ఓవైపు సినిమాలు, మరోవైపు వారాహి యాత్ర.. పవన్ ప్లానేంటి?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి స్పెషల్ గా పరిచయం అవసరం లేదు. ఆయనకు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి స్పెషల్ గా పరిచయం అవసరం లేదు. ఆయనకు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అందరు హీరోలకు ఫ్యాన్స్ ఉంటారు. కానీ, పవన్ కి మాత్రం భక్తులు ఉంటారు. ఆయనను దాదాపు ఫ్యాన్స్ దేవుడిలా చూస్తారు. ఆయన ఏం చేసినా ఫ్యాన్స్ కి విపరీతంగా నచ్చేస్తుంది. ఆయన సినిమాలు చేయాలి, అదేవిధంగా రాజకీయాల్లో రాణించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
నిజానికి పవన్ రాజకీయాల్లోకి రాణించడానికి సినిమాలను పక్కన పెట్టేద్దాం అనుకున్నారు. కానీ ఫ్యాన్స్ ఒప్పుకోలేదు. అందుకే ఆయన మళ్లీ సినిమా చేయాలని డిసైడ్ అయ్యారు. అయితే, ఓ వైపు సినిమాలు, మరో వైపు రాజకీయాలతో ఆయన బిజీగా ఉన్నారు. మరీ ముఖ్యంగా పవన్ చేతిలో ఇప్పుడు వరసగా, మూడు నాలుగు సినిమాలు ఉన్నాయి. దీంతో రాజకీయాలను పక్కనపెట్టేసినట్లేనా అని అందరూ అనుకున్నారు.
అయితే, పవన్ మాత్రం రానున్న కాలంలో, అటు సినిమాలతోపాటు, ఇటు రాజకీయాలకు సమయం కేటాయించాలని అనుకుంటున్నారట. దాని కోసం ప్లాన్ చేస్తున్నారు. త్వరలోనే పవన్ పుట్టిన రోజు రానుంది. ఆయన పుట్టినరోజు సెప్టెంబర్ 2వ తేదీ నుంచి దాదాపు మరో పది రోజుల వరకు ఆయన మూవీ షూటింగ్ లోనే పాల్గొనననున్నారు.
అయితే, ఆ మూవీ షూటింగ్ సెప్టెంబర్ రెండో వారం వరకు సాగనుంది. ఇక, మూడో వారం నుంచి ఆయన రాజకీయాలపై ఫోకస్ పెట్టనున్నట్లు తెలుస్తోంది. అప్పుడు నాలుగో దశ వారాహి యాత్ర మొదలుపెట్టనున్నారు. దానికి తగినట్లే, రూట్ మ్యాప్ డిజైన్ చేస్తున్నారట. ఇక ఇప్పటి నుంచి పవన్ మూవీ షూటింగ్స్ ఉన్నా కూడా దాదాపు నాలులపాటు రాజకీయాల్లో యాక్టివ్ గా ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నారట.
ప్రతినెలా సగం రోజులు తమ పార్టీ కోసం కేటాయించాలని అనుకుంటున్నారట. అదే సమయంలో, పార్టీ రిక్రూట్‌మెంట్, నియోజకవర్గాల ఆధారిత మూల్యాంకనాలు దానికి తగినట్లు ప్రణాళికలు చేస్తున్నారట. వచ్చే ఏడాది జనవరి నుండి, పవన్ కళ్యాణ్ పక్కన పెట్టి మరీ, ఎన్నికలకు సిద్ధమవ్వాలని అనుకుంటున్నారట. ఎన్నికలకు ముందు వంద రోజులు మరింత పకడ్బందీగా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. జనవరి నుంచి వారాహి యాత్రను మరింత స్పీడప్ చేయాలని, మిగిలిన అన్ని నియోజకవర్గాలను కవర్ అయ్యేలా ప్రణాళిక చేస్తున్నారు. ఎన్నికల నాటికి రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాలను చేట్టేసేలా ప్రణాళిక తయారు చేస్తున్నారు. అదేవిధంగా బహిరంగ సభలు కూడా ఏర్పాటు చేయాలని అనుకుంటున్నారు. మరి దీనిలో పవన్ ఎంత వరకు సక్సెస్ అవుతాడో చూడాలి.