ప్రగతి కొత్త అవతారం.. ఫ్యాన్స్ కి షాకిచ్చేసిందిగా...!

తాజాగా ఆమె మరోసారి ఫ్యాన్స్ కి ఊహించని షాక్ ఇచ్చారు. ఇప్పటి వరకు ఆమె వ్యాయామాలు మాత్రమే చేస్తుందని అనుకున్నారు.

Update: 2023-07-19 10:37 GMT

టాలీవుడ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ ప్రగతి అందరికీ పరిచయమే. ఆమె తెలుగు లో చాలా సినిమాల్లో నటించారు. స్టార్ హీరోల కు తల్లిగా, అత్తగా ఎన్నో మంచి పాత్రల్లో నటించి మెప్పిస్తుంది. తల్లి పాత్ర అంటే ఎక్కువగా ఆమె గుర్తుకు వచ్చేవారు. చాలా మంది స్టార్ హీరో, హీరోయిన్లతో కలిసి నటించారు. మొదట చాలా మందికి ఆమె నటి గా మాత్రమే తెలుసు.

ఆ తరవాత ఆమె సోషల్ మీడియా లో యాక్టివ్ అవ్వడం మొదలుపెట్టారు. యూట్యూబ్ లో వీడియోలు చేసి, అభిమానుల ను సంపాదించుకోవడం మొదలుపెట్టారు. ఆమె తన యూట్యూబ్ లో తన పర్సనల్ విషయాలు, తన కలెక్షన్ చూపిస్తూ ఉంటారు. కాగా, ప్రగతి తాను ఫిట్నెస్ లోనూ ఏ మాత్రం తక్కువ కాదు అని గతం లోనే నిరూపించారు. జిమ్ లో కసరత్తులు చేస్తున్న ఫోటోలు, వీడియోలు షేర్ చేసి ఔరా అనిపించారు.

అయితే, తాజాగా ఆమె మరోసారి ఫ్యాన్స్ కి ఊహించని షాక్ ఇచ్చారు. ఇప్పటి వరకు ఆమె వ్యాయామాలు మాత్రమే చేస్తుందని అనుకున్నారు. కానీ, బరువులు కూడా ఎత్తడం మొదలుపెట్టారు. పవర్ లిఫ్టర్ గా మారిపోయింది. అందుకు సంబందించిన వీడియో ఒకటి ఆమె షేర్ చేయగా, అది వైరల్ గా మారింది.

దానికి ఆమె ఓ క్యాప్షన్ కూడా ఇచ్చారు. రెండు నెలల క్రితం నా జీవితం ఇలా మలుపు తిరుగుతుందని అస్సలు ఊహించలేదన్నారు. పవర్ లిఫ్టింగ్‌ లో ఇది తన కొత్త ప్రయాణమ ని చెప్పారు.. రెండు నెలల క్రితం ఈ జర్నీ మొదలుపెట్టాన ని, దీని ని పూర్తి చేసి తీరతానని చెప్పారు. ప్రస్తుతం తన స్కోరు 250 అని, అయితే టార్గెట్ చాలా పెద్దదే, అయినా దాన్ని చేరేవరకు ప్రయత్నిస్తాను అని చెప్పడం విశేషం.

ఈ వీడియో ని షేర్ చేసిన ఆమె పవర్ లిఫ్టింగ్ వైపు తనను ప్రోత్సహించిన వారికి కృతజ్ఞతలు చెబుతూ కొందరిని ట్యాగ్ చేయడం విశేషం. ఇక, ఈ వీడియో చూసిన నెటిజన్లు మొదట షాకైనా, తర్వాత ఆమెకు ఆల్ ది బెస్ట్ చెబుతుండటం విశేషం.

Tags:    

Similar News