కల్కి అంతసేపు కూర్చోబెడతాడా?

అలాంటిది ఇప్పుడు 'కల్కి 2898 ఎడి' సినిమా మాత్రం 3 గంటల రన్ టైమ్ తో వస్తోంది. ఇదేమైనా ప్రతికూలాంశంగా మారుతుందేమో అని పలువురు నెటిజన్లు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.

Update: 2024-06-20 12:49 GMT

రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా "కల్కి 2898 AD". జూన్ 27న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కాబోతున్న ఈ ఫాంటసీ ఫిలింపై అందరిలో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ కు ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ట్రైలర్, భైరవ సాంగ్ యూట్యూబ్ లో దూసుకుపోతున్నాయి. లేటెస్టుగా సెన్సార్ ఫార్మాలిటీస్ కూడా పూర్తయ్యాయి. దీంతో ఈ మూవీ రన్ టైమ్ ఎంతనేది బయటకి వచ్చింది.

ఇటీవల 'కల్కి' సినిమాను చూసిన సెన్సార్ సభ్యులు దీనికి 'U/A' (యూ/ఏ) సర్టిఫికేట్ జారీ చేశారు. తెలుగు వెర్షన్ రన్ టైం 188 నిమిషాల 56 సెకండ్లు వచ్చినట్లు తెలుస్తోంది. అంటే 3 గంటలకు పైగా నిడివితో ప్రభాస్ సినిమా థియేటర్లలోకి రాబోతోంది. ఇప్పటికైతే ఈ ఏడాదికి ఇదే పెద్ద చిత్రం. సెన్సార్ టాక్ ప్రకారం విజువల్స్ చాలా అద్భుతంగా ఉన్నాయి.. థ్రిల్లింగ్ యాక్షన్ సీన్స్ ప్రేక్షకులని మంత్రముగ్ధులను చేయబోతున్నాయి. సినిమాలో ఎమోషనల్ టచ్ తో పాటుగా, ప్రభాస్ పాత్రతో ఎంటర్టైన్మెంట్ కూడా పండించారట దర్శకుడు నాగ్ అశ్విన్. కాకపోతే మూడు గంటల పాటు జనాలను సీట్లో కూర్చోబెడతాడా? అని ఓ వర్గం ఫ్యాన్స్ ఆలోచిస్తున్నారు.

మాములుగా ప్రేక్షకులను చివరి వరకూ థియేటర్లలో కూర్చోబెట్టడానికి, ఎక్కడా బోర్ ఫీల్ అవ్వకుండా ఎంజాయ్ చెయ్యడానికి సినిమా లెన్త్ క్రిస్పీగా ఉంటేనే బెటర్ అని మేకర్స్ భావిస్తుంటారు. అందులోనూ ఓటీటీలకు అలవాటు పడిపోయిన జనాలను ఎక్కువసేపు సీట్లో కూర్చోబెట్టడం కష్టంగా మారడంతో, వీలయినంత వరకూ నిడివి తక్కువగా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అలాంటిది ఇప్పుడు 'కల్కి 2898 ఎడి' సినిమా మాత్రం 3 గంటల రన్ టైమ్ తో వస్తోంది. ఇదేమైనా ప్రతికూలాంశంగా మారుతుందేమో అని పలువురు నెటిజన్లు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.

నిజానికి మంచి కంటెంట్, ఆసక్తికరమైన కథ - స్క్రీన్ ప్లేతో వస్తే.. సినిమా నిడివిని పట్టించుకోమని ఆడియెన్స్ అనేకసార్లు ప్రూవ్ చేశారు. ప్రభాస్ నటించిన 'బాహుబలి 2' మూవీ గం. 3.17 నిమిషాల లెన్త్ తో థియేటర్లలోకి వచ్చింది. 'అర్జున్ రెడ్డి', RRR, 'టైగర్ నాగేశ్వరరావు' చిత్రాల రన్ టైమ్ 3 గంటలకు పైగా ఉంది. గతంలో వైజయంతీ మూవీస్ నిర్మించిన 'మహానటి', 'మహర్షి' లాంటి చిత్రాలతో పాటుగా 'పుష్ప: ది రైజ్', 'ఆదిపురుష్', 'సలార్: పార్ట్-1 సీజ్ ఫైర్', 'బేబీ', 'అంటే సుందరానికీ' వంటి మరికొన్ని సినిమాలు దగ్గర దగ్గర మూడు గంటల నిడివితో వచ్చాయి.

పైన చెప్పుకున్న సినిమాల ఫలితాలను బట్టి.. స్ట్రాంగ్ కంటెంట్ ఉండి, ఎంగేజింగ్ స్క్రీన్ ప్లే ఉంటే చాలు ప్రేక్షకులు రన్-టైమ్ ను పట్టించుకోరని అర్థం అవుతోంది. అదే సమయంలో ఏమాత్రం కొంచెం తేడా కొట్టినా, సినిమా నిడివి మైనస్ గా మారే ప్రమాదం ఉందనే విషయం కూడా స్పష్టం అవుతోంది. ఇప్పటికైతే 'కల్కి 2898 AD' సినిమాకి పాజిటివ్ బజ్ ఉంది. ప్రభాస్ అండ్ టీమ్ కలిసి దూకుడుగా ప్రమోషన్స్ చేస్తున్నారు. 3 గంటల రన్ టైంతో 3D, 4DX మరియు IMAX ఫార్మాట్లలో రిలీజ్ కాబోతున్న ఈ ఎపిక్ ఫాంటసీ సైన్స్-ఫిక్షన్ మూవీ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.

Tags:    

Similar News