సలార్: తాడిని తన్నేవాడొకడొస్తే.. తలదన్నేవాడొకడొస్తాడు!
ఆసక్తికరంగా కేజీఎఫ్ సినిమాలో ఇంటర్వెల్ బ్యాంగ్ కి ముందు నుంచే హీరో విరోచితపోరాటాల్ని చూపిస్తే సలార్ లో మాత్రం ఇంటర్వెల్ ముందు హీరో గ్రాండ్ ఎంట్రీ ఇస్తారని తెలుస్తోంది
సలాం రాఖీభాయ్ అంటూ కేజీఎఫ్‌లో మాఫియా అనుచరగణం భాయ్ దెబ్బకు గడగడలాడుతుంటే .. నిజంగానే రాఖీభాయ్ సూపర్ పవర్ ఎలాంటిదో అర్థమైంది. కోలార్ బంగారు గనుల తవ్వకంలో ఒకడిని మించి ఒకడుగా డాన్ లు బయటపడుతుంటారు. తాడిని తన్నేవాడొకడొస్తే వాడి తలదన్నేవాడు ఇంకొకడు వస్తాడు! అన్నట్టుగా డాన్ లను ఒక్కొక్కరిని ప్రశాంత్ నీల్ తెరపై పరిచయం చేసే విధానం ఉద్విగ్నతను కలిగిస్తుంది. కేజీఎఫ్ లో ఒకరిని మించి ఒకరుగా రౌడీల్ని గూండాల్ని మాఫియా అనుచరగణాల్ని పరిచయం చేస్తూ తెరపై రక్తి కట్టించడంలో ప్రశాంత్ నీల్ పెద్ద విజయం సాధించాడు.
ఇప్పుడు కేజీఎఫ్ ఫ్రాంఛైజీని మించేలా ప్రభాస్ తో 'సలార్' చిత్రాన్ని తెరకెక్కిస్తున్నానని ప్రశాంత్ నీల్ అన్నారు. అయితే ఇందులో విలనిజం ఏ స్థాయిలో పండింది? అన్నది ఆరా తీస్తే.. సినిమా ఆద్యంతం వరదరాజ మన్నార్ గా పృథ్వీరాజ్ విలనీ భయానక భీభత్స రసాన్ని పండిస్తుందని చెబుతున్నారు. వరదరాజులు అత్యంత క్రూరుడిగా హింసాసురుడిగా కనిపిస్తాడు. అయితే అతడి తండ్రి రాజమన్నార్ పాత్ర కూడా ఎంతో కీలకమైనది. రాజమన్నార్ గా జగపతి బాబు కనిపిస్తారు. అయితే సలార్ - సీజ్ ఫైర్ లో మాత్రం జగపతిబాబు పాత్ర పరిమితంగా మాత్రమే కనిపిస్తుంది. కానీ 75శాతం కథను నడిపించేవాడిగా వరదరాజ మన్నార్ పాత్రను తీర్చిదిద్దారని కూడా గుసగుసలు వినిపిస్తున్నాయ్. ఇక రెండో భాగంలో మాత్రం జగపతిబాబు పాత్రకు ప్రాధాన్యత ఉంది.
ఇంటర్వెల్ ముందు ట్విస్టు:
ఆసక్తికరంగా కేజీఎఫ్ సినిమాలో ఇంటర్వెల్ బ్యాంగ్ కి ముందు నుంచే హీరో విరోచితపోరాటాల్ని చూపిస్తే సలార్ లో మాత్రం ఇంటర్వెల్ ముందు హీరో గ్రాండ్ ఎంట్రీ ఇస్తారని తెలుస్తోంది. ప్రభాస్ ఒక భారీ యాక్షన్ ఎపిసోడ్ తో జురాసిక్ పార్క్ లో డైనోసార్ లా విలన్ల గుంపు మీద పడతాడట. విలన్లను డీకొడుతూ మైండ్ బ్లాంక్ చేస్తాడట. ఆ తర్వాత సినిమా ఆద్యంతం పీక్స్ కి చేరిపోతుందని ప్రభాస్ అభిమానులు మునుపెన్నడూ చూడని యాక్షన్ ఎపిసోడ్స్ ని వీక్షిస్తూ కుర్చీ అంచుకు అతుక్కుపోతారని కూడా చెబుతున్నారు. ఇక మొదటి భాగంలో ప్రభాస్ వర్సెస్ పృథ్వీరాజ్ సుకుమారన్ పోరాటాలు రక్తి కట్టిస్తాయి. కానీ రెండో భాగంలో మాత్రం జగపతిబాబు వీరత్వం బయటపడుతుంది. అతడితో ప్రభాస్ పోరాటాలు మరో లెవల్లో సాగుతాయని చెబుతున్నారు.
ట్రైలర్ రిలీజ్ ఎప్పుడు?
సెప్టెంబర్ 3న లేదా ఒకటో వారంలో సలార్ ట్రైలర్ ని రిలీజ్ చేసేందుకు ప్రశాంత్ నీల్ బృందం సన్నాహకాల్లో ఉన్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. టీజర్ తో వచ్చిన హైప్ ని ట్రైలర్ పదింతలు పరాకాష్ఠకు చేరుస్తుందని నమ్ముతున్నారు. టీజర్ లో కథ రివీల్ కాలేదు. కానీ ట్రైలర్ లో అసలు కథ ఏమిటి? మ్యాటర్ ఎంత ఉంది? అన్నది కూడా రివీలైపోతుందని చెబుతున్నారు.
మోస్ట్ అవైటెడ్ సలార్ 28 సెప్టెంబర్ 2023న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతోంది. ఇందులో శ్రుతిహాసన్ కథానాయికగా నటిస్తోంది. ఈ చిత్రాన్ని తెలుగు-తమిళం-హిందీ-కన్నడం-మలయాళంలో విడుదల చేయనున్నారు. ఆంగ్ల భాషలోను విడుదల చేస్తారని గుసగుసలు వినిపించాయి.