కన్నుల్లో నీ రూపమే... ప్రభాస్‌ కి చాలా ఇష్టం

ప్రభాస్‌ ఈ మధ్య కాలంలో బుల్లి తెరపై టాక్‌ షో లేదా గేమ్‌ షోల్లో కనిపించడం చాలా అరుదుగా జరుగుతూ ఉంటుంది.

Update: 2024-11-04 08:15 GMT

ప్రభాస్‌ ఈ మధ్య కాలంలో బుల్లి తెరపై టాక్‌ షో లేదా గేమ్‌ షోల్లో కనిపించడం చాలా అరుదుగా జరుగుతూ ఉంటుంది. వరుస సినిమాలతో బిజీగా ఉన్న ప్రభాస్‌ తాజాగా సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి సాహిత్యం గురించి చర్చించే 'నా ఉచ్ఛ్వాసం కవనం' ఈటీవీ షో లో పాల్గొన్నాడు. ప్రభాస్‌ హీరోగా నటించిన పలు సినిమాల్లో సీతారామశాస్త్రి గారి సాహిత్యం ఉంటుంది. అందుకే ఆయనతో ప్రభాస్ కి సన్నిహిత సంబంధం ఉంది. ఆ అనుబంధం, సంబంధంతోనే ఈ షోలో ప్రభాస్ పాల్గొన్నారు. ప్రోమో వచ్చినప్పటి నుంచి ఫుల్‌ ఎపిసోడ్‌ కోసం ప్రభాస్‌ ఫ్యాన్స్‌తో పాటు శాస్త్రీ గారి ఫ్యాన్స్‌ ఆసక్తిగా ఎదురు చూస్తూ వచ్చారు. ఎపిసోడ్‌ టెలికాస్ట్‌ తర్వాత సోషల్‌ మీడియాలో అదే చర్చ.

సిరివెన్నెల గురించి ప్రభాస్ మాట్లాడుతూ... ఆయన రాసిన విధాత తలపున ప్రభవించినది పాట గొప్పగా ఉంటుంది. ఎన్నో గొప్ప ఫీల్‌ ఉన్న పాటలను ఆయన అందించారు. నిన్నే పెళ్లాడతా సినిమాలోని కన్నుల్లో నీ రూపమే పాట అంటే చాలా ఇష్టం. ఆ పాట చరణంలో వచ్చే లైన్స్‌ అంటే ఇంకా ఇష్టం. అన్ని తరాలు అభిమానించే విధంగా, అన్ని తరాలకు నచ్చే విధంగా ఆయన సాహిత్యం ఉంటుంది. ప్రతి ఒక్కరు సులువుగా అర్థం చేసుకుంటారు. శివ సినిమా వచ్చిన సమయంలో నేను ఐదో తరగతి చదువుతూ ఉన్నాను. ఆ సినిమాలోని బోటనీ పాఠముంది పాటను ఎక్కువగా పాడుకుంటూ తిరిగే వాడిని. ఆ తర్వాత కాలంలో దాన్ని రాసింది సిరివెన్నెల గారు అని తెలిసి షాక్‌ అయ్యాను.

ఎంతో ఫీల్ ఉన్న పాటలతో పాటు, ఇలా టీజ్ చేసే పాటలను సైతం అద్భుతంగా రాయగల గొప్ప సాహితీవేత్త సిరివెన్నెల గారు అంటూ ప్రభాస్‌ ప్రశంసించారు. చక్రం సినిమా కోసం ఆయన రాసిన జగమంత కుటుంబం నాది.. ఎంతటి విజయాన్ని సొంతం చేసుకుందో తెలిసిందే. ఫ్లాప్‌ అయిన చక్రం సినిమా గురించి ఇంకా మాట్లాడుకుంటున్నాం అంటే కచ్చితంగా అది శాస్త్రి గారి వల్లే. ఆ పాట మరో పాతిక సంవత్సరాలు అయినా ఫ్రెష్ గా ఆకట్టుకుంటూనే ఉంటుంది. ఆయన యువతలో ఉత్సాహం నింపే విధంగా ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమి పాటతో పాటు ఇంకా ఎన్నో పాటలను, రచనలు అందించారు. అలాంటి గొప్ప సాహితీవేత్త ఈ తరంకు లభించడం ప్రతి ఒక్కరి అదృష్టం అంటూ కార్యక్రమంలో చర్చ జరిగింది.

ప్రభాస్ బ్యాక్ టు బ్యాక్‌ సలార్‌, కల్కి 2898 ఏడీ సినిమాలను చేసి భారీ విజయాలను సొంతం చేసుకున్నాడు. ప్రస్తుతం రాజాసాబ్‌, ఫౌజీ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నారు. వచ్చే ఏడాదిలో ఆ రెండు మూవీస్ రాబోతున్నాయి. ఇక సలార్‌ 2, స్పిరిట్‌ సినిమాలు వచ్చే ఏడాదిలో షూటింగ్‌ జరగాల్సి ఉంది. మరో వైపు లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో ఒక సినిమా, ప్రశాంత్‌ వర్మ దర్శకత్వంలో ఇంకో సినిమాను ప్రభాస్ కమిట్ అయ్యాడని తెలుస్తోంది. మొత్తానికి ప్రభాస్‌ అర డజను సినిమాలు లైన్‌ లో ఉన్నాయి. బ్యాక్ టు బ్యాక్ బాక్సాఫీస్‌ వద్ద వార్‌ కి సిద్ధం అవుతున్నాయి. ప్రతి సినిమా వెయ్యి కోట్ల వసూళ్లు టార్గెట్‌ తో రాబోతుందని ఫ్యాన్స్ బలంగా నమ్ముతున్నారు.

Tags:    

Similar News