లెజెండ్స్‌తో.. నా కలను మించినది: ప్రభాస్
ఈ వేదికపై రెబల్ స్టార్ ప్రభాస్ మాట్లాడుతూ.. ''గ్రేటెస్ట్ లెజెండ్స్ తో వర్క్ చేసే అవకాశం ఇచ్చిన దత్తు గారు, నాగీ గారికి థాంక్ యూ. ఇట్స్ బిగ్గర్ దేన్ డ్రీం. అమితాబ్ గారు కంట్రీ మొత్తం రీచ్ అయిన ఫస్ట్ యాక్టర్.
నాగ్ అశ్విన్ తెరకెక్కించిన భారీ పాన్ ఇండియన్ సైన్స్ ఫిక్షన్ చిత్రం 'కల్కి 2898 AD' ఈనెల చివరిలో విడుదలకు సిద్ధమవుతోంది. ఇప్పటికే టీజర్, ట్రైలర్ సంచలనాలు సృష్టించాయి. ముంబై ఈవెంట్లో రెండో ట్రైలర్ ని ప్రదర్శించారని సమచారాం. విడుదలకు ముందే కల్కి చాలా సంచలనాలను సృష్టిస్తోంది. మేకర్స్ ఈ రోజు ముంబైలో ఒక గ్రాండ్ ఈవెంట్‌ను నిర్వహించారు. దీనికి అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, ప్రభాస్, దీపికా పదుకొనే హాజరయ్యారు. దగ్గుబాటి రానా హోస్టింగ్ చేసిన ఈవెంట్ గ్రాండ్ సక్సెసైంది.
ఈ వేదికపై రెబల్ స్టార్ ప్రభాస్ మాట్లాడుతూ.. ''గ్రేటెస్ట్ లెజెండ్స్ తో వర్క్ చేసే అవకాశం ఇచ్చిన దత్తు గారు, నాగీ గారికి థాంక్ యూ. ఇట్స్ బిగ్గర్ దేన్ డ్రీం. అమితాబ్ గారు కంట్రీ మొత్తం రీచ్ అయిన ఫస్ట్ యాక్టర్. కమల్ సార్ సాగరసంగమం చూసి అలాంటి డ్రెస్ కావాలని మా అమ్మని అడిగాను. అలాగే ఇంద్రుడు చంద్రుడు చూసి కడుపులో క్లాత్ చుట్టుకొని ఆయనలానే యాక్ట్ చేసేవాడిని. అలాంటి లెజెండ్స్ తో కలిసి నటించడం నమ్మశక్యం కానిది. దీపిక ఇంటర్నేషనల్ లెవల్ కి రీచ్ అయిన స్టార్. దీపికతో నటించడం బ్యూటీఫుల్ ఎక్స్ పీరియన్స్. అందరికీ థాంక్ యూ'' అని అన్నారు.
దీపిక పదుకొనే మాట్లాడుతూ.. కల్కి ఒక అద్భుతమైన అనుభవం. ఇది కంప్లీట్ న్యూ వరల్డ్. డైరెక్టర్ నాగీ క్రియేట్ చేసిన మ్యాజిక్ ఇది. యాక్టర్ గా ప్రొఫెషనల్ గా ఇది అద్భుతమైన ఎక్స్ పీరియన్స్. నాగీ జీనియస్. తన విజన్ చాలా క్లియర్ గా వుంటుంది. సినిమాని అద్భుతంగా తీశారు'' అని ప్రశంసించారు.
ప్రభాస్ స్టైలిష్ అవతార్:
'కల్కి 2898 AD' విడుదలకు ముందు ప్రభాస్ కొత్త రూపం యువతరంలో చర్చగా మారింది. అతడు తన హెయిర్ స్టైల్ మార్చాడు. సమ్మర్ లుక్ కోసం తన కర్ల్స్‌ను కత్తిరించాడు. సైన్స్ ఫిక్షన్ ఇతిహాసం కల్కిని పెద్ద స్క్రీన్‌పై ప్రదర్శించడానికి కేవలం ఒక వారం మాత్రమే మిగిలి ఉన్నందున ప్రభాస్ ప్రచారం కోసం ముంబైలో అడుగుపెట్టాడు. తన భద్రతా బృందంతో ముంబై విమానాశ్రయంలో కనిపించాడు. కల్కిలో తన పాత్ర కోసం పొడవాటి కేశాలంకరణతో కనిపించిన ప్రభాస్ విమానాశ్రయంలో పొట్టి సమ్మర్ కేశాలంకరణతో కనిపించాడు. రించాడు. ప్రభాస్ ఎప్పుడూ రిలాక్స్ డ్ గా కనిపిస్తాడు. అతడు టీషర్ట్.. బ్యాగీ ప్యాంట్ ధరించి.. సౌకర్యవంతమైన స్వెట్‌షర్ట్‌ను తొడుక్కున్నాడు. సొగసైన సన్ గ్లాసెస్ గడ్డంతో షోమ్యాన్ లా ఉన్నాడు. అతడి కొత్త లుక్ అభిమానులలో ఉత్సాహం రేకెత్తించింది.
జూన్ 27 న ఈ సినిమా విడుదల కానుంది. ఇందులో దీపికా పదుకొణె, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ మరియు దిశా పటానీ కీలక పాత్రలు పోషించారు.