ప్రశాంత్ వర్మ మహాకాళి.. తొలి సూపర్ హీరోయిన్ వచ్చేసింది

ఇక భారతదేశపు తొలి మహిళా సూపర్ హీరోయిన్ గా నిలిచే "మహాకాళి" పేరుతో రూపొందుతోంది.

Update: 2024-10-10 05:19 GMT

ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ (PVCU) నుండి వచ్చిన తొలి చిత్రం "హనుమాన్" పాన్ ఇండియా బ్లాక్‌బస్టర్ గా నిలిచిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ క్రియేటివ్ డైరెక్టర్ PVCU నుండి మూడవ ప్రాజెక్ట్‌ను ప్రకటించారు. ప్రొడ్యూసర్ రివాజ్ రమేష్ డుగ్గల్ RKD స్టూడియోస్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. RK డుగ్గల్ ప్రెజెంటర్ గా వ్యవహరిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ ద్వారా RKD స్టూడియోస్ నిర్మాణ రంగంలోకి రాబోతోంది.

 

ఈ చిత్రానికి ప్రశాంత్ వర్మ కథ, స్క్రీన్ ప్లే అందిస్తుండగా, పూజా అపర్ణా కొల్లూరు అనే మహిళా దర్శకురాలు దర్శకత్వం వహిస్తున్నారు. ఇక భారతదేశపు తొలి మహిళా సూపర్ హీరోయిన్ గా నిలిచే "మహాకాళి" పేరుతో రూపొందుతోంది. ప్రత్యేకంగా, సాంప్రదాయాలకు, ఆధ్యాత్మికతకు అనుగుణంగా రూపుదిద్దుకునే ఈ చిత్రం సామాజిక అంశాలను స్పృశిస్తూ, ఆధునిక సమస్యలతో కూడిన కథా నేపథ్యాన్ని కలిగి ఉంటుందని మేకర్స్ తెలిపారు.

మహాకాళి కథ బెంగాల్ రాష్ట్రాన్ని ప్రధాన ప్రదేశంగా తీసుకుని సాగుతుంది. గడచిన సాంప్రదాయాలకు, దేవతా స్థాయికి చెందిన గొప్ప సంపదను వెండితెరపై చూపించే ఈ చిత్రం, సామాజికంగా సమకాలీనమైన అంశాలతో కూడిన భావోద్వేగ కథనంతో ముందుకు వస్తుంది. సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా రిలీజ్ అయ్యింది. ఆ పోస్టర్ లో ఒక పులితో ఒక అమ్మాయి కనిపిస్తుంది.

వెనుక భాగంలో గుడిసెలు, బంట్లు మరియు భయంతో పారిపోతున్న ప్రజలు, అందులోనే ఓ ఫెరిస్ వీల్ దగ్ధం అవుతున్నట్లు చూపించబడింది. టైటిల్ పోస్టర్ కూడా బెంగాలీ ఫాంట్ లో, నక్షత్రాకారంలో డిజైన్ చేయబడింది. ఈ పోస్టర్ సినిమాకు ఉన్న గాంభీర్యాన్ని వెల్లడిస్తుంది. "మహాకాళి" కేవలం ఒక సూపర్ హీరొయిన్ సినిమా మాత్రమే కాదు. ఇది భారతీయ సాంప్రదాయాల ప్రతీకగా నిలిచిన దేవతగా మహాకాళిని చూపిస్తూ, వివక్ష, అంతర్గత బలాన్ని మరియు ఆత్మగౌరవాన్ని సాధించుకునే కథగా రూపుదిద్దుకుంటుంది.

ఈ ప్రాజెక్టు ద్వారా మహిళల బలాన్ని, ఆత్మగౌరవాన్ని తెరపై చూపిస్తూ, వారి అసమానతను ప్రశ్నించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ కథలో తల్లి కాళి రౌద్రాన్ని మాత్రమే కాకుండా, ఆమె కరుణా స్వభావాన్ని కూడా చూపించబొతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు స్మరణ్ సాయి సంగీతం అందిస్తుండగా, శ్రీ నాగేంద్ర టంగాల ప్రొడక్షన్ డిజైనర్ గా వ్యవహరిస్తున్నారు. ఇతర నటీనటుల సమాచారం త్వరలో వెల్లడించనున్నారు. అలాగే "మహాకాళి" సినిమా ఐమ్యాక్స్ 3Dలో కూడా విడుదల కానుంది.

Full View
Tags:    

Similar News