పుష్ప రాజ్ టాప్ 3.. సెకండ్ వీకెండ్ కూడా అదే ఊచకోత

ఈ ఏడాది ఇండియన్ బాక్సాఫీస్ కింగ్ గా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ‘పుష్ప 2’ మూవీ నిలవబోతోంది.

Update: 2024-12-16 09:21 GMT

ఈ ఏడాది ఇండియన్ బాక్సాఫీస్ కింగ్ గా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ‘పుష్ప 2’ మూవీ నిలవబోతోంది. కచ్చితంగా ఈ సినిమా 1500+ కోట్లకి పైగా కలెక్షన్స్ ని సొంతం చేసుకోబోతోందని ట్రేడ్ పండితులు చెబుతున్నారు. ప్రస్తుతం మూవీ కలెక్షన్స్ ట్రెండ్ చూస్తున్న కూడా భారీ కలెక్షన్స్ కొల్లగొట్టడం గ్యారెంటీ అని అనుకుంటున్నారు. ఇప్పటికే మూవీ 1300 కోట్ల మార్క్ దాటేసిందనే మాట వినిపిస్తోంది. ముఖ్యంగా సినిమాలోని పుష్పరాజ్ క్యారెక్టర్ లో అల్లు అర్జున్ నటనకి ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు.

‘పుష్ప’ సినిమా కంటే 10 రేట్లు బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఈ సినిమాలో అల్లు అర్జున్ ఇచ్చాడని ఆడియన్స్ అంటున్నారు. ఇదిలా ఉంటే రెండో వారంలోకి దిగ్విజయంగా అడుగుపెట్టిన ‘పుష్ప 2’ మూవీ శనివారం 100 కోట్లకి పైగా కలెక్షన్స్ సాధించింది. ఆదివారం కూడా మరోసారి 104 కోట్లు వసూళ్లు చేసినట్లు సమాచారం. తద్వారా ‘పుష్ప 2’ ఖాతాలో రేర్ ఫీట్ నమోదయింది. 11వ రోజు 100 కోట్లకి పైగా కలెక్షన్స్ సాధించిన ఫస్ట్ ఇండియన్ మూవీగా ఈ చిత్రం నిలిచింది.

‘బాహుబలి 2’కి కూడా సాధ్యం కానీ రికార్డ్ ని ‘పుష్ప 2’ మూవీ అందుకుంది. ‘బాహుబలి 2’ లాంగ్ రన్ లో స్లో అండ్ స్టడీ ఫేజ్ లో భారీ కలెక్షన్స్ ని అందుకుంది. అయితే ‘పుష్ప 2’ మాత్రం 11 రోజుల్లోనే 1300 కోట్లకి పైగా కలెక్షన్స్ సాధించడం ద్వారా సరికొత్త ట్రెండ్ సృష్టించింది. తద్వారా ఇండియాలో హైయెస్ట్ కలెక్షన్స్ అందుకున్న మూడో చిత్రంగా ఈ మూవీ నిలిచింది. మొదటి స్థానంలో ‘దంగల్’ ఉండగా రెండో స్థానంలో ‘బాహుబలి 2’ నిలిచింది.

‘కేజీఎఫ్ 2’ ఆల్ టైం కలెక్షన్స్ రికార్డ్ ని ‘పుష్ప 2’ బ్రేక్ చేసేసింది. హిందీలో కూడా ఈ మూవీ కలెక్షన్స్ 600+ కోట్లు దాటినట్లు టాక్ వినిపిస్తోంది. నార్త్ ఇండియాలో అత్యధిక వసూళ్లు అందుకున్న డబ్బింగ్ చిత్రంగా ఈ మూవీ మరో రికార్డ్ ని తన ఖాతాలో వేసుకుంది. ఇలా రికార్డులని వరుసగా బ్రేక్ చేస్తూ కలెక్షన్స్ పరంగా ఈ మూవీ ప్రభంజనం సృష్టిస్తోంది.

‘పుష్ప 2’ తో ఇండియన్ సినిమాల మార్కెట్ స్టామినా ఏంటనేది మేకర్స్ కి ఒక అంచనా వచ్చినట్లేనని అనుకుంటున్నారు. రాబోయే రెండు, మూడేళ్ళలో ఇండియన్ సినిమాలు 2000 నుంచి 3000 కోట్ల వరకు వసూళ్లు చేసే అవకాశం ఉండొచ్చని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. నెక్స్ట్ రాజమౌళి నుంచి రాబోయే ‘SSMB29’ అన్ని రికార్డులని బ్రేక్ చేసి ఇండియన్ సినిమా స్టాండర్డ్స్ ని సరికొత్త జోన్ లోకి తీసుకొని వెళ్తుందని సినీ విశ్లేషకులు అభిప్రాయం పడుతున్నారు.

Tags:    

Similar News