స్టార్ సినిమా.. హీరోయిన్ కి మరీ ఇంత అన్యాయమా..?
కోలీవుడ్ భామల్లో తన మార్క్ నటనతో ఆకట్టుకుంటూ వస్తున్న హీరోయిన్ ప్రియా భవాని శంకర్.
కోలీవుడ్ భామల్లో తన మార్క్ నటనతో ఆకట్టుకుంటూ వస్తున్న హీరోయిన్ ప్రియా భవాని శంకర్. కెరీర్ మొదలు పెట్టి దశాబ్ద కాలం కావొస్తున్నా కూడా అమ్మడు తమిళ్ లో తప్ప మిగతా ఎక్కడ అంత గొప్ప పేరు తెచ్చుకోలేదు. తమిళ్ లో కూడా స్టార్ హీరోయిన్ క్రేజ్ తెచ్చుకోవడంలో వెనకబడింది ప్రియా భవాని. చేసిన సినిమాలు బాక్సాఫీస్ దగ్గర మంచి ఫలితాలు ఇచ్చినా కూడా సరైన ఛాన్స్ లు రాలేదని అంటుంది ప్రియా భవాని శంకర్.
ఐతే రాక రాక ఒక స్టార్ ఛాన్స్ వస్తే అది కూడా నిరాశ పరచిందని ఈమధ్య జరిగిన ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. స్టార్ హీరో సినిమాలో ప్రియా భవాని శంకర్ నటించిందట. దాదాపు ఆ సినిమా కోసం ఏకంగా 55 రోజుల దాకా డేట్స్ ఇచ్చిందట ప్రియా భవాని. ఈ సినిమాతో తన కెరీర్ ఊపందుకుంటుందని భావించిన అమ్మడికి సినిమా చూశాక మైండ్ బ్లాక్ అయ్యిందట.
సినిమాకు తాను 55 రోజులు పనిచేస్తే పట్టుమని 5 నిమిషాలు కూడా తన పాత్ర లేదని బాధపడిందట ప్రియా భవాని. వెంటనే డైరెక్టర్ కి ఫోన్ చేస్తే హీరోతో మాట్లాడమని అన్నారట. హీరోతో మాట్లాడితే తను కూడా 130 రోజులు పనిచేస్తే అవన్నీ పాటలో పెడతామని అన్నారని ఆయన ఆన్సర్ ఇచ్చారట. అలా స్టార్ సినిమా ఇచ్చిన ఝలక్ వల్ల అలాంటి వాటిలో నటించడం కన్నా యువ హీరోల సినిమాల్లో ప్రాధాన్యత ఉన్న పాత్రలు చేస్తే బెటర్ అనుకుంది ప్రియా.
అందుకే ఆమె మాక్సిమం మీడియం లేదా యువ హీరోల సరసన నటించింది. తెలుగులో కళ్యాణం కమనీయం సినిమా చేసిన ప్రియా భవాని నాగ చైతన్య విక్రం కుమార్ కాంబోలో వచ్చిన ధూత వెబ్ సీరీస్ లో కూడా నటించి మెప్పించింది. ప్రస్తుతం చేతి నిండా సినిమాలతో అదరగొడుతున్న ప్రియా భవాని శంకర్ స్టార్ రేంజ్ కి వెళ్లేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తుంది. ఐతే గ్లామర్ షోకి దూరంగా కేవలం అభినయానికి ప్రాధాన్యత ఉన్న పాత్రలు మాత్రమే చేయడం వల్ల ప్రియా భవానికి స్టార్ ఆఫర్లు రావట్లేదా అన్న చర్చ కూడా నడుస్తుంది. ఐతే ఆ చాన్స్ లు వచ్చినా రాకపోయినా తనకు నచ్చిన పాత్రలనే చేయాలని ఫిక్స్ అయ్యింది ప్రియా భవాని శంకర్.