సలార్ తెలుగు డీల్స్ ఇంకా పెండింగ్?
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న మూవీ సలార్
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న మూవీ సలార్. ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ప్రస్తుతం శరవేగంగా సాగుతోంది సెప్టెంబర్ 28న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కాబోతోంది. ఇండియాలో ఐదు భాషలతో పాటుగా ఇంగ్లీష్ లో కూడా ఈ చిత్రాన్ని విదేశాలలో రిలీజ్ చేయడానికి ప్రశాంత్ నీల్ ప్లాన్ చేస్తున్నారు. డానికి సంబందించిన వర్క్ జరుగుతుందని తెలుస్తోంది.
ఇక రిలీజ్ దగ్గర పడుతున్న ఇంకా మూవీ ట్రైలర్ రిలీజ్ చేయకపోవడంతో డార్లింగ్ ఫ్యాన్స్ ప్రశాంత్ నీల్ పై చాలా గుర్రుగా ఉన్నారు. అయితే తాజాగా ఓ షాకింగ్ న్యూస్ సోషల్ మీడియాలో వినిపిస్తోంది. ఈ సినిమాకి తెలుగు రిలీజ్ రైట్స్ ఇంకా అమ్ముడుపోలేదంట. హోంబలే ఫిలిమ్స్ నిర్మాత విజయ్ కిరంగదూర్ సినిమా తెలుగు రైట్స్ పై భారీగా డిమాండ్ చేస్తున్నారంట.
ఆదిపురుష్ తెలుగు రైట్స్ 185 కోట్లకి పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ కొనుగోలు చేసింది. పెద్దగా బజ్ లేకపోయిన ఆ చిత్రం హక్కులు భారీ ధరకి అమ్ముడయ్యాయి. దీంతో సలార్ సినిమాపై నిర్మాత అంతకు మించి ఎక్స్ పెక్ట్ చేస్తున్నారంట. అయితే డార్లింగ్ నుంచి రాధేశ్యామ్, సాహో, ఆదిపురుష్ సినిమాలు మూడు డిస్టిబ్యూటర్స్ ని కమర్షియల్ గా దెబ్బతీశాయి.
దీంతో సలార్ చిత్రంపై భారీగా పెట్టుబడి పెట్టడానికి ముందుకి రావడం లేదంట. 150 కోట్ల లోపే తెలుగు రైట్స్ అడుగుతున్నారని ఇండస్ట్రీ వర్గాలలో వినిపిస్తోన్న మాట.. నిర్మాత ఇంత తక్కువ మొత్తానికి ఇవ్వడానికి సిద్ధంగా లేకపోవడంతో డీల్ ఇంకా ఫైనల్ కాలేదని తెలుస్తోంది. యూవీ క్రియేషన్స్ కూడా రిస్క్ చేసి ఈ సినిమాని కొనడానికి ప్రయత్నం చేయడం లేదని టాక్.
ఈ నేపథ్యంలో ఒక్క తెలుగు రైట్స్ తప్ప అన్ని కూడా అమ్ముడైపోయాయని సమాచారం. ఓ వైపు రిలీజ్ డేట్ దగ్గర పడుతూ ఉండటం, మరో వైపు తెలుగు రిలీజ్ హక్కులకి సంబంధించిన డీల్స్ క్లోజ్ కాకపోవడం ఫ్యాన్స్ ని కొంత కలవరపెడుతుందని చెప్పొచ్చు. మరి సలార్ టీం వీటిపై ఎలాంటి క్లారిటీ ఇస్తారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.