పూరి తెగింపు..చిన్నప్పుడే బావిలోకి దూకేసాడు!
బయటకు ఒపెన్ అవ్వడు కానీ..వర్మ లా ఆలోచించ గల ఒకే ఒక్క దర్శకుడు పూరి. తాజాగా పూరి వ్యక్తిత్వం గురించి ఆయన మాతృమూర్తి అమ్మాజి మరికొన్ని ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.
డ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ ఇండస్ట్రీకి వచ్చి ఎలా ఎదిగారు అన్నది అందరికీ తెలిసిందే. దర్శకు డిగా ఎంత గొప్ప పేరు సంపాదించాడో? రాంగో పాల్ వర్మ ప్రియ శిష్యుడిగానే అంతే మంచి పేరు సంపా దించాడు. బయటకు ఒపెన్ అవ్వడు కానీ..వర్మ లా ఆలోచించ గల ఒకే ఒక్క దర్శకుడు పూరి. తాజాగా పూరి వ్యక్తిత్వం గురించి ఆయన మాతృమూర్తి అమ్మాజి మరికొన్ని ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.
ఆమె మాటల్ని బట్టి పూరి మామూలోడు కాదని...జగ మొండి అని తెలుస్తోంది. అలాగే ఆయన హృదయం కూడా ఎంతో జాలిదని తెలుస్తోంది. ఆవేంటో ఆమె మాటల్లోనే.. 'మా అబ్బాయి పూరి జగన్నాథ్ కి తొలి నుంచి జాలి గుణం ఎక్కువ. ఎదుటివారికి సహాయం చేసే స్వభావం గలవాడు. అది చిన్న వయసు నుంచే అలవాటుగా మారింది. ఒక కుర్రాడు బావిలో పడిపోతే అతణ్ణి కాపాడటం కోసం చిన్నప్పుడే బావిలోకి దూకేశాడు.
పని అంటే పిచ్చిగా ప్రేమించి పనిచేస్తాడు. తాను ఇష్టపడిన పని కోసం ఎంతైనా కష్టపడతాడు. తనలో ఆ లక్షణమే అంతటి వాడిని చేసింది' అని అన్నారు. అలాగే పూరి ఓ సమయంలో 100 కోట్లు ఓ వ్యక్తిని నమ్మి నష్టపోయిన సంగతి తెలిసిందే. ఆ విషయాన్ని పూరి చాలా ఇంటర్వ్యూల్లో చెప్పాడు. కానీ మరీ అంతగా నొక్కి చెప్పలేదు. తాజాగా అమ్మాజి మాత్రం ఆ విషయాలు కూడా గుర్తు చేసుకున్నారు.
'పూరి దగ్గర ఒక వ్యక్తి పనిచేసేవాడు. అతను పూరి సంపాదించిన కోట్ల రూపాయలను కొట్టేశాడు. పూరి పేరుతో బయట ఎన్నో అప్పులు చేసాడు. ఆ డబ్బుతో పూరి పేరుమీదే స్థలాలు కొనుగోలు చేస్తున్నట్టుగా చెప్పాడు. అతనిపై నమ్మకంతో పూరి ఏవీ చూడకుండానే కొన్ని కాగితాలపై సంతకం చేసేసాడు. అది పూరి పతనానికే కారణమైంది. కోట్ల రూపాయలు అప్పులు పాలయ్యాడు. అప్పులు తీర్చడం కోసం తాను సంపాదించుకున్న ఐదు మేడలు అమ్మేసాడు.
అప్పుడు ఇంట్లో అందరూ ఎంతో ఏడ్చాం. మళ్లీ మాకు దైర్యం చెప్పింది కూడా పూరినే. మా బంధువులు ఆ వ్యక్తి సంగతి చూస్తామంటే? వద్దని వాదించాడు. నాకు ఇంకా సంపాదించే శక్తి ఉందని అందర్నీ ఓదా ర్చాడు. ఇంత చేసినా ఆవ్యక్తి బాగు పడ్డాడా? అంటే అతను సినిమాలు తీసి నష్టపోయాడు' అని అన్నారు.