'నీల్' మేకర్స్ పోటాపోటీ.. ఏం జరుగుతుందో?
దీంతో ఆయన కొత్త మూవీలపై అందరి దృష్టి పడింది.
కేజీఎఫ్, సలార్ మూవీలతో పాన్ ఇండియా లెవెల్ లో డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఎలాంటి క్రేజ్ సంపాదించుకున్నారో అందరికీ తెలిసిందే. ఈ రెండు చిత్రాలతో బాక్సాఫీస్ వద్ద అనేక రికార్డులు సృష్టించారు. కొత్త రికార్డులను క్రియేట్ కూడా చేశారు. ప్రశాంత్ నీల్ అంటే ఏంటనేది అందరికీ గుర్తుండేలా రెండు మూవీలనూ తెరకెక్కించారు. దీంతో ఆయన కొత్త మూవీలపై అందరి దృష్టి పడింది. ఆయన డైరెక్షన్ లో వచ్చే నెక్స్ట్ చిత్రం కోసం అంతా వెయిట్ చేస్తున్నారు.
ఇక ప్రశాంత్ నీల్ చేతిలో రెండు ప్రాజెక్టులు ఉన్న సంగతి తెలిసిందే. గత ఏడాది వచ్చిన సలార్ సీక్వెల్ తో పాటు ఎన్టీఆర్ 31 సినిమాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ రెండు సినిమాల్లో నీల్.. ఏది ముందు మొదలు పెడతారనేది సస్పెన్స్ గా మారింది. ఇటీవల సలార్-2 స్క్రిప్ట్ వర్క్ మొత్తం కంప్లీట్ అయిందని, మే చివరి వారం షూట్ స్టార్ట్ అవుద్దని వార్తలు వచ్చాయి. రామోజీ ఫిల్మ్ సిటీలో సెట్స్ వేశారని కూడా తెలిసింది.
ప్రభాస్, పృథ్వీరాజ్ సుకుమారన్ తో పాటు ప్రధాన తారాగణమంతా ఈ షెడ్యూల్ లో పాల్గొంటారని, 2024లో ఈ మూవీ విడుదల అవ్వనున్నట్లు కూడా టాక్ వినిపించింది. మరోవైపు, తారక్- నీల్ సినిమాకు సంబంధించి గత ఏడాది ఒక పోస్టర్ రిలీజ్ అవ్వగా సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఈ నెల 20వ తేదీన జూనియర్ ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా మరోసారి అనౌన్స్మెంట్ ఇచ్చి మోషన్ పోస్టర్ ను రిలీజ్ చేయాలని మేకర్స్ అనుకుంటున్నట్లు టాక్.
జులై మొదటి వారంలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభించమని NTR 31 నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్.. ప్రశాంత్ నీల్ ను కోరుతున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. అప్పటికి తారక్.. వార్-2 షూటింగ్ పార్ట్ ను కంప్లీట్ చేసుకుంటారని తెలుస్తోంది. అందుకే మేకర్స్.. ఇలా ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఇక హోంబలే ఫిల్మ్.. త్వరలో సలార్-2 అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇవ్వాలని ఫిక్స్ అయిందట. అలా షూటింగ్ కంటిన్యూ చేయాలని భావిస్తోందని సమాచారం.
మొత్తానికి అటు హోంబలే ఫిల్స్.. ఇటు మైత్రీ మూవీ మేకర్స్.. ప్రశాంత్ నీల్ తో చేయబోయే సినిమాల అనౌన్స్మెంట్స్ ఇవ్వడానికి పోటీ పడుతున్నాయన్నమాట. మే నెలలోనే ప్రకటనలు ఇవ్వడానికి రెడీ అయ్యాయి. ఇప్పుడు ఈ రెండు సినిమాల్లో ఏది ముందు సెట్స్ పైకి వెళ్లనుందోనని అంతా మాట్లాడుకుంటున్నారు. మరి ప్రశాంత్ నీల్ ఎలాంటి డెసిషన్ తీసుకున్నారో తెలియాలంటే మరికొద్ది రోజులు వెయిట్ చేస్తే చాలు!