పుష్ప బిజినెస్.. అక్కడ నెవ్వర్ బిఫోర్ అనేలా..

త్వరలో చిత్రీకరణకు గుమ్మడి కాయ కొట్టనున్నారు మేకర్స్.

Update: 2024-10-18 10:11 GMT

టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న పుష్ప-2 మూవీపై సినీ ప్రియులతో పాటు అభిమానుల్లో ఎలాంటి అంచనాలు ఉన్నాయో అందరికీ తెలిసిందే. లెక్కల మాస్టర్ సుకుమార్ తెరకెక్కిస్తున్న ఆ సినిమా షూటింగ్ మూడేళ్లుగా కొనసాగుతోంది. ఇప్పుడు చివరి దశకు చేరుకుంది. త్వరలో చిత్రీకరణకు గుమ్మడి కాయ కొట్టనున్నారు మేకర్స్. పాన్ ఇండియా లెవెల్ లో విడుదల కానున్న పుష్ప సీక్వెల్ తో.. ఫస్ట్ పార్ట్ కు మించిన హిట్ ను అందుకోవాలని చూస్తున్నారు.

అందుకు తగ్గట్లు సరైన ప్లాన్ తో ముందుకెళ్తున్నారు. ఇప్పటి వరకు నమోదైన రికార్డులను బద్దలు కొట్టాలని చూస్తున్నారు. భారీ ఓపెనింగ్స్ సాధించే రీతిలో సినిమాను డిజైన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఫుల్ రన్ లో రూ.1000 కోట్ల వసూలు చేయాలని టార్గెట్ పెట్టుకున్నట్లు సమాచారం. అయితే డిసెంబర్ 6వ తేదీన పుష్ప-2 ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే. దీంతో ఓ వైపు మూవీ వర్క్ జరుగుతుండగా.. మరోవైపు భారీ బిజినెస్ డీల్స్ కుదుర్చుకుంటున్నట్లు టాక్ నడుస్తోంది.

ఇప్పటి వరకు ఎన్నడూ జరగని రీతిలో పుష్ప సీక్వెల్ థియేట్రికల్ బిజినెస్ జరుగుతున్నట్లు ప్రస్తుతం సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. రెండు తెలుగు రాష్ట్రాల హక్కులు.. భారీ ధరకు అమ్ముడవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. నైజాం హక్కులు తమ వద్దే ఉంచుకున్న మైత్రీ మూవీ మేకర్స్.. ఆంధ్ర హక్కులు రూ.90 కోట్లకు విక్రయించినట్లు టాక్ వినిపిస్తోంది. ఉత్తరాంధ్ర ఏరియా హక్కులను రూ.23 కోట్లకు.. సీడెడ్ రీజన్ హక్కులు రూ.30 కోట్లకు సేల్ చేసినట్లు తెలుస్తోంది.

ఉత్తరాంధ్ర హక్కులను బాహుబలి, ఆర్ఆర్ఆర్‌ ను డిస్ట్రిబ్యూట్ చేసిన సాయి కొర్రపాటి సొంతం చేసుకోగా.. సీడెడ్ రైట్స్ ను అభిషేక్ రెడ్డి దక్కించుకున్నారట. అల్లు అర్జున్ సన్నిహితుడు బన్నీ వాస్ కృష్ణా జిల్లాలో డిస్ట్రిబ్యూషన్ చేస్తుండగా.. యూవీ క్రియేషన్స్ వంశీ గుంటూరు జిల్లా హక్కులను దక్కించుకున్నారు. అయితే ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ లో బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాలు బాహుబలి, ఆర్ఆర్ఆర్ మాత్రమే రూ.90 కోట్లు రాబట్టాయి. దీంతో పుష్ప-2పై అందరి దృష్టి నెలకొంది.

ఉత్తరాంధ్రలో ఇటీవల విడుదల అయిన పెద్ద చిత్రాలు సలార్, కల్కి, దేవర రూ.20 కోట్లకుపైగా రాబట్టలేదు. దీంతో ఆ రికార్డును పుష్ప-2 బ్రేక్ చేయాలని అంటున్నారు. అయితే పుష్పకు ఇప్పుడు ఉన్న క్రేజ్.. హైప్ ను చూస్తే అది చాలా ఈజీ అనే చెప్పాలి. సోలోగా ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఆ సినిమాకు పాజిటివ్ మౌత్ టాక్ వస్తే చాలు.. భారీ కలెక్షన్స్ సాధిస్తుంది. ఇప్పటికే ఉన్న రికార్డులు బద్దలు కొడుతుంది. చాలా వేగంగా బ్రేక్ ఈవెన్ టార్గెట్ పూర్తి చేసుకుంటుంది. మరేం జరుగుతుందో చూడాలి.

Tags:    

Similar News