ఫేక్ బుకింగ్స్ పై కోర్టుకు నిర్మాతలు.. ఏం జరుగుతుందో?
ప్రేక్షకుల్లో బజ్ క్రియేట్ చేయడానికి ఫేక్ బుకింగ్స్ తోపాటు సోషల్ మీడియాలో పాజిటివ్ రివ్యూలు కూడా పోస్ట్ చేస్తున్నారని తెలిపినట్లు తెలుస్తోంది.
అప్పటి రోజుల్లో సినిమా చూడాలంటే.. థియేటర్లలో టికెట్ కౌంటర్ వద్ద లైన్ లో నిలబడాల్సిందే. ఆ తర్వాత టికెట్ తీసుకుని చూసేవాళ్లం. ఇక పెద్ద హీరోల సినిమాలైతే చెప్పనక్కర్లేదు. కౌంటర్ల వద్ద గంటల తరబడి.. తోసుకుని.. చెమట్చోడి టికెట్లను దక్కించుకునేవాళ్లం. కొన్నిసార్లు చాలాసేపు లైన్ లో ఉన్నా టికెట్లు దొరకడం గగనమే. పండుగలు, సెలవుల టైమ్ లో కూడా అదే పరిస్థితి. కానీ ఇప్పుడు అంతా ఛేంజ్. మన చేతుల్లోనే పని అయిపోతుంది.
ఆన్ లైన్ యాప్స్/వెబ్ సైట్స్ లో టికెట్లు కొనేసి సినిమాలకు వెళ్లిపోతున్నాం. మూవీ రిలీజ్ కు కొద్దిరోజుల ముందే అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ అయిపోతున్నాయి. దీంతో ముందే కొనేసి తొలిరోజు సినిమా చూసేందుకు రెడీ అయిపోతున్నాం. ఇదే సమయంలో ఫేక్ బుకింగ్స్ జోరుగా జరుగుతున్నాయని ఎప్పటి నుంచో వార్తలు వస్తున్నాయి. సినిమా బాగుందనే ఫీలింగ్ సృష్టించడానికి టికెట్స్ ఫుల్ అయినట్లు చూపిస్తున్నారని ఆరోపణలున్నాయి.
అందుకోసం కొన్ని ఏజెన్సీలను మేకర్స్ ఆశ్రయిస్తున్నారని.. వాళ్లే ఇదంతా చేస్తున్నారని టాక్ వినిపిస్తోంది. ఆడియన్స్ దృష్టిని ఆయా మేకర్స్ తీసిన సినిమాల వైపు మరల్చడానికి ఫేక్ బుకింగ్స్ చేస్తున్నారని అంటున్నారు. ఇప్పుడు ఈ విషయంపై సౌత్ సినీ ఇండస్ట్రీకి చెందిన ఇద్దరు నిర్మాతలు.. కోర్టును ఆశ్రయించినట్లు తెలుస్తోంది. ఫేక్ బుకింగ్స్ పై వారు ఫిర్యాదు చేయగా.. కోర్టు జోక్యం చేసుకుని దర్యాప్తు ప్రారంభించినట్లు సమాచారం.
ఆన్ లైన్ టికెట్ సెల్లింగ్ పోర్టల్స్ లో జరుగుతున్నట్లు ఆరోపణలు ఉన్న ఈ ఫేక్ బుకింగ్స్ పై ఒక బ్యాచ్ పనిచేస్తోందని కోర్టుకు ఆ ఇద్దరు నిర్మాతలు చెప్పారట. ప్రేక్షకుల్లో బజ్ క్రియేట్ చేయడానికి ఫేక్ బుకింగ్స్ తోపాటు సోషల్ మీడియాలో పాజిటివ్ రివ్యూలు కూడా పోస్ట్ చేస్తున్నారని తెలిపినట్లు తెలుస్తోంది. మొత్తానికి సినిమా థియేట్రికల్ రన్.. భారీ లాభాలు అందుకునేలా రకరకాల చర్యలకు పాల్పడుతున్నట్లు నిర్మాతలు ఫిర్యాదు చేసినట్లు టాక్.
ఫేక్ బుకింగ్స్ కు సంబంధించిన వీడియోలను కూడా కోర్టుకు నిర్మాతలు సాక్ష్యంగా సమర్పించినట్లు తెలుస్తోంది. దీంతో ఈ విషయంలో కోర్టు సమగ్రంగా విచారణ చేపట్టనున్నట్లు సమాచారం. ఇప్పుడు సినీ వర్గాల్లో ఈ విషయం హాట్ టాపిక్ గా మారింది. అయితే త్వరలో చాలా సినిమాలు రిలీజ్ కానున్నాయి. దీంతో అప్పుడేం జరుగుతుందోనని ఆసక్తికరంగా మారింది. భవిష్యత్తులో ఈ ఫేక్ బుకింగ్స్ తగ్గుతాయో లేదో వేచి చూడాలి.