ఫుట్‌బాల్ టీమ్‌పై స్టార్ హీరో భారీ పెట్టుబడులు
జూలై 11 గురువారం నాడు పృథ్వీరాజ్ తన సోషల్ మీడియా హ్యాండిల్స్‌లో జట్టు పేరు 'ఫోర్కా కొచ్చి ఎఫ్‌సి' అని ప్రకటించాడు.
మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ తన భార్య సుప్రియా మీనన్ కేరళ సూపర్ లీగ్ జట్టుకు సహ-యజమానులుగా కొనసాగుతామని ప్రకటించారు. పృథ్వీరాజ్ జట్టు అధికారిక పేరు కోసం సలహాలను కోరుతూ పబ్లిక్ పోస్ట్‌ను సోషల్ మీడియాల్లో షేర్ చేసారు. జూలై 11 గురువారం నాడు పృథ్వీరాజ్ తన సోషల్ మీడియా హ్యాండిల్స్‌లో జట్టు పేరు 'ఫోర్కా కొచ్చి ఎఫ్‌సి' అని ప్రకటించాడు.
ఫుట్‌బాల్‌లో కొచ్చి కొత్త శక్తిని పరిచయం చేయడం మాకు చాలా ఆనందంగా ఉంది. మేము ఈ కొత్త పేరుతో మైదానంలోకి అడుగుపెట్టినప్పుడు కొచ్చి ఫోర్స్ విజయంలో దూకుడు సహా అంతులేని అవకాశాల కోసం సిద్ధంగా ఉంది. మేం ప్రపంచ స్థాయి ఆటగాళ్లను ఏకం చేస్తాము. ఫుట్‌బాల్ ప్రతిభ కొచ్చికి స్ఫూర్తినిస్తుంది. ప్రతి అభిమానిని మా వారసత్వంలో భాగం చేయడం ఇష్టపడతాం`` అని తెలిపారు.
స్కోర్‌లైన్ స్పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ - కేరళ ఫుట్‌బాల్ అసోసియేషన్ ద్వారా నిర్వహిస్తున్న కేరళ ఫుట్‌బాల్ లీగ్ ప్రారంభ సెషన్‌లో పాల్గొనే ఆరు జట్లలో ఫోర్కా కొచ్చి కూడా ఉంది. ఇది రాష్ట్ర ఫుట్‌బాల్ వ్యవస్థను సుసంపన్నం చేయడం లక్ష్యంగా పెట్టుకుంది.
కేరళ ఫుట్‌బాల్‌కు ప్రోత్సాహం
సుప్రియా మీనన్ కూడా తన సొంత రాష్ట్రంలో జరుగుతున్న సూపర్ లీగ్ కేరళ వంటి ప్రీమియర్ స్పోర్ట్స్ ఈవెంట్‌కు తన బలమైన మద్దతును తెలియజేసింది. తన ప్రచారం వల్ల ఎక్కువ మంది మహిళా క్రీడా ఔత్సాహికులను స్టేడియంలలో ప్రత్యక్షంగా జరిగే మ్యాచ్‌లకు హాజరయ్యేలా ప్రేరేపించడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆమె తెలిపారు. కొచ్చి FC జట్టు సహ-యజమానులు నస్లీ మహ్మద్, ప్రవీష్ కుజిపల్లి, షమీమ్ బాకర్, మహ్మద్ షైజల్ కేరళ టీమ్ బలోపేతం కావాలని ఆశిస్తున్నారు.
''ఇటువంటి పెట్టుబడులు కేరళ ఫుట్‌బాల్‌కు .. మన రాష్ట్ర క్రీడా ఆర్థిక వ్యవస్థకు ఊతమిస్తున్నాయి. ఇతర పరిశ్రమల నుండి ఎక్కువ మంది ప్రముఖుల భాగస్వామ్యం క్రీడలు తదుపరి స్థాయికి ఎదగడానికి సహాయపడుతుంది'' అని జట్టులో పెట్టుబడి పెట్టిన పృథ్వీరాజ్ పై KFA అధ్యక్షుడు, నవాస్ మీరన్ వ్యాఖ్యానించారు.