ఇది సినిమా వార్త కాదు.. వాళ్ల వాస్తవ జీవితం!
డ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ పూరి మ్యూజింగ్స్ పేరుతో యూ ట్యూబ్ లో స్పెషల్ డియోలు రిలీజ్ చేస్తోన్న సంగతి తెలిసిందే.
డ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ పూరి మ్యూజింగ్స్ పేరుతో యూ ట్యూబ్ లో స్పెషల్ డియోలు రిలీజ్ చేస్తోన్న సంగతి తెలిసిందే. తాను ఎంపిక చేసుకున్న అంశంపై తనదైన శైలిలో విశ్లేషిస్తూ...భవిష్యత్ ని దృష్టిలో పెట్టుకుని ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తున్నారు. తాజాగా అమీష్ పీపూల్ గురించి..వాళ్ల సంప్రదాయాల గురించి వివరించే ప్రయత్నం చేసారు. `అమీష్ పీపుల్ ఇప్పటికీ కరెంట్ వాడరు. ఇంట్లో ఏసీ..ప్రీజ్ ..గ్రైండర్..ప్యాన్ ఉండదు. స్మార్ట్ ఫోన్...టీవీల సంగతైతే తెలియనే తెలియదు. కార్లు అసలు వాడరు.
18వ శతాబ్ధంలో ఎలా బ్రతికే వారో ఇప్పటికీ అలాగే జీవిస్తున్నారు. పిల్లల్ని ఎక్కువగా చదింవించరు. ఉమ్మడి కుటుంబాల్ని ఇష్టపడతారు. ఆదివారం వస్తే విశ్రాంతి తీసుకుంటారు. ప్రపంచంలో ఇతర జనాభాతో కలిసి ఉండటానికి అస్సలు ఆసక్తి చూపించరు. వాళ్ల జీవన విధానం గురించి ఎవరికీ చెప్పడానికి ఇష్టపడరు. కనీసం ఇంటర్వ్యూలు కూడా ఇవ్వరు. ఆడవాళ్లు పొగడ్తలకు పడిపోరు. మ్యాకప్ లు వేసుకోరు. అందరూ క్రమశిక్షణతో ఉంటారు.
ఒకరికి ఆపద వచ్చినా అంతా కలిసి కట్టుగా ముందుంటారు. ఆబాధ నుంచి కోలుకునేలా చర్యలు తీసుకుంటారు. ప్రకృతిని గౌరవిస్తారు. వాళ్ల మతగ్రంధంలో ఉన్న దేన్నీ మీరరు. ప్రపంచమంతా మారుతున్నా వాళ్లు ఇంకా 300 క్రితం జీవన విధానాన్నే అనుసరిస్తున్నారు. అమీష్ పీపూల్ వాళ్లకంటూ ఓ ప్రపంచాన్ని సృష్టించుకున్నారు. ప్రకృతిని ఎంతో ఇష్టపడతారు. దాన్ని ఆస్సలు నాశనం చేయాలనే ఆలోచన వాళ్ల బుర్రలోకి రాదు. అంత పాజిటివ్ మైండ్ తో ఉంటారు.
భార్యభర్తలిద్దరు ఒకే మంచం మీద పడుకున్నా మధ్యలో చెక్క అడ్డుగా పెట్టుకుంటారు. నిద్రపోయే సమయంలో ఒకర్ని ఒకరు తాకకూడదనే ఇలా చేస్తారు. వాళ్లను వాళ్లు ఎంతో గొప్పగా నియంత్రిచుకుంటారు. అంతటి సామర్ధ్యం వాళ్లకే సాధ్యం. సోషల్ మీడియా గురించి అసలే తెలియదు. అందుకే వాళ్లు అంత సంతోషంగా ఉన్నారు. ప్రతీ సాయంత్ర అంతా ఒకే చోట చేసి సరదగా కబుర్లు చెప్పుకుంటారు. త్వరగా నిద్రపోతారు. వాళ్లు చేస్తుంది వందశాతం నిజం. వాళ్ల మీద ఎన్నో హాలీవుడ్ సినిమాలు కూడా వచ్చాయి. వీలైతే అందరూ ఓసారి చూడండి` అని కోరారు పూరి.