కానిస్టేబుల్‌ చారు తో శనివారం..!

తాజాగా మరో శనివారం కూడా సినిమా అప్‌డేట్‌ ఇవ్వడం జరిగింది. ఈసారి హీరోయిన్ గా నటిస్తున్న ప్రియాంక అరుల్‌ మోహన్‌ పిక్ ను చిత్ర యూనిట్‌ సభ్యులు షేర్ చేశారు.

Update: 2024-08-11 07:17 GMT

నాని హీరోగా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో డివివి దానయ్య నిర్మిస్తున్న భారీ బడ్జెట్‌ చిత్రం 'సరిపోదా శనివారం'. ఈ సినిమా లో నానికి జోడీగా ప్రియాంక అరుల్‌ మోహన్‌ హీరోయిన్‌ గా నటిస్తోంది. ఈ సినిమా ప్రకటించినప్పటి నుంచి కూడా అందరి ఆసక్తిని పెంచుతూనే ఉంది. తెలుగు లో నిర్మాణం జరుగుతున్న ఈ సినిమాను పాన్‌ ఇండియా రేంజ్ లో అన్ని భాషల్లో విడుదల చేసే విధంగా దర్శకుడు వివేక్ ఆత్రేయ మరియు నిర్మాత దానయ్య ప్లాన్‌ చేస్తున్న విషయం తెల్సిందే. సినిమా ఫస్ట్‌ గ్లిమ్స్ విడుదల అయినప్పుడే భలే ఉందే అనే ఆసక్తి అందరి లో వ్యక్తం అయ్యింది.

 

ఈ సినిమాకు జేక్స్‌ బిజోయ్‌ సంగీతాన్ని అందిస్తుండగా, మురళి జి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన ప్రతి అప్‌డేట్‌ ను కూడా శనివారం ఇస్తున్న విషయం తెల్సిందే. తాజాగా మరో శనివారం కూడా సినిమా అప్‌డేట్‌ ఇవ్వడం జరిగింది. ఈసారి హీరోయిన్ గా నటిస్తున్న ప్రియాంక అరుల్‌ మోహన్‌ పిక్ ను చిత్ర యూనిట్‌ సభ్యులు షేర్ చేశారు. ఈ సినిమాలో ప్రియాంక లేడీ కానిస్టేబుల్‌ గా కనిపించబోతుంది అనే విషయం తెల్సిందే. తాజాగా అందుకు సంబంధించిన పిక్ ను చిత్ర యూనిట్‌ సభ్యులు అధికారికంగా విడుదల చేయడం జరిగింది.

కానిస్టేబుల్‌ చారులత. పి పాత్రలో ప్రియాంక అరుల్‌ మోహన్‌ కనిపించబోతుంది. షూటింగ్ గ్యాప్‌ లో ప్రియాంక కానిస్టేబుల్‌ గెటప్ లోనే కాఫీ తాగుతున్న ఈ పిక్ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ మధ్య కాలంలో హీరోయిన్స్ ను ఇలా కానిస్టేబుల్‌ పాత్రలో చూడలేదు. చాలా అరుదుగా మాత్రమే ఇలాంటి పాత్రలను ఈ మధ్య కాలంలో చూస్తూ ఉన్నాం. కచ్చితంగా ప్రేక్షకులు మెచ్చే విధంగా చారు పాత్ర ఉంటుందని మేకర్స్ బలంగా నమ్మకంగా ఉన్నారు. దర్శకుడు వివేక్ ఆత్రేయ సినిమాల్లో హీరోయిన్స్ కి మంచి ప్రాముఖ్యత ఉంటుంది. కనుక ఈసినిమా లో కూడా ప్రియాంక అరుల్‌ మోహన్‌ కి మంచి పాత్ర దక్కి ఉంటుందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

ఈ సినిమాకు మొదట రూ.80 కోట్ల బడ్జెట్‌ తో రూపొందుతుందనే వార్తలు వచ్చాయి. షూటింగ్‌ పూర్తి అయ్యే సమయంకు ఏకంగా రూ.150 కోట్ల కు బడ్జెట్‌ పెరిగింది అనే ప్రచారం జరుగుతోంది. ఇప్పటి వరకు చిత్ర బడ్జెట్‌ గురించి నిర్మాతలు ఎలాంటి ప్రకటన చేయలేదు. కానీ సినిమా నిర్మాణంలో ఎక్కడ రాజీ పడలేదు అని, కచ్చితంగా ఇది నాని కెరీర్ లో బిగెస్ట్‌ మూవీగా నిలుస్తుందని, హిట్‌ పరంగా కూడా భారీ నాని కెరీర్‌ లో నిలిచి పోయే సినిమా అవుతుందని మేకర్స్ అంటున్నారు. శనివారం తో ఉండే సంబంధం ఏంటి, అసలు హీరో శనివారం రోజు ఏం చేస్తాడు అనే అంశాలు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. సినిమాను ఈ నెల 29న ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు ప్లాన్‌ చేస్తున్నారు.

Tags:    

Similar News