ప్రభాస్ 'స్పిరిట్' - కిక్కిచ్చే లైన్!

టాలీవుడ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహిస్తున్న ఆ సినిమాపై అనౌన్స్మెంట్ నుంచి ఆడియన్స్, ఫ్యాన్స్ లో భారీ అంచనాలు ఉన్నాయి.

Update: 2024-12-12 17:21 GMT

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బ్యాక్ టు బ్యాక్ మూవీస్ తో ఫుల్ బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం రాజా సాబ్ ను పూర్తి చేస్తున్న ఆయన లైనప్ లో ఉన్న మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్ స్పిరిట్. టాలీవుడ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహిస్తున్న ఆ సినిమాపై అనౌన్స్మెంట్ నుంచి ఆడియన్స్, ఫ్యాన్స్ లో భారీ అంచనాలు ఉన్నాయి.

అయితే ఆ సినిమా ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ దశలో ఉంది. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ ను సందీప్ పూర్తి చేయగా.. రీసెంట్ గా మ్యూజిక్ సిట్టింగ్స్ ను స్టార్ట్ చేశారు. అందుకు సంబంధించిన పిక్స్ ను సంగీత దర్శకుడు హర్షవర్ధన్ రామేశ్వర్ షేర్ చేశారు. 2025 జనవరిలో రెగ్యులర్ షూటింగ్ మొదలు కానున్నట్లు రీసెంట్ గా అప్డేట్ ఇచ్చారు మేకర్స్.

2026 స్టార్టింగ్ లో మూవీ విడుదల చేస్తామని టీ సిరీస్ అధినేత ఇటీవల తెలిపారు. స్పిరిట్ మూవీని ప్రణయ్ వంగాతో కలిసి భూషణ్‌ కుమార్‌ నిర్మిస్తున్నారు. అయితే స్పిరిట్ కు సంబంధించి ఏదో ఒక వార్త సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు వైరల్ అవుతూనే ఉంటుంది. దీంతో సినిమాపై అంచనాలు పెరుగుతూనే ఉన్నాయి.

తాజాగా స్పిరిట్‌ సినిమా ఎలా ఉండబోతుందో సినాప్సిస్‌ రూపంలో హింట్ ఇచ్చి ఒక్కసారిగా క్యూరియాసిటీ పెంచారు. అందుకు సంబంధించిన స్క్రీన్ షాట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సినిమాలో ప్రభాస్.. పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నట్లు ఇప్పటికే పలుమార్లు సందీప్ చెప్పారు.

అయితే ఇప్పుడు సినాప్సిస్ ప్రకారం.. ఎల్లప్పుడూ న్యాయం నిలబెట్టేందుకు ప్రయత్నించే నిజాయితీ కలిగిన పోలీస్ ఆఫీసర్ (ప్రభాస్) విధి నిర్వహణలో ఓసారి అవమానానికి గురవుతారు. దీంతో తన గౌరవాన్ని తిరిగి దక్కించుకునేందుకు గ్లోబల్ క్రైమ్ సిండికేట్ ను వేటాడుతారు. చివరకు ఏం జరిగిందనే నేపథ్యంలో స్పిరిట్ ఉండబోతుందట!

కాగా.. ఆ సిండికేట్ పాపులర్ సౌత్ కొరియా యాక్టర్ డాన్ లీ అని తెలుస్తోంది. ఇప్పుడు ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. స్పిరిట్ స్టోరీ సినాప్సిస్ రివీల్ అయిన తర్వాత అంచనాలు మరింత పెరిగాయని నెటిజన్లు చెబుతున్నారు. ఈగర్లీ వెయిటింగ్ ఫర్ మూవీ అంటూ కామెంట్లు పెడుతున్నారు.

Tags:    

Similar News