మాల్తీతో పీసీ...చూడు చూడు అంటూ ఇలా!
సరోగసీ ద్వారా అమ్మడు మాతృమూర్తి లో తియ్యదనాన్ని ఆస్వాదిస్తుంది.
గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా హాలీవుడ్ లో ఎంత బిజీగా ఉన్నా? సోషల్ మీడియా ద్వారా అభిమానులకు మాత్రం కొంత స్పేస్ తప్పనిసరి అంటూ ఎప్పుడూ టచ్ లో ఉంటుంది. నిక్ జోనాస్ ని వివాహం చేసుకున్న నాటి నుంచి సింగిల్ గా కనిపించడం తగ్గిందింది. వీలైనంత వరకూ జంటగా నే కనిపిస్తుంది. భర్తతో కలిసిన ఎలాంటి మూవ్ మెంట్స్ అయినా అభిమానులతో పంచుకుంటుంది. ఇప్పుడు కొత్తగా పీసీ జీవితంలోకి కుమార్తె మాల్తీ కూడా వచ్చిన సంగతి తెలిసిందే.
సరోగసీ ద్వారా అమ్మడు మాతృమూర్తి లో తియ్యదనాన్ని ఆస్వాదిస్తుంది. మాల్తీని కూడా వీలైనంత వరకూ సోషల్ మీడియా ద్వారా అభిమానులకు నిరంతరం టచ్ లో ఉంచేలా చూస్తుంది. మాల్తీతో పీసీ ఉంది? అంటే ఇద్దరు ఎంచక్కా ఆట పాటలతో టైంపాస్ చేస్తుంటారు. ఇక బయటకు వెళ్లాల్సి వస్తే ఎక్కువగా ప్రిపర్ చేసేది బీచ్ అందాల్నే. తాజాగా మరోసారి బీచ్ లో ప్రియాంక- మాల్తీ కనిపించారు.
ఇదిగో ఇక్కడిలో కుమార్తెను చంకనేసుకుని బీచ్ లో సేదరు తీరుతుంది. బీచ్ లో ఎదురుగా ఏదో ఉంది చూడు చూడు అంటూ మాల్తీకి చెబుతుంది. పాపాయి కూడా తల్లి మాటలు వింటూ చూసే ప్రయత్నం చేస్తుంది. ఇందులో పీసీ వైట్ అండ్ వైట్ లో కనిపిస్తుంది. తెలుపు జాకెట్...అదే రంగు నిక్కరు ధరించింది. వేడిని తట్టుకునేలా సేమ్ కలర్ హ్యాట్ ధరించింది. అలాగే కళ్లకు నలుపు రంగు కూలింగ్ గ్లాసెస్ వేసుకుంది.
మాల్తీని అంతే ప్రొటెక్ట్ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట వైరల్ గా మారింది. చాలా రోజుల తర్వాత మాల్తీ కనిపించే సరికి పెద్దది అయిపోతుందంటూ అభిమానులు కామెంట్లు పెడుతున్నారు. అయితే ఈ పిక్ లో ఎక్కడా నిక్ జోనాస్ కనిపించలేదు. మరి పీసీ బిడ్డను తీసుకుని సోలోగా బీచ్ కి వచ్చిందా? భర్త కూడా ఉన్నాడా? అన్నది తెలియాలి.