ప్యూచర్ ప్రభాస్ కి పూరాణాలకి రిలేషన్!
ప్రభాస్ కథానాయకుడిగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ గా `కల్కి 2898` భారీ అంచనాల మధ్య తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే.
ప్రభాస్ కథానాయకుడిగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ గా `కల్కి 2898` భారీ అంచనాల మధ్య తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఇందులో భారతదేశం భవిష్యత్ లో ఎలా ఉండబోతుంది? అన్నది చూపించబోతున్నట్లు నాగ్ అశ్విన్ తెలిపాడు. భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ గా మలుస్తూనే భారత్ భవిష్యత్ ని సైతం చూపించబోతున్నాడు. ప్రభాస్ ని ఎంతో అడ్వాన్స్ డ్ గా తెరపై ఆవిష్కరిస్తున్నాడు.
ఇంతవరకూ ఇలాంటి అటెంప్ట్ ఇండియాలో ఏ దర్శకుడు చేయలేదు. తొలిసారి అతి పెద్ద సాహసానికి నాగ్ అశ్విన్ పూనుకున్నాడు. అందుకు తగ్గట్టే సినిమాపై హైప్ అలాగే క్రియేట్ అవుతుంది. నాగ్ అశ్విన్ అనుకు న్నది అనుకున్నట్లు ఎగ్జిక్యూట్ చేసి ప్రేక్షకుల్ని మెప్పిస్తే! ఇండియాలో గ్రేట్ మేకర్స్ స్థానంలో అతను నెంబర్ వన్ లో ఉంటాడు అనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే ఈ కథ సైన్స్ ఫిక్షన్ తో ముడి పడినా ఇందులోనూ పురాణేతిహాసాల ప్రస్తావన కూడా ఉంటుందని సమాచారం.
`కల్కి` అంటేనే విష్ణువు దశావతరాల్లో ఒకటనే విశ్వాసం ఉంది. అదే పేరుతో రూపొందుతున్న ఈ చిత్రంలో భక్తి కోణం..ఆ నేపథ్యంలో పండే బావోద్వేగాలకు సినిమాలో ఎంతో కీలకంగా ఉంటాయన్నది కొత్త సమా చారం. అంటే సైన్స్ ఫిక్షన్ కి...పురాణాల్ని ఎలా లింక్ చేసి చూపించబోతున్నాడు? అన్నది ఇక్కడ ఆసక్తి కరం. సైన్స్ కి..పురాణానికి అస్సలు పొసగదు. పురాణాల్ని వేటిని శాస్త్రజ్ఞులు నమ్మరు.
కానీ సైన్స్ ని పండితులు నమ్ముతారు. మరి అలా పొసగరి పురణం..సైన్స్ ని ఎంత కన్విన్సింగ్ గా చెప్పబో తున్నాడు? అన్నది ఇక్కడ ఆసక్తికరం. ఇది అంత తేలికైన పనికాదు. ఎంతో బ్యాలెన్సిం గ్..కన్విన్సింగ్ గా చెప్పాల్సిన అంశం. మరి ఆ విషయంలో నాగ్ అశ్విన్ ఎంతవరకూ లిబర్టీ తీసుకున్నాడో చూడాలి.