హిందీలో ఆల్ టైమ్ హైయెస్ట్ కలెక్షన్స్… అడుగు దూరంలో పుష్ప 2

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ బ్లాక్ బస్టర్ మూవీ ‘పుష్ప 2’ థియేటర్స్ లో సక్సెస్ ఫుల్ గా కొనసాగుతోంది.

Update: 2024-12-18 11:17 GMT

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ బ్లాక్ బస్టర్ మూవీ ‘పుష్ప 2’ థియేటర్స్ లో సక్సెస్ ఫుల్ గా కొనసాగుతోంది. ఈ సినిమాకి రెండో వారంలో కూడా కలెక్షన్స్ జోరు తగ్గలేదని చెప్పాలి. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలతో పాటు హిందీలో అత్యధిక కలెక్షన్స్ దిశగా ఈ చిత్రం దూసుకుపోతోంది. హిందీలో సరికొత్త రికార్డు క్రియేట్ చేయడానికి అడుగు దూరంలో ఈ మూవీ ఉంది. కేవలం 13 రోజుల్లోనే హిందీలో 601.50 కోట్ల కలెక్షన్స్ ఈ చిత్రం అందుకుంది. తద్వారా హిందీలో హైయెస్ట్ కలెక్షన్స్ అందుకున్న టాప్ చిత్రాల జాబితాలో రెండో స్థానంలో నిలిచింది.

13వ రోజు ఈ సినిమాకి 19.50 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ హిందీలో వచ్చాయి. దీంతో హిందీ భాషలో 600 కోట్ల మార్క్ ఈ చిత్రం దాటింది. హిందీలో హైయెస్ట్ కలెక్షన్స్ చిత్రాల జాబితాలో మొదటి స్థానంలో ఉన్న ‘స్త్రీ 2’ మూవీ 627 కోట్ల గ్రాస్ లాంగ్ రన్ లో వసూళ్లు చేసింది. అయితే ‘పుష్ప 2’ సినిమా జోరు చూస్తూ ఉంటే మరో రెండు రోజుల్లో ‘స్త్రీ 2’ కలెక్షన్స్ దాటేస్తుందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. అలాగే లాంగ్ రన్ లో కూడా ఈ మూవీ ఎనిమిది వందల కోట్ల కలెక్షన్స్ ని కేవలం హిందీలోనే సాధించే అవకాశం ఉందని భావిస్తున్నారు.

అదే జరిగితే ‘పుష్ప 2’ అరుదైన రికార్డును సొంతం చేసుకున్నట్లు అవుతుంది. వరల్డ్ వైడ్ గా కూడా ఈ చిత్రం 1400 కోట్లకు పైగా వసూళ్లు సాధించి ఇండియాలోనే హైయెస్ట్ కలెక్షన్స్ చిత్రాల జాబితాలో టాప్ 3లో ఉంది. ఇప్పట్లో మరో తెలుగు సినిమా ‘పుష్ప 2’ కలెక్షన్స్ ని బీట్ చేసే అవకాశం ఉండకపోవచ్చనే మాట వినిపిస్తోంది. అలాగే హిందీలో కూడా ఈ సినిమా లాంగ్ రన్ కలెక్షన్స్ బ్రేక్ చేయడం అంత ఈజీ కాదని సినీ విశ్లేషకులు అంటున్నారు.

ఇదిలా ఉంటే హిందీలో అత్యధిక కలెక్షన్స్ సాధించిన సినిమాల జాబితాలో ‘పుష్ప 2’ తర్వాత షారుఖ్ ఖాన్ ‘జవాన్’ మూవీ ఉంది. ఇది 585 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ లాంగ్ లో అందుకుంది. దీని తర్వాత ‘గదర్ 2’ నిలిచింది. తెలుగు సినిమా ‘బాహుబలి 2’ 511 కోట్లతో టాప్ 6 లో ఉంది. ‘పుష్ప 2’ ఇచ్చిన హైప్ తో భవిష్యత్తులో మరిన్ని సినిమాలు 1000 కోట్ల కలెక్షన్స్ క్లబ్ లో చేరే అవకాశం ఉందని ట్రేడ్ పండితులు భావిస్తున్నారు. ఇక తెలుగులో కూడా ఈ మూవీ 200 కోట్ల షేర్ క్లబ్ లో చేరిన మూడో చిత్రంగా నిలిచిందని టాక్ నడుస్తోంది. ఓవరాల్ గా హిందీలో అత్యధిక కలెక్షన్స్ అందుకున్న సినిమాల జాబితా చూసుకుంటే ఇలా ఉంది.

స్త్రీ 2 - 627Cr

పుష్ప 2 - 601.5Cr***(13days)

జవాన్ - 585Cr

గదర్ 2 - 525Cr

పఠాన్ - 524Cr

బాహుబలి 2 - 511Cr

యానిమల్- 505Cr

కేజీఎఫ్ 2 - 435Cr

దంగల్ - 374Cr

సంజు - 342 Cr

Tags:    

Similar News