స్టార్‌హీరో ఫ్యాన్స్ టార్గెట్ చేసారు.. మహిళా MP ఆరోపణలు..
ఇంతకీ ఈ ఎపిసోడ్ లో స్టార్ హీరో ఎవరు? అతడి అభిమానులే ఈ పని చేస్తున్నారా? ..అంటే వివరాల్లోకి వెళ్లాలి.
ప్రముఖ హీరో అభిమానులు తనను సోషల్ మీడియాల్లో టార్గెట్ చేస్తున్నారని .. ప్రఖ్యాత మహిళా నాయకురాలు ఆరోపించారు. ఇంతకీ ఈ ఎపిసోడ్ లో స్టార్ హీరో ఎవరు? అతడి అభిమానులే ఈ పని చేస్తున్నారా? ..అంటే వివరాల్లోకి వెళ్లాలి.
సామాజిక మాధ్యమాలలో భాజపా అనుకూలురైన స్టార్ హీరో అక్షయ్ కుమార్ అభిమానులు తనను టార్గెట్ చేస్తున్నారని శివసేన (యుబిటి) ఎంపి ప్రియాంక చతుర్వేది ఆరోపించారు. లాతూర్‌లో బిజెపికి వ్యతిరేకంగా నటుడు రితీష్ దేశ్‌ముఖ్ చేసిన ఆవేశపూరిత ప్రసంగాన్ని మహిళా ఎంపీ ప్రశంసించిన కొన్ని గంటల తర్వాత ఈ పోస్ట్ వెలువడింది. స్టార్ హీరో అభిమానులు సోషల్ మీడియాల్లో తనను లక్ష్యంగా చేసుకుని హ్యాష్‌ట్యాగ్ లు వైరల్ చేసేందుకు కొందరికి డబ్బు చెల్లించారని చతుర్వేది ఆరోపించారు. అక్షయ్ కుమార్ ఫ్యాన్ క్లబ్, పెయిడ్ బ్లూ టిక్ ఫిల్మ్ ఇన్‌ఫ్లుయెన్సర్‌లకు హ్యాష్‌ట్యాగ్ ఇచ్చి నన్ను లక్ష్యంగా చేసుకోవడానికి ట్వీట్‌లను రూపొందించారు. అయితే ఈ ట్వీట్ బ్యాంక్‌లో వ్యాకరణ దోషాల కారణంగా ఈ కామెంట్లు ఎక్కడ నుండి వస్తున్నాయో సులభంగా ఊహించవచ్చు అని ఆమె X లో రాసింది.
ఎంపీ ప్రియాంక చతుర్వేది భాజపా వ్యతిరేకి. పిఎం మోడీ నేతృత్వంలోని బిజెపి ప్రభుత్వంపై తీవ్ర విమర్శకురాలు అయితే, అక్షయ్ కుమార్ కాషాయ పార్టీకి, ప్రధానమంత్రికి మద్దతుదారుగా పాపులరయ్యారు. అయితే చతుర్వేది వాదనలు విన్నా కానీ అక్షయ్ అభిమానుల క్లబ్‌ల నుండి ఎటువంటి ట్వీట్లు, పోస్ట్‌లు రాలేదు.
లాతూర్ రూరల్‌లో జరిగిన ర్యాలీలో తన సోదరుడు, కాంగ్రెస్ అభ్యర్థి ధీరజ్ దేశ్‌ముఖ్‌కు మద్దతుగా బిజెపిపై నటుడు రితీష్ దేశ్‌ముఖ్ ఘాటైన వ్యాఖ్యలతో ఎదురు దాడి ప్రారంభించిన వీడియోను ఎక్స్‌లో షేర్ చేసిన కొన్ని గంటల తర్వాత ప్రియాంక ట్వీట్ వచ్చింది. బీజేపీ తన ప్రచారంలో మతానికి ప్రాధాన్యత ఇచ్చినందుకు రితీష్‌పై విమర్శలు గుప్పించారు. మతాన్ని బోధించే వారికి చెప్పండి.. మేం ధర్మాన్ని జాగ్రత్తగా చూసుకుంటాం. బదులుగా మన జీవితాలను ప్రభావితం చేసే నిజమైన సమస్యల గురించి మాట్లాడుకుందాం అని రితేష్ వ్యాఖ్యానించాడు. రితీష్ వీడియోను షేర్ చేసి... లై భారీ అని రాసింది.
మహారాష్ట్రలోని 288 అసెంబ్లీ స్థానాలకు నవంబర్ 20న పోలింగ్ జరగనుంది. నవంబర్ 23న ఓట్ల లెక్కింపు జరగనుంది. ఈసారి గెలుపు గుర్ర ఎక్కేదెవరో వేచి చూడాలి.