సలార్ ని టైగర్ ఆపలేదు కానీ ఇదొక్కటే ఆపగలదు
పైన పటారం.. లోన లొటారం అంటే ఇదేనేమో! సలార్ వాయిదా తర్వాత ప్రచారం ఇలానే ఉంది!
పైన పటారం.. లోన లొటారం అంటే ఇదేనేమో! సలార్ వాయిదా తర్వాత ప్రచారం ఇలానే ఉంది! మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా మూవీ సలార్ వాయిదా పడగానే చాలా మంది టైగర్ 3 పైకి నెపం నెట్టారు. సల్మాన్ భాయ్ కి ఎదురెళ్లే ధైర్యం లేకే ఇలా చేశాడు ప్రభాస్ అంటూ అభిమానులు నిరాశపడినట్టు కూడా వార్తా కథనాలు వెలువడ్దాయి. అయితే ఇదేమైనా లాజిక్ కి అందనిదా? అంటే అలాంటిదేమీ లేదు. టైగర్ 3 కి ఈ వాయిదాతో ఎలాంటి సంబంధం లేదు. అంతకుమించిన పెద్ద కారణమే `సలార్`ని నిలువరించిందని టాక్ ఉంది.
నిజానికి 2023 మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా మూవీ సలార్ వాయిదా వెనక అసలైన కారణమేమిటి? అంటే... సలార్ కి పంపిణీదారులతోనే పెద్ద చిక్కులు వచ్చాయని కూడా గుసగుసలు వినిపిస్తున్నాయి. మేకర్స్ అధిక ధరలను కోట్ చేయడంతో ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు అసంతృప్తిగా ఉన్నారు. తెలుగు సర్క్యూట్‌లోని థియేటర్ యజమానులు ఈ చిత్రాన్ని ఇంత భారీ ధరలకు కొనడానికి ఇష్టపడలేదు. సలార్ బృందం ఈ ఒప్పందాలపై ఇంకా చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ఈ కారణంగానే సినిమా వాయిదా పడిందని భావిస్తున్నారు. సలార్ ఇప్పుడు నవంబర్ 2023లో విడుదల కానుందన్న ప్రచారం తెరపైకి వచ్చింది. కానీ దానికి ఇంకా అధికారిక ధృవీకరణ లేదు.
సల్మాన్ ఖాన్ టైగర్ 3 కారణమా? అంటే అలాంటిదేమీ లేదని కూడా విశ్లేషిస్తున్నారు. సల్మాన్ సినిమాతో పోటీపడుతూ రిలీజ్ కావడం సలార్ కి ఇష్టం లేదంటూ మరో ప్రచారం ఉన్నా కానీ అదేమీ నిజం కాదని కూడా చాలా స్పష్ఠంగా అర్థమవుతోంది. ప్రభాస్ ఇప్పటికే పాన్ ఇండియా స్టార్.. అందువల్ల సల్మాన్ భాయ్ కి వెన్ను చూపే ప్రసక్తే లేదు. సల్మాన్ కి ఇంకా తెలుగు మార్కెట్లో పట్టు చిక్కలేదేమో కానీ ప్రభాస్ హిందీ మార్కెట్ ని దున్నేస్తున్నాడనేది అందరికీ తెలిసిన సత్యం. అందుకే సల్మాన్ కంటే ఎక్కువ ఆశావహంగా ప్రభాస్ కనిపిస్తున్నాడు. పైగా కేజీఎఫ్ - కేజీఎఫ్ 2తో సంచలనాలు సృష్టించిన ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన సినిమాగా సలార్ కి ఉత్తరాదిన బోలెడంత క్రేజ్ నెలకొంది. టైగర్ 3 కంటే సలార్ కోసమే ఎక్కువ ఆసక్తిగా వేచి చూస్తోంది ఉత్తరాది. ఇలాంటి సమయలో టైగర్ 3 కి భయపడి ప్రభాస్ సినిమాని వాయిదా వేయడం అన్నది జరగదు అని కూడా చాలా మంది విశ్లేషిస్తున్నారు.
జవాన్ కోసమే ఈ వాయిదా?
జవాన్ తర్వాత సెప్టెంబర్ లో ప్రేక్షకులు ఎదురు చూస్తున్న సలార్ అనూహ్యంగా వాయిదా పడడంపై రకరకాల సందేహాలు వ్యక్తం కాగా.. ఒక కొత్త థియరీ అందరి దృష్టిని ఆకర్షించింది. దేశవ్యాప్తంగా అభిమానించే పాన్-ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన సలార్ నిర్మాణానంతర పనులు పూర్తి కాలేదనే కారణంతో వాయిదా పడిందని ఒక సెక్షన్ ప్రచారం చేసింది. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్‌ను హోంబలే ఫిలింస్ నిర్మిస్తోంది. కొన్ని సోషల్ మీడియాల వివరాల ప్రకారం ఈ చిత్రం KGF యూనివర్స్‌లో భాగమనే పుకారు షికార్ చేస్తోంది. సలార్ విడుదలను వాయిదా వేయాలని మేకర్స్ నిర్ణయించుకోవడానికి కారణం జవాన్ అని చాలా మంది భావించారు. షారుఖ్ ఖాన్ సినిమాకి మాస్ - క్లాస్య ఇరువర్గాల నుండి హిస్టీరికల్ రెస్పాన్స్ వచ్చింది. ఈ స్థాయిలో కలెక్షన్లు వస్తే త్వరలోనే పఠాన్‌ను క్రాస్ చేస్తుంది. జవాన్ తుఫాన్ కి సలార్ ఎదురెళ్లడం సరికాదని ఈ నిర్ణయం తీసుకున్నారని కూడా టాక్ ఉంది. కానీ ఈ కారణం ఏవిధంగాను సహేతుకంగా లేదు.