2030 లోనే ఆ కాంబినేష‌న్ సాధ్యం!

పాన్ ఇండియా సంచ‌ల‌నాలు ప్రభాస్- ప్ర‌శాంత్ వ‌ర్మ చేతులు క‌లుపుతోన్న సంగ‌తి తెలిసిందే.

Update: 2024-11-04 05:11 GMT

పాన్ ఇండియా సంచ‌ల‌నాలు ప్రభాస్- ప్ర‌శాంత్ వ‌ర్మ చేతులు క‌లుపుతోన్న సంగ‌తి తెలిసిందే. దీంతో అంచ‌నాలు అప్పుడే తారా స్థాయికి చేరుతున్నాయి. పాన్ ఇండియాలో ప్ర‌భాస్ రేంజ్ 2000 కోట్ల వ‌సూళ్లు రేంజ్ ఉన్న హీరో. ప్ర‌శాంత్ వ‌ర్మ తొలి సినిమా పాన్ ఇండియా చిత్రంతోనే 400 కోట్ల వ‌సూళ్ల‌ను కొల్ల‌గొట్టాడు. అలాంటి ఇద్ద‌రు చేతులు క‌లిపితే ఇంకెలా ఉంటుందో చెప్పాల్సిన ప‌నిలేదు. మ‌రి ఈ ద్వ‌యం సెట్స్ కి వెళ్లేది ఎప్పుడు అంటే అది ఇప్ప‌ట్లో సాద్య‌మ‌య్యేది కాదు అన్న‌ది అంతే వాస్త‌వం.

ప్ర‌భాస్ లైన‌ప్ చూస్తే? ఈ సినిమా ప‌ట్టాలెక్క‌డానికి మ‌రో ఐదేళ్లు అయినా స‌మ‌యం ప‌డుతుంద‌ని అంచ‌నాలు తెర‌పైకి వ‌స్తున్నాయి. ప్ర‌స్తుతం పూర్తి చేయాల్సిన ప్రాజెక్ట్ లు ఐదు రెడీగా ఉన్నాయి. అందులో ఒక‌టి `రాజాసాబ్` ఎంతో కాలంగా సెట్స లోనే మూలుగుతోంది. దీంతో ఎలా లేద‌న్నా ఆ చిత్రం వ‌చ్చే ఏడా రిలీజ్ అవుతుంది. అటు భారీ వార్ బ్యాక్ డ్రాప్ లో హ‌ను రాఘ‌వ‌పూడి ద‌ర్శ‌క‌త్వంలో `పౌజీ` చేస్తున్నాడు.

ఈ సినిమా వ‌చ్చే ఏడాది ముగింపు కు రిలీజ్ అవుతుంది. వీటితో పాటు ఏక‌ధాటిగా మ‌రో చిత్రాన్ని డార్లింగ్ ప‌ట్టా లెక్కిస్తాడు. అది ఏ సినిమా అన్న‌ది ఇప్పుడే చెప్ప‌లేం ఎందుంక‌టే. సందీప్ వంగ తో `స్పిరిట్` చేయాలి. అలాగే `స‌లార్ -2` కూడా పూర్తి చేయాలి. మ‌రోవైపు క‌ల్కి రెండ‌వ భాగం పూర్తి చేయాలి. ఈ ఒక్క భాగం కోస‌మే డార్లింగ్ రెండేళ్లు స‌మ‌యం కేటాయించాల్సి ఉంటుంది. ప్ర‌భాస్ అస‌లైన పాత్ర రెండవ భాగంలోనే ఉంటుంది. ఆ సినిమా కోసం ఎక్కువ‌గా క‌ష్ట‌ప‌డాల్సిన అవ‌స‌రం ఉంటుంది.

ఎంతో కాన్సంట్రేట్ గా చేయాల్సిన ప్రాజెక్ట్ ఇది. దీనిలో భాగంగా ఆ సినిమా షూట్ ఎప్పుడు పూర్త‌వుతుంద‌న్న‌ది ఇప్పుడే చెప్ప‌లేం. ద‌ర్శ‌కుడు నాగ్ అశ్విన్ `క‌ల్కి -2` ఒక్క సినిమానే రెండు..మూడు సినిమాల‌కు స‌మానంగా ఉంటుంది అన్నారు. అంటే ఆ సినిమా షూటింగ్ పూర్తి చేయ‌డానికి రెండేళ్ల‌కు పైగా స‌మ‌యం ప‌ట్టొచ్చు. ఈ సినిమాతో పాటు ఏకధాటిగా మిగ‌తా చిత్రాల్ని డార్లింగ్ సెట్స్ కి తీసుకెళ్లినా? అవి స్లోగా సాగుతాయి. అందుకే ఏ సినిమా రిలీజ్ తేదీపైనా సరైన స్ప‌ష్ట‌త లేదు. ఆ లెక్క‌న చేస్తే ప్ర‌శాంత్ వ‌ర్మ సినిమా 2030లోనే ఆస్కారం ఉంటుంది.

Tags:    

Similar News