SSMB29: బాబును వెన్నుపోటు పొడిచేందుకే..

సూపర్ స్టార్ మహేష్ బాబు, రాజమౌళి కాంబినేషన్‌లో రూపొందుతున్న SSMB29 సినిమాపై ఇప్పటికే ఊహించని హైప్ ఉంది.;

Update: 2025-03-27 06:26 GMT
Priyanka Chopra Return In Hyderabad

సూపర్ స్టార్ మహేష్ బాబు, రాజమౌళి కాంబినేషన్‌లో రూపొందుతున్న SSMB29 సినిమాపై ఇప్పటికే ఊహించని హైప్ ఉంది. ఇది మహేష్ బాబు కెరీర్‌లోనే కాదు, ఇండియన్ సినిమా చరిత్రలో మరో ప్రతిష్టాత్మక పాన్ వరల్డ్ ప్రాజెక్ట్‌గా నిలవబోతోంది. ఇక తాజాగా ఈ సినిమాకు సంబంధించి మరింత ఆసక్తికర ట్విస్ట్ ఫిల్మ్ నగర్‌లో చర్చనీయాంశంగా మారింది. బాలీవుడ్ గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా హైదరాబాద్‌కు చేరుకోవడంతో అనేక రకాల కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.


ప్రియాంక చోప్రా తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరిలో "హలో హైదరాబాద్" అంటూ షేర్ చేసిన ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆమె ఇప్పటికే ప్రాజెక్ట్ కోసం బల్క్ డేట్స్ కేటాయించినట్లు సమాచారం. రాజమౌళి కథలో ఆమెకు ఓ కీలకమైన పాత్రను రాసినట్లు తెలుస్తోంది. ఇది రొటీన్ హీరోయిన్ పాత్ర కాదు, నెగటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ అని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ క్యారెక్టర్ కథలో మహేష్ బాబుకు వెన్నుపోటు పొడిచే విధంగా డిజైన్ చేశారని ఇండస్ట్రీలో టాక్.

ఇంతకీ ఇదంతా ఊహాగానమా, నిజమా అనేది క్లారిటీకి రాలేదు. కానీ ప్రియాంక షూటింగ్ కోసం హైదరాబాదులో అడుగుపెట్టిన సంగతిని బట్టి, ఈ పాత్రపై స్పెక్యులేషన్స్ బలపడుతున్నాయి. రాజమౌళి గతంలో కట్టప్ప లాంటి క్యారెక్టర్‌తో ఎలా షాక్ ఇచ్చారో అందరికీ గుర్తుంది. అలాగే ఈసారి ప్రియాంక పాత్ర కూడా నెగటివ్, కానీ లోతైన భావోద్వేగంతో కూడుకున్నట్టే ఉంటుందని సమాచారం. అంతే కాదు, ఆ పాత్ర సినిమాకు కీలక మలుపు ఇచ్చేలా డిజైన్ చేశారని వినిపిస్తోంది.

ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ ఒడిశాలోని అడవుల్లో జరుపుతున్నారు. ఇప్పుడు హైదరాబాద్‌లో కూడా షెడ్యూల్ ఉండే అవకాశం ఉండటంతో, ప్రియాంక చోప్రా వచ్చినట్టు స్పష్టమవుతోంది. గమనించాల్సిన విషయం ఏంటంటే, ఈ ప్రాజెక్ట్ కోసం ప్రియాంక తన ఇతర కమిట్మెంట్స్‌ను వాయిదా వేసుకుని పూర్తి సమయం ఇస్తున్నారని సమాచారం. ఇది ఆమె ప్రొఫెషనలిజం, ప్రాజెక్టుపై నమ్మకాన్ని సూచిస్తుందనే చెప్పాలి.

మొత్తానికి ప్రియాంక పాత్ర ఎంత పవర్‌ఫుల్‌గా ఉంటుందన్నది ఇప్పుడే ఊహించలేకపోయినా, రాజమౌళి ఆమెను ఇలా ఎంపిక చేయడం వెనుక ఉన్న ప్లానింగ్‌ను మాత్రం అర్ధం చేసుకోవచ్చు. ఇది ఆమె కెరీర్‌లో మరో డిఫరెంట్ ట్రాక్ కానుందని అభిమానులు భావిస్తున్నారు. ఇక సినిమా రిలీజ్ కి ఇంకా సమయం ఉన్నప్పటికీ, ఈ క్యారెక్టర్ చుట్టూ బిల్డ్ అయ్యే మిస్టరీ సినిమాపై అంచనాలను రెట్టింపు చేస్తోంది. SSMB29 నుంచి వచ్చే ఫస్ట్ అప్‌డేట్ కోసం ఇప్పుడు అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Tags:    

Similar News