వీడియో: ఫ్యాన్స్ మ‌ర్చిపోకుండా ప్ర‌గ్యా ట్రిక్కు

ఇంత‌కీ కంచె బ్యూటీ ప్ర‌గ్యా జైశ్వాల్ ఏమైంది? ఆడిన‌న్నాళ్లు ఆడింది.. కానీ ఇప్పుడు టిటౌన్ లో క‌నిపించ‌డం లేదు

Update: 2023-11-09 15:51 GMT

ఇంత‌కీ కంచె బ్యూటీ ప్ర‌గ్యా జైశ్వాల్ ఏమైంది? ఆడిన‌న్నాళ్లు ఆడింది.. కానీ ఇప్పుడు టిటౌన్ లో క‌నిపించ‌డం లేదు. ఎక్క‌డ ఏం ఆడుతోందో కూడా తెలీదు! అంటూ టాలీవుడ్ కుర్రాళ్లు ఆట ప‌ట్టిస్తున్నారు ప్ర‌గ్యాని. కంచె లాంటి హిట్ సినిమాలో న‌టించినా బాల‌య్య స‌ర‌స‌న అవ‌కాశం ద‌క్కించుకున్నా కానీ ఈ భామ ఫేట్ మార‌లేదు. త‌న‌కు ల‌క్ ఫేవ‌ర్ చేయ‌లేదు. అందుకే ఇటీవ‌ల తెలుగు ప‌రిశ్ర‌మ నుంచి ఈ భామ దూర‌మైంది.


అయితే సినిమాలు చేయ‌కున్నా కానీ, ప్ర‌గ్య నిరంత‌రం వేడెక్కించే ఫోటోషూట్ల‌ను షేర్ చేస్తూ సోష‌ల్ మీడియాల్లో అభిమానులకు ట‌చ్ లో ఉంది. తాజాగా వైట్ బ్లేజ‌ర్ లో టాప్ లెస్ ఫోజుల‌తో షేక్ చేసిన ఫోటోషూట్ వీడియో ఇంట‌ర్నెట్ ని షేక్ చేస్తోంది. బ్లేజ‌ర్ కి త‌గ్గ‌ట్టుగా ఆ బాట‌మ్ వెరైటీగా షార్ట్ లుక్ తో క‌నిపించ‌డంతో ఏదో సంథింగ్ స్పెష‌ల్ గా ట్రై చేసింద‌ని అభిమానుల‌కు అర్థ‌మ‌వుతోంది. ఒక‌వేళ మీరు మ‌ర్చిపోతే.. ! అంటూ సస్పెన్స్ క్యాప్ష‌న్ ని ఈ ఫోటోకి జోడించింది. అయితే సీకే బ్యూటీ ప్ర‌గ్య‌ను అంత తేలిగ్గా మ‌ర్చిపోలేం అంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.

ప్ర‌గ్య జైశ్వాల్ 2014లో సినీ అరంగేట్రం చేసినప్పటి కెరీర్ ప‌రంగా ఆశించిన స్థాయికి ఎదుగ‌లేదు. మోహన్ బాబు -నందమూరి బాలకృష్ణ వంటి స్టార్ల‌తో పనిచేసినా ఇదీ క‌లిసి రాలేదు. అయితే ఫ్యాష‌నిస్టాగా అనుచరుల అంచనాలను అందుకోవడంలో ఎప్పుడూ విఫలం కాలేదు. తాజాగా వైట్ అండ్ వైట్ లో కొత్త లుక్ తో ఆక‌ట్టుకుంది. దీనికి ముందు, ప్రగ్యా సాంప్రదాయ దసరా లుక్‌తో తన అనుచరులను మెస్మరైజ్ చేసింది.

ప్రగ్యా జైస్వాల్ 2014లో తమిళ చిత్రం విరాట్టులో తొలిసారిగా నటించింది. మరుసటి సంవత్సరం తెలుగు సినీప‌రిశ్ర‌మ‌లోకి ప్రవేశించింది. మిర్చి లాంటి కుర్రాడులో నటించింది. క్రిష్ దర్శకత్వం వహించిన పీరియాడికల్ డ్రామా కంచెలో తన పాత్రకు గుర్తింపు పొందింది. ఆసక్తికరంగా తొలిగా క్రిష్ `గబ్బర్ ఈజ్ బ్యాక్` కోసం ఆడిషన్ లో పాల్గొంది. కానీ ఆ పాత్రను దక్కించుకోలేకపోయింది. తర్వాత కంచెలో నటించింది. ఆ త‌ర్వాత‌ జయ జానకి నాయకలో అతిధి పాత్రలో కనిపించింది. భక్తిరస జీవిత చరిత్ర చిత్రం ఓం నమో వేంకటేశాయ (2017)లో ఆనందం పాటలో కనిపించింది. ప్రగ్యా జైస్వాల్ ఇటీవలి ఎన్బీకే అఖండలో న‌టించింది. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా సుమారుగా రూ. 133 కోట్ల గ్రాస్ వ‌సూలు చేసింది.

Tags:    

Similar News