనే దాని కన్నా తన గ్లామర్ తో తెలుగు ఆడియన్స్ ని ఫిదా చేసిన పూజా బేబి ఇక్కడ సినిమాలో చేస్తే చూడాలని ప్రేక్షకులు ఆశిస్తున్నారు. గుంటూరు కారం మిస్ అయినందుకు సూపర్ స్టార్ ఫ్యాన్స్ నిరాశపడగా పూజా నెక్స్ట్ సినిమా కోసం ఫ్యాన్స్ ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. టైర్ 2 హీరోలైనా సరే చేయాలని ఫిక్స్ అయిన పూజా హెగ్దేకి ఎలాంటి ఛాన్స్ లు వస్తాయో చూడాలి.

Tags:    

Similar News