రిస్క్ తీసుకోవడానికి ఇష్టపడని దిల్ రాజు

బడా నిర్మాతగా డిస్టిబ్యూటర్ గా తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్న దిల్ రాజు పక్కా కేలిక్యులేషన్ తో మూవీస్ ని కొని రిలీజ్ చేస్తారనే సంగతి తెలిసిందే.

Update: 2023-10-15 05:46 GMT

బడా నిర్మాతగా డిస్టిబ్యూటర్ గా తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్న దిల్ రాజు పక్కా కేలిక్యులేషన్ తో మూవీస్ ని కొని రిలీజ్ చేస్తారనే సంగతి తెలిసిందే. గతంలో సినిమాలు కొనుగోలు చేసి డిస్టిబ్యూషన్ చేసిన సమయంలో కొన్ని సార్లు నష్టాలు చవిచూడాల్సి వచ్చింది. అందుకే ప్రస్తుతం పెద్ద సినిమాల విషయంలో ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటున్నారు.

ఆదిపురుష్ మూవీని ముందుగా తెలుగులో దిల్ రాజు రిలీజ్ చేయాలని అనుకున్నారు. డీల్ కూడా సెట్ చేసుకున్నారు. తరువాత ఎందుకనో రిస్క్ అని భావించి వెనక్కి తగ్గారు. తెలుగు రాష్ట్రాలకి సంబంధించి ఆదిపురుష్ రిలీజ్ రైట్స్ ని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ తరువాత పెద్ద మొత్తం పెట్టి కొనుగోలు చేసింది. అయితే ఆ సినిమా ఏ స్థాయిలో నష్టాలు తీసుకొచ్చిందో అందరికి తెలిసిందే.

ఇప్పుడు సలార్ మూవీ నైజాం రైట్స్ విషయంలో కూడా దిల్ రాజు వెనక్కి తగ్గేలా కనిపిస్తున్నారు. సలార్ మూవీ నైజాం రైట్స్ కోసం ముందు నుంచి దిల్ రాజు పోటీలో ఉన్నారు. అయితే నిర్మాతలు ఈ సినిమాపై 70 కోట్లు కోట్ చేస్తున్నారంట. ఈ కారణంగా దిల్ రాజు డీల్ నుంచి తప్పుకున్నారని తెలుస్తోంది. 70 కోట్లతో కేవలం నైజాం రైట్స్ తీసుకోవడం అంటే రిస్క్ అవుతుందని భావించి వెనకడుగు వేసారంట.

దీంతో మైత్రీ మూవీ మేకర్స్ ఇప్పుడు ఈ రైట్స్ కోసం రేసులోకి వచ్చింది. అయితే మైత్రీ వాళ్ళు ఎంత వరకు సలార్ రిస్క్ ని పేస్ చేయడానికి రెడీ అవుతారనేది చూడాలి. ఆది పురుష్ సినిమా కోసం మైత్రీ మూవీ మేకర్స్ పోటీ పడ్డారు. తరువాత వెనక్కి తగ్గారు. ప్రభాస్ గత మూడు సినిమాలు కమర్షియల్ గా ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేదు. ఈ కారణంగానే దిల్ రాజు రిస్క్ చేయడానికి ఇష్టపడటం లేదని తెలుస్తోంది.

సలార్ నవంబర్ 22న పాన్ ఇండియా లెవల్ లో ప్రేక్షకుల ముందుకి రాబోతోంది. ఈ చిత్రంపై అంచనాలు అయితే గట్టిగానే ఉన్నాయి. ప్రభాస్ కెరియర్ లో బిగ్గెస్ట్ హిట్ అవుతుందని భావిస్తున్నారు. కాని షారుఖ్ ఖాన్ డుంకీ మూవీ కూడా అదే రోజు రిలీజ్ కాబోతోంది.

Tags:    

Similar News