పుష్ప 2 రెండవ రోజు.. పరిస్థితి ఎలా ఉందంటే?
తాజాగా విడుదలైన కలెక్షన్ వివరాల ప్రకారం, రెండవ రోజు (డిసెంబర్ 6) సాయంత్రం 4 గంటల వరకు పుష్ప 2 అద్భుతమైన కలెక్షన్లు రాబట్టింది.
సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన పుష్ప 2: ది రూల్ విడుదలైన క్షణం నుండి ప్రపంచవ్యాప్తంగా భారీ కలెక్షన్స్ ను సాధిస్తోంది. అల్లు అర్జున్ మెయిన్ లీడ్ లో నటించిన ఈ చిత్రం, మొదటి రోజు కలెక్షన్లతోనే చరిత్ర సృష్టించగా, రెండవ రోజు కూడా అదే స్థాయిలో దూసుకుపోతుంది. తాజాగా విడుదలైన కలెక్షన్ వివరాల ప్రకారం, రెండవ రోజు (డిసెంబర్ 6) సాయంత్రం 4 గంటల వరకు పుష్ప 2 అద్భుతమైన కలెక్షన్లు రాబట్టింది.
భారతదేశంలోని 13,054 షోల్లో ఈ చిత్రానికి రూ. 30.01 కోట్లు (నెట్) వసూలు రావడం విశేషం. ఈ మొత్తం కలెక్షన్లలో హిందీ వెర్షన్ అత్యధికంగా 8,302 షోల్లో రూ. 17.09 కోట్లు (37.33%) సంపాదించగా, తెలుగు వెర్షన్ 3,033 షోల్లో రూ. 10.75 కోట్లు (34.16%) సాధించింది. హిందీ మార్కెట్ లో పుష్ప 2కి వచ్చిన ఈ స్థాయి స్పందన ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. మొదటి భాగం తర్వాత హిందీ ప్రేక్షకుల నుండి పెరిగిన క్రేజ్ ఈ కలెక్షన్లను ప్రభావితం చేసినట్లు స్పష్టంగా కనిపిస్తోంది.
హిందీ వెర్షన్ కలెక్షన్లు ప్రత్యేకంగా చర్చించుకోవాల్సిన విషయం. ఈ స్థాయి రిజల్ట్ పుష్ప 2 బాలీవుడ్ మార్కెట్ లో ఎంతగా ప్రభావం చూపుతోందో రుజువు చేస్తోంది. హిందీ ప్రేక్షకుల అభిరుచికి అనుగుణంగా చిత్రాన్ని ప్రమోట్ చేయడంలో చిత్ర బృందం చేసిన కృషి విజయానికి ప్రధాన కారణం. ఇది అల్లు అర్జున్ కు హిందీ మార్కెట్ లో మరింత స్థిరమైన స్థానం కల్పించనుంది. తెలుగు రాష్ట్రాల్లో కూడా పుష్ప 2 పట్ల మొదటి భాగం సృష్టించిన క్రేజ్ మరింత పెరిగింది.
ప్రేక్షకుల నుండి మంచి స్పందన రావడంతో, బుకింగ్స్ తగ్గకపోవడం కలెక్షన్లలో స్పష్టంగా కనిపిస్తోంది. బీ అలాగే సీ సెంటర్లలోనూ భారీ స్పందన రావడం పుష్ప 2 స్థిరమైన ఆక్యుపెన్సీతో కొనసాగుతోంది. ఒక విధంగా ఇది బిగ్ సక్సెస్ కు సంకేతం. రెండవ రోజు కూడా మొదటి రోజు మాదిరిగానే కలెక్షన్లు రాబడుతున్న పుష్ప రాజ్ ఉహించని రికార్డులు నెలకొల్పే అవకాశం ఉంది. మొదటి రోజు నుండి వచ్చిన పాజిటివ్ టాక్, స్టన్నింగ్ మ్యూజిక్, అద్భుతమైన విజువల్స్ రెండవ రోజు థియేటర్ల వద్ద ప్రేక్షకులను ఆకర్షించాయి.
పుష్ప 2 రెండు రోజుల్లోనే భారీ విజయాన్ని సాధించి, బాక్సాఫీస్ వద్ద హవా కొనసాగిస్తోంది. సుకుమార్ అల్లు అర్జున్ కాంబినేషన్ పై ఆడియెన్స్ లో ఎంత నమ్మకం ఉందొ మరోసారి అర్ధమవుతుంది. ఇక శని ఆదివారం కూడా కలెక్షన్ల లెక్క మరింత పెరిగే అవకాశం ఉంది. వీకెండ్ లోనే సినిమా ఈజీగా 500 కోట్ల మార్క్ ను టచ్ చేసే అవకాశం ఉంది. ఇలానే కొనసాగితే వెయ్యి కోట్ల టార్గెట్ ను అందుకోవడం పెద్ద కష్టమేమీ కాదు. మరి పుష్పరాజ్ ఆ టార్గెట్ ను ఎన్ని రోజుల్లో అందుకుంటాడో చూడాలి.