'అఖండ 2'లో ఈ భామకు ఛాన్స్?
ఈసారి సాంప్రదాయ లెహంగా ధరించిన ప్రగ్య పాక్షికంగా అందాలను ఎర వేసే స్లీకీ బ్లౌజ్లో మత్తెక్కించింది.
'కంచె' బ్యూటీ ప్రగ్యా జైస్వాల్ బోల్డ్ ఫ్యాషన్ ఎంపికలు ఎప్పుడూ ఆశ్చర్యపరుస్తాయి. ట్రెడిషనల్ లుక్ లోను హా* కంటెంట్‌ని అందించడంలో ప్రగ్య ప్రత్యేకత వేరు. ఇటీవల లోదుస్తుల బ్రాండ్ల ప్రచారంలో స్పీడ్ పెంచిన ప్రగ్య, కెల్విన్ క్లెయిన్ లాంటి పాపులర్ బ్రాండ్ కి ప్రచారం చేసింది. ప్రతిసారీ ప్రగ్య బోల్డ్ ఫోటోషూట్లు అంతర్జాలంలో సంచలనంగా మారాయి.
కానీ ఇప్పుడు దీపావళి పండుగను పురస్కరించుకుని ప్రగ్య ఫ్యాషన్ ఎంపికలు హాట్ టాపిక్ గా మారాయి. ఇటీవలే తన స్నేహితురాళ్లు రకుల్ ప్రీత్ సింగ్, మంచు లక్ష్మితో కలిసి దీపావళి పార్టీలో సందడి చేసింది ప్రగ్య. ముంబైలో జరిగిన ఈ పార్టీలో స్నేహితులంతా ఫుల్‌గా చిల్ అయ్యారు. పార్టీ నుంచి ప్రగ్య ట్రెడిషనల్ అవతార్ కి సంబంధించిన ఫోటోలు వైరల్ అయ్యాయి.
ఇంతలోనే ఇప్పుడు మరో కొత్త లుక్ తో అభిమానుల ముందుకు వచ్చింది. ఈసారి సాంప్రదాయ లెహంగా ధరించిన ప్రగ్య పాక్షికంగా అందాలను ఎర వేసే స్లీకీ బ్లౌజ్లో మత్తెక్కించింది. తుహినా శ్రీవాస్తవ రూపొందించిన అద్భుతమైన ఆకుపచ్చ రంగు దుస్తులు మంత్రముగ్ధులను చేస్తున్నాయి. ఎంపిక చేసుకున్న దుస్తులకు తగ్గట్టుగా డిజైనర్ ఆభరణాలు అంతే ఆకట్టుకున్నాయి. ప్రగ్య అందమైన స్మైల్, ఆహార్యం యువతరాన్ని క్లీన్ బౌల్డ్ చేస్తున్నాయి.
ఇటీవల ప్రగ్య ముదస్సర్ అజీజ్ దర్శకత్వం వహించిన 'ఖేల్ ఖేల్ మే' అనే కామెడీ డ్రామాలో గ్లామరస్ క్వీన్ పాత్రలో కనిపించింది. ఈ చిత్రంలో అక్షయ్ కుమార్, తాప్సీ పన్ను, వాణి కపూర్, ఫర్దీన్ ఖాన్, అమ్మీ విర్క్, ఆదిత్య సీల్ సహ తారాగణం. ఈ సినిమా తర్వాత ప్రగ్య ఎన్బీకే 109లో నటిస్తోందని, 'అఖండ 2'లోను బోయపాటి అవకాశం కల్పిస్తున్నారని ప్రచారమవుతోంది. కానీ దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.