ప్రభాస్.. ఈసారి మిస్సయినా ఆ తరువాత మాత్రం పక్కా..

ఏడాదికి తప్పనిసరిగా రెండేసి సినిమాలని ప్రేక్షకుల ముందుకి తీసుకొని వస్తానని ప్రభాస్ గత ఏడాది ఓ క్లారిటీ ఇచ్చాడు.

Update: 2024-07-31 08:30 GMT

ఏడాదికి తప్పనిసరిగా రెండేసి సినిమాలని ప్రేక్షకుల ముందుకి తీసుకొని వస్తానని ప్రభాస్ గత ఏడాది ఓ క్లారిటీ ఇచ్చాడు. అనుకున్నట్లే 202లో ఆదిపురుష్, సలార్ సినిమాలు థియేటర్స్ లోకి వచ్చాయి. వీటిలో సలార్ మూవీ సూపర్ హిట్ అయ్యింది. అయితే 2024లో మాత్రం ప్రభాస్ నుంచి రెండు సినిమాలు రిలీజ్ లేనట్లే అని చెప్పాలి. కల్కి 2898ఏడీ మూవీ జూన్ లో ప్రేక్షకుల ముందుకొచ్చి బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. దీని తర్వాత ది రాజాసాబ్ మూవీని డిసెంబర్ లో రిలీజ్ చేస్తారని అందరూ భావించారు.

అయితే ది రాజాసాబ్ మూవీ 2025 ఏప్రిల్ 10న రిలీజ్ కాబోతోంది. ఈ సినిమా షూటింగ్ ఇంకా చాలా వరకు పెండింగ్ లో ఉంది. అలాగే విజువల్ ఎఫెక్ట్స్ వర్క్ కూడా ఈ చిత్రానికి ఎక్కువగానే ఉండబోతోందంట. కల్కి మూవీ సక్సెస్ తో ది రాజాసాబ్ చిత్రమైన ఎక్స్ పెక్టేషన్స్ పెరిగాయి. దానికి తగ్గట్లుగానే మారుతి పెర్ఫెక్ట్ గా మూవీని తెరకెక్కిస్తున్నారు. అందుకే రిలీజ్ 2025కి వెళ్ళిపోయింది. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కబోయే సలార్ 2 మూవీ 2025 ఆఖరులో ప్రేక్షకుల ముందుకి రావొచ్చని టాక్ వినిపిస్తోంది.

అంటే 2025లో ది రాజాసాబ్ తో పాటు సలార్ పార్ట్ 2ని కూడా ప్రేక్షకులు చూసే ఛాన్స్ దొరకనుంది. హను రాఘవపూడి దర్శకత్వంలో ప్రభాస్ చేయబోయే కొత్త సినిమా ప్రారంభోత్సవం ఆగష్టు 22న జరగనుందని తెలుస్తోంది. సెప్టెంబర్ నుంచి రెగ్యులర్ మూవీ షూటింగ్ స్టార్ట్ కావొచ్చని టాక్ వినిపిస్తోంది. ఫౌజీ టైటిల్ తో తెరకెక్కబోతున్న ఈ సినిమాని 2026 ఆరంభంలో రిలీజ్ చేయాలని హను రాఘవపూడి అనుకుంటున్నారంట.

సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో స్పిరిట్ మూవీని ఈ ఏడాది ఆఖరులో లేదంటే వచ్చే ఏడాది ఆరంభంలో స్టార్ట్ చేసే ఛాన్స్ ఉంది. ఈ సినిమా కూడా 2026 ఆఖరులో లేదంటే 2027లో ప్రేక్షకుల ముందుకి రావొచ్చు. ఇవన్నీ కంప్లీట్ అయ్యాక 2028లో కల్కి 2898 పార్ట్ 2 సినిమాని తీసుకురావొచ్చనే మాట వినిపిస్తోంది. వచ్చే ఏడాది స్టార్ట్ చేసిన కూడా రిలీజ్ కి కనీసం మూడేళ్లు పడుతుందని అంచనా వేస్తున్నారు.

ఈ ఏడాది డార్లింగ్ ప్రభాస్ 2 సినిమాలతో ప్రేక్షకుల ముందుకి రాలేకపోయారు. అయితే 2025, 2026లో మాత్రం కరెక్ట్ గా లైన్ లో ఏడాదికి రెండు సినిమాలు రిలీజ్ అయ్యేలా ప్లానింగ్ చేసుకున్నారని తెలుస్తోంది. కల్కి పార్ట్ 2 మూవీ రిలీజ్ నాటికి మరో సినిమాని డార్లింగ్ ప్రభాస్ పూర్తి చేసే ఛాన్స్ ఉందని సినీ విశ్లేషకులు అంటున్నారు.

Tags:    

Similar News