కంగువా vs పుష్ప 2: థియేటర్స్ లెక్కలో ఊహించని రికార్డ్

తమిళ స్టార్ హీరో సూర్య ప్రధాన పాత్రలో, శివ దర్శకత్వంలో రూపొందిన భారీ బడ్జెట్ చిత్రం ‘కంగువా’ నవంబర్ 14న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమవుతోంది

Update: 2024-11-05 09:47 GMT

తమిళ స్టార్ హీరో సూర్య ప్రధాన పాత్రలో, శివ దర్శకత్వంలో రూపొందిన భారీ బడ్జెట్ చిత్రం ‘కంగువా’ నవంబర్ 14న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమవుతోంది. ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో విడుదల చేస్తున్న సందర్భంగా నిర్మాత ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రపంచవ్యాప్తంగా ఏకంగా 10,000 స్క్రీన్‌లలో ‘కంగువా’ను విడుదల చేయనున్నట్లు తెలిపారు.

దక్షిణాది రాష్ట్రాల్లో 2,500 స్క్రీన్‌లు, ఉత్తరాదిలో 3,500 స్క్రీన్‌లతో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. సూర్య కెరీర్‌లో ఇది మరో భారీ స్థాయి చిత్రం అవుతుందని ధనుంజయ్ ఆశాభావం వ్యక్తం చేశారు. ‘కంగువా’లో సూర్య ఆరు విభిన్న పాత్రల్లో కనిపించనున్నారని, యాక్షన్ మరియు ఎమోషన్స్‌కు ప్రాధాన్యం ఇవ్వబోతున్నట్లు వెల్లడించారు. ఈ చిత్రంలో దిశా పఠానీ కథానాయికగా నటిస్తుండగా, బాబీ దేవోల్ ప్రతినాయకుడిగా కనిపించనున్నారు.

ఇక, మరో భారీ స్థాయి చిత్రం ‘పుష్ప: ది రూల్’ కూడా త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అల్లు అర్జున్ ప్రధాన పాత్రలో సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని 11,500 స్క్రీన్‌లలో విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఇండియాలో 6,500 స్క్రీన్‌లలో, ఓవర్సీస్‌లో 5,000 స్క్రీన్‌లలో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ‘పుష్ప: ది రైజ్’ విజయంతో వచ్చిన ఈ సీక్వెల్‌పై భారీ అంచనాలు ఉన్నాయి.

ఈ రెండు చిత్రాలు భారీ స్క్రీన్‌లలో విడుదల అవుతున్న నేపధ్యంలో అభిమానులు మరియు సినీ పరిశ్రమలో చర్చకు దారి తీస్తుంది. ‘కంగువా’ చిత్రం సూర్య కెరీర్‌ను మరో స్థాయికి తీసుకెళ్తుందనే నమ్మకంతో నిర్మాత ఉన్నారు. అలాగే, ‘పుష్ప 2’ కూడా అల్లు అర్జున్‌కు పాన్-ఇండియా స్థాయిలో మరింత పాపులారిటీని అందిస్తుందని నిర్మాతలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

ఈ భారీ చిత్రాలు విడుదల కాబోతున్న నేపధ్యంలో, ఎవరి చిత్రం ఎక్కువ వసూళ్లు సాధిస్తుందో అనేది ప్రేక్షకుల ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అలాగే 1000 కోట్ల బాక్సాఫీస్ టార్గెట్స్ ను ఫిక్స్ చేసుకున్నారు. కొడితే గట్టిగా కొట్టాలి అనేలా ప్రమోషన్స్ కూడా హై రేంజ్ లోనే చేస్తున్నారు. ఏమాత్రం గ్యాప్ తీసుకోకుండా సూర్య అన్ని భాషల్లో సినిమాకు హైప్ క్రియేట్ చేసేలా ప్రమోట్ చేస్తున్నారు.

Tags:    

Similar News