ప్రభాస్, యశ్.. తప్పుగా అర్థం చేసుకుంటే ఎలా?
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కిన ఈ మూవీ ప్రమోషన్స్ ను భారీ స్థాయిలో నిర్వహించని ప్రశాంత్ నీల్.. కొన్ని ఇంటర్వ్యూలు మాత్రమే ఇస్తున్నారు.
కన్నడ దర్శకుడు ప్రశాంత్ నీల్ తీసింది మూడు సినిమాలే అయినా ఇప్పుడు నేషనల్ వైడ్ స్టార్ డైరెక్టర్. మొదటి సినిమా ఉగ్రంతో కన్నడలో మంచి విజయం సాధించి.. ఆ తర్వాత కేజీఎఫ్ రెండు పార్ట్ లతో ప్రపంచ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు. ఇప్పుడు సలార్ సినిమాతో రాబోతున్నారు ప్రశాంత్ నీల్.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కిన ఈ మూవీ ప్రమోషన్స్ ను భారీ స్థాయిలో నిర్వహించని ప్రశాంత్ నీల్.. కొన్ని ఇంటర్వ్యూలు మాత్రమే ఇస్తున్నారు. తాజాగా ఓ యూట్యూబ్ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. కేజీఎఫ్ యూనివర్స్ కు సలార్ కు ఎలాంటి కనెక్షన్ లేదని క్లారిటీ ఇచ్చారు.
అయితే ఈ ఇంటర్వ్యూలోని ఓ చిన్న వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. స్టార్ హీరోలు ప్రభాస్, యశ్ ను ప్రశాంత్ నీల్ అవమానించారని కొందరు వ్యక్తులు ఆ వీడియోను షేర్ చేస్తున్నారు. అసలు విషయం అది కాదని మరో వీడియోతో బదులిస్తున్నారు ప్రభాస్ ఫ్యాన్స్. అసలేమైందంటే
ఆ ఇంటర్వ్యూలో జర్నలిస్ట్.. స్టార్ స్టేటస్ సాధించని టాలెంటెడ్ యాక్టర్స్ తో భారీ సినిమాలు తీయడం సాధ్యమేనా అని ప్రశాంత్ నీల్ కు ప్రశ్నించారు. అయితే స్టార్ స్టేటస్ లేకున్నా నటీనటులతో విజయవంతమైన సినిమాలు తీయవచ్చని నీల్ చెప్పారు. అందుకు కేజీఎఫ్, బాహుబలి సినిమాలే ఉదాహరణ అని చెప్పారు. ఈ చిన్న వీడియో బిట్ ను షేర్ చేస్తున్న కొందరు నెటిజన్లు.. యశ్, ప్రభాస్ లను నీల్ అవమానించారని ట్వీట్ల్ చేస్తున్నారు.
నిజానికి.. మొత్తం వీడియో చూస్తే అసలు విషయం అర్థమవుతుంది. కేజీఎఫ్, బాహుబలి చిత్రాలే ఉదహరణ అని చెప్పిన ప్రశాంత్ నీల్ మరో విషయం కూడా చెప్పారు. ఆ రెండు సినిమాలు తెరకెక్కినప్పుడు యశ్, ప్రభాస్ లు కేవలం కన్నడ, తెలుగు ఇండస్ట్రీలోనే ఫేమస్ అని తెలిపారు. ఆ మూవీల సమయంలో నేషనల్ వైడ్ గా వారికి గుర్తింపు లేదని తెలిపారు.
అయితే ఎడిటెడ్ వీడియోలతో ఇలా తప్పుడు ప్రచారం చేయడం కరెక్ట్ కాదని కొందరు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. సినిమా రిలీజ్ కు ముందు ఇలా తప్పుదోవ పట్టించే వీడియోలను షేర్ చేయొద్దని ప్రభాస్ ఫ్యాన్స్ రిక్వెస్ట్ చేస్తున్నారు. డిసెంబర్ 22వ తేదీన సలార్ ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా ప్రీ బుకింగ్స్ జోరుగా సాగుతున్నాయి.